April 19, 2024

గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు

ఈ మధ్యకాలంలో భారతీయ గృహహింస నిరోధక చట్టం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఆ చట్టం బాధిత స్త్రీలకు ఉపశమనం కలిగిస్తుందని సాధారణ ప్రజల అభిప్రాయం. అయితే దాని దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆకాశరామన్న గారు తన దృక్కోణాన్ని ఈ వ్యాసం ద్వారా మనతో పంచుకుంటున్నారు.

A,B అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాదా వచ్చి పడింది. దాన్ని పరిష్కరించమని మరో వ్యక్తి దగ్గరకి వెళ్ళారు. ఆ వ్యక్తి ఒక నిబంధన ప్రకారమే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన ఏమిటంటే, తన వద్ద ఉన్న నాణేన్ని ఎగరేసి… వచ్చిన ఫలితం “బొమ్మ” అయితే — తీర్పు Bకి “వ్యతిరేకంగా” ఇవ్వాలి, అతీర్పు Bకి విపరీతమైన నష్టాన్ని, కష్టాన్ని కలిగించేదైనా పట్టించుకోనక్కర్లేదు. ఫలితం “బొరుసు” అయితే — తీర్పు A కి “ఎలాంటి నష్టం కానీ, కష్టం కానీ కలగకుండా” ఇవ్వాలి, వీలైతే అనుకూలంగా కూడా ఇవ్వచ్చు.

ఇదేం నిబంధనా? వచ్చిన ఫలితంతోగానీ, తప్పెవరిది అన్న నిజంతోగానీ సంబంధం లేకుండా Bకి వ్యతిరేకంగానే తీర్పువస్తుంది కాబట్టి దీనంతటి వివక్షాపూరితమైన నిబంధన ఇంకొకటి ఉండదు అని అంటారా..? సరే ఈ విషయాన్ని కాస్త పక్కనబెట్టి, స్త్రీల రక్షణకోసం చేయబడిన ఓచట్టాన్ని కాస్త పరిశీలిద్దాం.

గృహహింస నిరోధక చట్టం 2005 గృహహింస నిరోధక చట్టం ఒకసారి చదినవారు ఎవ్వరైనా, అసలు ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన చేయొచ్చా? చేసినా ఆమోదాన్ని పొందగలుగుతుందా అన్న సందేహాలు పొందకుండా ఉండడం అసంభవం. కానీ, ప్రస్తుత స్త్రీవాద ప్రపంచములో అది సాధ్యమేనన్న విషయం 2006 అక్టొబరులోనే అందరికీ అవగతమయింది.

అసలు గృహహింస అంటే ఏమిటి? ఈ చట్టం, స్త్రీలపై జరిగే శారీరక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థికంగా జరిపే హింస, స్త్రీ ఆరోగ్యం, భధ్రతలకు విఘాతం కలిగించడం, కట్నము తెమ్మని వేధించడంలాంటివే కాకుండా, మాటలద్వారా కలిగే హింసను కూడా చేర్చి గృహహింస అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని కల్పించింది. ఇందులో బాదితురాలు కేవలం స్త్రీ మాత్రమే, ఆమె కుటుంబములోని ఏస్త్రీయైనా కావచ్చు. వారందరికీ ఈ చట్టం గృహహింసనుండి రక్షణ కల్పిస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఆంశము ఏమిటంటే స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే, ఆమె ఉంటున్న ఇల్లు ఆమెది కానప్పటికీ అందులోనుండి ఆమెను పంపించే వీలు లేదు. ఈ చట్టం, ఇది వరకు జరిగిన హింసే కాదు, భవిష్యత్తులో హింస జరిగే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. (Not only the actual abuse but also the threat of abuse too considered)

ఈ చట్టంపైనున్న అభ్యంతరాలేమిటి:
ఈ చట్టం అమలులోనికి వచ్చిన దగ్గరనుండి మొదలుకొని ఇప్పటి వరకూ దీనిమీద వెల్లువెత్తిన విమర్శలు బహుశా మరే చట్టం మీద వచ్చివుండవు. సామాన్యుడి దగ్గరనుండి అటార్నీ జనరల్ వరకూ ఈ చట్టాన్ని అందులోని కొన్ని ఆంశాలను తీవ్రంగా విమర్శించడం జరిగింది. అంతగా విమర్శలను ఎదుర్కొన్న ఈ చట్టంలో ఉన్న కొన్ని అంశాలు..

1. ఈ గృహహింస చట్టం ప్రకారం, స్త్రీ తాను చేసే ఆరోపణలకు ఎటువంటి సాక్షాధారం చూపించనవసరం లేదు. కేవలం ఆమె నోటిమాటనే సాక్షంగా స్వీకరించి, ప్రతివాదిని దోషిగా పరిగణిస్తుంది. ఆవిడ ఏమి చెప్పినా, అది నిజం కాదని ప్రతివాది నిరూపించేంత వరకూ, అది నిజంగానే చెలామని అవుతుంది. అంటే స్త్రీలందరూ సత్యం మాత్రమే పలికే సత్య హరిశ్చంద్రుని ఆంశ అని, దానికి వ్యతిరేకంగా నిరూపించబడే వరకూ భావించాలన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మగవాడిని స్త్రీ దయాదాక్షిణ్యాల మీద బతుకమని చెప్పడంలాంటిది.

2. ఇందులో గృహహింసకు ఇచ్చిన నిర్వచనాన్ని పరిశిలిస్తే, శారీరక హింస, ఆర్థికంగా జరిగే హింసల్లాంటివి జరిగాయనో/జరగలేదనో నిరూపించ వచ్చు. కానీ మానసిక హింసను, మాటలద్వారా కలిగే హింసను నిరూపించడం దాదాపుగా కుదరక పోవచ్చు. ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, ఇటువంటి హింసలు స్త్రీలు నిరూపించలేకపోవడానికి కారణం వాటికి సరైన సాక్షాధారాలు చూపించడం కుదరకపోవడమే అని వాదించిన స్త్రీవాదులే, ఇప్పుడు అదే హింస జరగలేదని నిరూపించుకునే భాధ్యత పురుషుడిదే అని సెలవివ్వడం. కష్టం ఎవరికైనా కష్టమే కదా? మరి మగవారిపై ఎందుకంత వివక్ష?

3. ఈ చట్టం ప్రకారం, ప్రతివాది మీద కేసును భాదిత స్త్రీయే పెట్టనవసరంలేదు. ఎవ్వరైనా పెట్టవచ్చు. కావలసిందల్లా ఆ స్త్రీకి అది అవసరమని అవ్యక్తి భావిస్తేచాలు. అంటే, ఆమె బందువులు, స్నేహితులు, పక్కింటోల్లు, చివరకు ఆమె ప్రియుడు కూడా భర్త మీద గానీ, ఆ గృహంలోని మరోపురుషుడి మీద గానీ కేసును పెట్టొచ్చు. ఇంకోవిషయమేమిటంటే, ప్రస్తుతం వివాహబంధములో ఉన్న స్త్రీలే కాదు, విడాకులు పొందిన స్త్రీలు, సహజీవనం చేసే స్త్రీలు (Live – in relationships) కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకసారి, ఈరెండింటినీ కలిపి ఆలోచించండి, ఇవి పురుషుడి జీవితాన్ని ఎలాప్రభావితం చేస్తాయో? అసలు ఈ చట్టము దుర్వినియోగం జరుగుతుంది అంటే ఆశ్చర్య పోయే వారు బహుశా వీటిని చాలా కన్వీనియంట్‌గా విస్మరించడం జరుగుతోందని చెప్పొచ్చు.

4. ఈ చట్టములో ఉన్న ముఖ్య అంశాలలో ఒకటి స్త్రీకి నివాసపు హక్కును కల్పించడం. అంటే తాను నివసిస్తున్న ఇంటినుండి ఆమెను బయటకు పంపించే అధికారం ఎవ్వరికీ ఉండదు. అది అద్దె ఇల్లు అయినా సరే. ఒకానొక కేసులో సుప్రీం కోర్టు ఈ నివాసపు హక్కుపై స్పందిస్తూ, వివాహిత మహిళకు తన భర్త ఇంటిలోమాత్రమే అధికారం ఉంటుందని తేల్చిచెప్పి కొంత ఉపశమనాన్ని కలిగించడమే కాదు, ఈ చట్టం అత్యంత లోపభూయిష్టంగా కూర్చిన చట్టంగా (Losely drafted law) అభివర్ణించింది. దీన్ని స్త్రీవాదులు వ్యతిరేకించినా, సుప్రీం కోర్టు ముందు వారి ఆటలు సాగలేదు. మరో విషయం ఏమిటంటే, ఈ చట్టాన్ని ఉపయోగించి, ప్రస్తుతం జరుగున్న హింసనే కాదు, భవిష్యత్తులో జరిగే అవకాశమున్న హింసమీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపితే మగవారి హక్కులకు తీవ్రవిఘాతమేర్పడుతోంది. ప్రతివాది కారణంగా తనకు ముప్పు పొంచి ఉంది అని వాదించి, అతని సొంత ఇంటినుండి అతన్ని వెల్లగొట్టవచ్చు. అంతే కాదు, అతను ఆమె నివసించే పరిసరప్రాంతాలకు రాకుండా నిరోదించ వచ్చు. ఒకవేల అతను దీన్ని అతిక్రమించినట్లు రుజువైతే అది క్రిమినల్ కేసూవుతుంది. దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.

5. అసలు వీటన్నింటికన్నా అతిపెద్ద దారుణమేమిటంటే, గృహహింస అంగానే భాదితులు కేవలం స్తీలు మాత్రమేనని, మగవారు ప్రతివాదులు మాత్రమే అనే అభిప్రాన్ని బలపరిచేలా ఒక చట్టం చేయడం. అసలు సిసలైన వివక్షకు నిదర్శనం. స్త్రీల హక్కులన్నీ మానవహక్కులే అనేవాళ్లు, పురుషుల హక్కుల విషయములో చూపించిన హ్రస్వదృష్టికి నిదర్శనం. ఇది అంతర్జాతీయ మనవహక్కుల నిభందనలకేకాదు, మన రాజ్యాంగములోని సమానత్వ సిద్దాంతాలను కూడా తుంగలో తొక్కుతోంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా జరిగిన అనేక పరిశోధనలలొనూ, అధ్యయణాలలోను తేలిన విషయమేమిటంటే, గృహహింస అనేది ఏఒక్కరికో సంభందించినది కాదు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ గృహహింసకు లోనవుతున్నారన్నరని, స్త్రీలు మగవారితో సమానంగా, కొన్నిసార్లు మగవారికన్నా ఎక్కువ అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తారని నిరూపించబడింది. శారీరకంగా స్త్రీ బలహీనురాలైనప్పటికి దాన్ని ఏదైన ఒక వస్తువుని విసరడము ద్వారా కానీ, మరేదైనా ఆయుధాన్ని ఉపయోగించడం ద్వారాకానీ స్త్రీలు అధిగమిస్తున్నారని తేల్చింది. మరి స్త్రీలనగానే బాధితురాలు, పురుషులు అనగానే హింసించే వారు అనడం వివక్ష కాక మరేమిటి? గృహహింస పట్ల, మగవారి పట్ల సమాజములో ఉన్న దృక్పథాన్ని (అపోహలను) అద్బుతంగా చిత్రీకరించిన ఈ విడియోని ఒక సారి చూడండి.

6. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన స్త్రీలకు ఎటువంటి శిక్షా ఉండదు. అంటే ఇది దుర్వినియోగం చెయ్యండని వారిని ప్రోత్సహించడమే. ఇవే కాదు, గృహహింస నిరోధక చట్టం గురించి ఇంకా చాలా రాయొచ్చు. విశేషమేమిటంటే చట్టం దుర్వినియోగమె కాదు, సద్వినియోగమే జరిగినా అది కొన్నిసార్లు మగవారి హక్కులకు తీవ్రవిఘాతం కలిగించడం అత్యంత శోచనీయం.

ఇప్పుడు మనం వ్యాసం మొదట్లో చెప్పుకున్న, నాణేన్ని ఎగరేసి తీర్పు ఇచ్చే నిభందనను ఒక సారి పరిశిలిద్దాం. ఇక్కడ ఉన్న గొప్పవిషయమేమిటంటే, A,B ఇరువురికీ తమకు న్యాయం చేయమని కోరే హక్కువుంది. కానీ మన చట్టములో ఆ అవకాశం ఉండదు. A,Bలిద్దరిలో ఎవ్వరైనా తమ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకూ నిర్దోషిగానే ఉంటారు. కానీ ఘణత వహించిన ఈ స్త్రీ సంరక్షణ చట్టాలలో, కాదని నిరూపిన అయ్యే వరకూ మగాడు దోషే. నిర్దోషత్వాన్ని నిరూపించుకునే భాధ్యత అతనిదే. అంతే కాదు, దుర్వినియోగం చేసిన స్త్రీకి ఎలాంటి శిక్షా ఉండదు.

కాకపోతే, ఈ చట్టాలు మరీ బొమ్మ, బొరుసు వేసినట్టుగా కాకుండా ఒక పద్దతి ప్రకారం విచారణ జరిపేలా చేస్తాయి. కానీ, జెండర్ సెన్సిటివిటీ, స్త్రీల సమస్యల పట్ల అవగాహన అన్న పేరుతో మీడియాని, పోలీసులనూ స్త్రీవాదులు ఎప్పటికప్పుడు బ్రయిన్-వాష్ చేస్తూ ఉంటారు. వీరికి జెండర్ సెన్సిటివిటీ ప్రోగ్రాములు ఇస్తుంటారు. వారు కానీ పొరపాటున స్త్రీలు దీన్ని దుర్వినియోగ పరిచే అవకాశముంది అనో, లేదా మగవారిపై కుడా గృహహింస జరిగే అవకాశముంది కదా అనో అభిప్రాయాన్ని వ్యక్తపరిచితే, వారికి Gender Sensitivity లేదనితేల్చి పారేస్తారు. Gender Sensitivity మీద వారందరికీ అవగాహన ఉండాలని డిమాండు చేస్తారు. ఈ తరహా Gender Sensitivity లేదని వాపోయే స్త్రీవాదులను మనం తరచూ చుస్తూనే ఉంటం. అంటే వీరు వివక్షాపూరిత చట్టాలు రూపొందించడముతో ఆగడం లేదు, వివక్షాపూరిత వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఇక మగాడికి న్యాయం ఎలా జరుగుతుంది (హీన పక్షం కనీసం అన్యాయం జరగకుండా ఎలా ఉంటుంది).

అందుకేనేమో రేణుకా చౌదరి ఒకానొక సందర్భంలో “It’s time for men to suffer” అంటూ జాతీయ ఛానెలులోనె చెప్పారు.

P.S: భారతదేశములో ఉండే మగాళ్ళందరికీ, ఆమాటకొస్తే గృహహింస నిరోధక చట్టంలాంటీ చట్టాలు అమలవుతున్న దేశాలన్నింటిలోని మగాళ్ళందరూ తప్పకుండా పాటించాల్సిందేమిటంటే, ” ఎట్టి పరిస్థితులలోనైనా సరే ఇల్లు కొనడం అనే పనిని మానుకోవాలి”. ఇల్లు అనేది మగాడి ఆస్తికాదు. అదెప్పుడో స్త్రీల ఆస్తిగా మారిపోయింది. నీది కాని దానికోసం నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును EMIలు కట్టడానికో, ఇల్లు కట్టడానికో వెచ్చించడం ఏమాత్రం వివేకవంతమైన పనికాదు.
So Never Buy A Home.

32 thoughts on “గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు

  1. పోలీసులు విశృంఖలంగా లాకప్పుల్లో హత్యలూ మానభంగాలూ చేస్తున్నారని నెత్తీ నొరూ బాదుకునే మావతావాదులూ, స్త్రీ వదులూ, కమ్యూనిస్టు వాదులే మరో పక్క అదే పోలీసుబలాన్ని ఊతగా చేసుకుని పురుషులని నిర్దాక్షిణ్యంగా శిక్షించే DV Act వంటి ఆటవిక న్యాయాలని సమర్ధించంచడం శోచనీయం. DV Act దుర్వినిమయం వల్ల శిక్షింపబడుతున్న పురుషుల్లో మెజారిటీ శాతం వారు చాలా సామాన్య వ్యక్తులు – సగటు జీతగాళ్ళు, తమ మానాన తమ బతుకు వెళ్ళబుచ్చడం తప్ప అన్యమూ తెలియని సగటు జీవులు. కానీ వారివల్ల మరొకరి భద్రతకి ఏ విధమైన ప్రమాదమూ లేదని తెలిసీ కూడా వారిని టెర్రరిస్టులూ నక్సలైట్ల హోదాలో నేరచరిత్రుల కింద జమకట్టి నిర్బంధించమంటుంది గృహహింస చట్టం. సరే స్త్రీల భద్రతకి పనికొచ్చే చట్టమనుకున్నా నిందితుడైన పురుషుడి కుటుంబంలో స్త్రీబాలవృద్ధుల భేదాలైనా పాటించకుండా అందరినీ అమానుషంగా శిక్షించడమెందుకట?

    DV Act మానవ హాక్కులకి ఉల్లంఘిస్తోంది. ఆధునిక రాజ్యాంగాలన్నీ కులమతలింగవర్గవర్ణ భేదాలకతీతంగా వ్యక్తుల హక్కులని సమర్ధిస్తున్నాయి. కోటిమంది మగవారు స్త్రీల మీద దౌర్జన్యాలు చేసి వుండవచ్చు గాక. కానీ తదాధారంగా కోటిన్నొక్క మగవాణ్ణి దోషిగా ప్రకటించే హక్కు విచారణ జరపని న్యాయస్థానాలకి లేదు. పోలీసు స్టేషన్లకి అంతకన్నా లేదు. దీన్నే న్యాయ పరిభాషలో Habeus Corpus అని పిలుస్తారు – అంటే సామాన్య పరిభాషలో innocent until proven guilty అని భావము. చివరకి హత్య చేసిన నేరస్తులకి కూడా ఆధునిక రజ్యాంగాలన్నీ ప్రసాదిస్తున్న హక్కు ఇది. ఈ నేపధ్యంలో, కేవలం లింగపరమైన భేదం వల్ల ఒక ఆడదాని నిరాధారిత ఆరోపణలకి సమర్ధుడైన న్యాయమూర్థి ఇచ్చిన criminal judgement ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగన్నేమనాలి? ఆ విధమైన శాసనాన్ని ఆమోదించిన లోక్ సభనేమనాలి?
    మనకి పైకి రాజ్యాంగముందనీ, అది సామాన్యులని సమ్రక్షిస్తుందనే అపోహలో ఎంత గర్వపడినా కూడా – దాని నిజ రూపమేమిటో మనకందరికీ తెలుసు. దాని సమ్రక్షణలో ఎందరో నేరచరిత్ర కల వాళ్ళు పెద్దమనుషులుగానూ, ప్రజానాయకులుగానూ లక్షణంగా చెలామణీ అవుతున్నారు. వేలకోట్ల స్థాయిలో వ్యాపారాలు చేస్తూ రాయితీలు, పన్నుల ఎగవేతలూ ఇబ్బడి ముబ్బడిగా అనుభవిస్తున్న సార్ధవాహక వంశాలున్నాయి. ప్రజల డబ్బు దోచి విదేశీ కాంట్రక్టులు పోషించి లంచాలతో పడగెత్తిన ప్రభుత్వోద్యోగులున్నారు, రాజకీయ నాయకులున్నారు. ఈ రాజ్యాంగం అశీస్సులతో ఎన్నో ప్రజా ఉద్యమాలు, మౌలికమైన మతహక్కులు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడ్డాయి. ఇలా చెప్పుకు పోతే మన 60 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ప్రజల స్వామ్యమెంత? ప్రజలని తమ చిత్తవొచ్చినట్లు దోచుకునే బలవత్తర వర్గాల స్వామ్యమెంత? స్త్రీ వాదాన్ని కూడా ఒక ప్రజా సంస్ఖేమానికి వ్యతిరేకమైన ఒక బలవత్తరమైన మైనారిటీ వాదంగానూ, హక్కులపేరుతో స్వైరవిహారం చేస్తున్న ఒక దుర్నీతిగానూ భావించాలి.

    పాశ్చాత్యదేశాల్లో DV Actకి సమానాంతర న్యాయాలు ఒక అర శతాబ్దం కిందటే వచ్చాయి. అవి మొదట్లో “స్త్రీలు అబలలు” అనే వాదాన్ని సమర్ధిస్తూ పురుషుల మీద వివక్ష చూపించినా, కాలగతిలో అవి స్త్రీల వల్ల దుర్వినిమయాలౌతున్నాయనే సత్యాన్ని న్యాయస్థానాలు గుర్తించాయి. పాశ్చాత్య దేశాల్లో పురుషుల హాక్కులు హరించడం మన అవినీతి రాజ్యంలో, అవకతవక రాజ్యాంగంతో, లంచగొండి ఖాకీ జీవుల దౌర్జన్యంతోనూ సాధించినంత సులువు కాదు. అంతే కాదు స్త్రీ భరణానికి కూడా కాలపరిమితులున్నయి. విడాకులు పొందినంత మాత్రాన ఒక స్త్రీని ఆమె మాజీ భర్త శాశ్వతంగా పోషించనక్కర లేదు. [నాకు తెలిసి 2-3 సంవత్సరాల తర్వాత భరణం ఇవ్వక్కర లేదు, పిల్లలుంటే తప్ప]. కానీ ఈ చట్టాల బారిన పడకుండా వుండేటందుకు అభివృద్ధి చెందిన దేశాల్లో పురుషులు వివాహానికి బహుదూరంగా నడచుంటున్నారు. ఒక వేళ పెళ్ళిళ్ళు చేసుకున్నా తమతో సమాన ఆర్ధిక-విద్యా-ఉద్యోగ స్థాయిలున్న స్త్రీలనే వెతుక్కు పెళ్ళి చేసుకుంటారు. పర్యవసానంగా భర్త యొక్క ఆర్ధికౌన్నత్యాన్ని పెళ్ళి-తదుపరి-విడాకుల ద్వారా ఫ్రీగా అనుభవించే వెసలు చాల వరకూ నిర్మూలింపబడింది. పర్యవసానం ఇదమిత్థమని చెప్పడం కష్టం. కానీ వివాహ వ్యవస్థకున్న సంప్రదాయికమైన ప్రాతిపదికని – అంటే భర్త ఆర్ధికబాధ్యతలని నెత్తిన వేసుకునే వాడు, భార్య కుటుంబజీవనానికి ఇరుసు వంటిది – నిర్మూలించడంలో ఈ చట్టాలు చాలా వరకూ కృతకృత్యాలయ్యాయి. అంతమాత్రాన అది అందరికీ సంతోషప్రదమైన జీవితాలనిచ్చిందనుకుంటే పొరబాటు. తత్స్థానే కుటుంబజీవితమంటే కష్టసుఖాలని అప్రయత్నంగా పంచుకునే ఇన్షూరెన్సు పాలసీ వంటిదనే తత్త్వం పోయి – అది ఎగ్రెమెంటులమీద, కాంట్రాక్టుల మీదా నడిపే ఆఫీసు వ్యవహారంగా మారింది. వివాహవ్యవస్థ కుంటుపడ్డ అనేక పాశ్చాత్యదేశాల్లో జనాభా పెరగడం మాని తరుగుతున్నది. పర్యవసానంగా ఉన్న వృద్ధులని పోషించడానికి కావలసినంత మంది యువ, నడి వయస్కులు కరువౌతున్నారు. [నా అభిప్రాయంలో తమకై తాము సంతానాన్ని కని, పెంచి ప్రయోజకులని చెయ్యని వారు, తాము వృద్ధులైనాక తమకన్నా చిన్నవారి సహాయ సహకారాలని ఆశించడానికి అనర్హులు].

    కుటుంబ వ్యవస్థ స్త్రీవాదులు రచించింది కాదు. ఆధునిక రాజ్యాంగాలు రచించినదీ కాదు. ఈ రాజకీయ వ్యవస్థలూ లేని కాలంలో మనుగడకోసం మానవ సమాజాలన్నీ ఏర్పరచుకున్న మౌలిక సూత్రం. సమస్తమైన నాగరికతకీ అది మూల సూత్రం. DV Act మెజారిటీ ప్రజలకి ఏ విధంగానూ పనికిరాదు. క్షణికావేశాల్లో కుటుంబసమస్యలని పోలీసుల చేతుల్లోనూ లాయర్ల చేతుల్లోనూ పెట్టి సుఖపడగలనని ఏ వివేకమున్న స్త్రీ కూడా అనుకోదు. కనక ఈ చట్టం ఒక విపరీత మనస్తత్వం ఉన్న మైనారిటీ స్త్రీపక్షంకోసం నిర్మించబడింది. అందువల్ల మెజారిటీ వాళ్ళకి నష్టమేమిటంటారా? వెయ్యి మంది ఉన్న ఊరిని తగలబెట్టడానికి వెయ్యిమంది పిచ్చివాళ్ళక్కరలేదు. విశ్వాసబలమూ, సాధనసామగ్రి వున్న పిచ్చివాడొకడు చాలు.

    చట్టన్ని దుర్వినియోగం చెయ్యడం కూడా ఒక నేరప్రవర్తనేను. అన్ని స్థాయిల్లోనూ అటువంటి నడవడులకి శిక్షలూ, పరిహారాలూ వున్నాయి. Damage Compensation లు అందుకుద్దేశించి ఏర్పరచబడ్డాయి. DV Act ని ఇందుకు భిన్నంగా రూపొందిచడం, మన రాజ్యాంగానికున్న అవిటితనాన్ని మరోకోణంలో చాటి చెపుతోంది. నా అభిప్రాయంలో ఈ ప్రస్తుతపు పరిస్థితికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇలా సూచిస్తున్నాను. DV Act బాధితులందరూ కూడా Save Indian Family (SIFY) అనే సంఘంలో చేరి పరస్పర సహయాన్ని పొందుతున్నారు. దీనికే అనుబంధ సూచనగా ఏయే స్త్రీలైతే DV Actని వాడుకుని కుటుంబజీవితాన్ని భిన్నం చేశారో లేదా చేస్తున్నారో, ఆ స్త్రీల పేర్లు, Identity, అడ్రసు వివరాలని ఒక National Registryలో నమోదు చెయ్యాలి. ఆ స్త్రీలతో మునుముందు సంబంధాలు నెరపడంలో తక్కిన పురుషులు జాగ్రత్త పడగలరు.

    ఆకాశరామన్న గారూ – తెలుగు అంతర్జాలవేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించి మీరొక వైతాళికులయ్యారు. అదేం చిత్రమో గానీ – తెలుగు అంత్రజాలంలో అనేక వాదాల వారున్నారు – స్త్రీ వాదులనీ, దళితవాదులనీ, ఆధునికవాదులనీ, ప్రపంచీకరణ వాదులనీ, తద్వ్యతిరేకులనీ, మానవతా వాదులనీ, ఇంకా తెలుగులో ఎన్ని కవితా ఖండికలు రాశారో అన్ని వాదాల వారున్నారు. ఎన్ని కథలు, కథానికలు, నవలలు రాశారో అన్ని వాదాలున్నాయి. కానీ ఎవ్వరూ ఈ DV Act అందున్న విచిత్రవాదాన్నీ కనీసం పరామర్శించే ధైర్యాన్ని కనబరచ లేదింతవరకూ.

    – తాడేఫల్లి హరికృష్ణ

    1. తాడేఫల్లి హరికృష్ణ గారూ,

      చక్కని సమాచారాన్ని అందించారు ధన్యవాదాలు. Save Indian Family Foundation (SIFF) అనేది ఒక అంబ్రెల్ల ఆర్గనైజేషను లాంటిది(Umbrella Organisation). ఒకే ఆశయం కోసం, వివిధ చోట్ల ఉన్న వివిధ సంస్థలు అన్నీ కలిసి ఏర్పడిన సంస్థ అని అన్నట్లు గుర్తు. Save Indian Family వారు,కేవలం పురుషుల కోసం కాకా, కుటుంబం కోసం పోరాడుతున్నారు.

      ప్రస్తుతం స్త్రీలకొరకు ఉద్దేశించిన చట్టాలు ఏ స్థాయిలో దుర్వినియోగమవుతున్నాయో కొంతమంది కైనా తెలిసింది అంటే అది వారి పోరాటాల ఫలితమే.

  2. 1) ఎట్టి పరిస్థితులలోనైన ా సరే ఇల్లు కొనడం అనే పనిని మానుకోవాలి
    2) This will encourage males towards co-habitation and avoid marriage altogether. As it happened in the west.

    3) The birth rates plummet as it happened in Europe

    4) Family as a institution will disintegrate as it happened in West

    5) marriages are delayed until 40s or 50s as it is happening in the West

    6)

    7))

  3. ఏదేమైనా వాస్తవాల్ని విస్మరించి వివాదస్థులలో కేవలం ఒక పక్షానికి మాత్రమే వత్తాసుగా నిర్మించే చట్టాలు అల్పాయుర్దాయం గలిగినవి. ఎలాంటి పిడివాదంతోనైనా సరే వాటిని సదాకాలం నిలబెట్టడం అసాధ్యం. Urban Land Ceiling Act ని ఎత్తేసినట్లే వాటిని కూడా ఎత్తేయించే రోజొస్తుంది.

    ఎన్ని చెప్పినా ఇది అంతిమంగా మగజాతి యొక్క భుజబలంతో నడిచే ప్రపంచం. అతని మీద legal disabilities విధించి దేశాల్నీ, ప్రభుత్వాల్నీ, వ్యవస్థల్నీ నడపడం అసాధ్యం. ఎందుకంటే కుటుంబంతో సహా అతనే అన్నింటికీ కేంద్రస్థానం. ఎన్ని వీర ఫెమినిస్టు క్లెయిముల చేసినా గ్రౌండ్ లెవెల్ లో ఆడవాళ్ళతో అయ్యేదేమీ లేదు. వాళ్ళది ఎప్పుడూ సహాయకపాత్రే. ఒక మగవాడికి చెప్పి అతని చేత ఇంకో మగవాణ్ణి, లేదా ఇంకో ఆడదాన్ని తన్నించి చాటుగా నవ్వుకోవడం ఆడజాతి అనాదిగా అవలంబిస్తున్న మనుగడ మంత్రం (survival mantra) . ఈ DV చట్టం అందుకు భిన్నమని తోచదు. కానీ మగజాతి ఈ విషయాన్ని గ్రహించేలా పురుష హక్కుల కార్యకర్తలు ప్రయత్నించాలి.

  4. వయసొచ్చి, చదువుకుని మేజర్ అయి అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేస్తూ దేశపౌరసత్వం పొంది, అన్ని ఆర్థిక రాజకీయ హక్కులూ గలిగిన ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి పోషించాలనడం న్యాయమేనా ? అలా అని ఏ చట్టం చెబుతోంది ? అన్నీ సక్రమంగా ఉండి “ఓ మగాడా ! మమ్మల్ని పోషించు” అని నోరు తెఱిచి అడగడానికి సిగ్గుండనక్కఱలే దా ? ఇదేదో వీరముష్టిలా ఉంది.

    మఱి అలా అయితే తముళ్ళని అన్నలూ, అన్నల్ని తమ్ముళ్లూ ఎందుకు పోషించడం లేదు ? అక్కల్ని చెల్లెళ్ళూ, చెల్లెళ్ళని అక్కలూ ఎందుకు పోషించడం లేదు ? ఏ మగవాడు ఏ ఆడదానికి పెళ్ళిసమయంలో వాగ్దానం చేశాడు, “నేను నిన్ను పోషిస్తా”నని ? నేను తెలుసుకోగలుగుతు న్నాను. మనుషులు ఎవఱికైనా భార్యలో భర్తలో కాదు, ముందు వాళ్ళు Full-fledged స్వతంత్ర వ్యక్తులనే విషయాన్ని ఈ దేశంలో ఇంకా గుర్తించలేదని తోస్తున్నది. లేదా పాక్షికంగానే ఆ వ్యక్తిత్వానికి గుర్తింపు నిబ్చారు. ప్రజల్లో ఆ చైతన్యం తేవడానికి పురుషహక్కుల కార్యకర్తలు కృషి చేయాలి.

  5. నవ్వొస్తోంది. పురుషత్వానికి దిక్కు లేదు గానీ తండ్రితనం ఒకటి కావాలా మాకు ? ఆడవాళ్ళలాగా మగవాళ్ళకు అంత లావున సంతానవాంఛేమీ ఉండదు. పెళ్ళికి అదొక అదనపు బోనస్. అంతే ! కాబట్టి పితృత్వం ఆఫర్ తో మగవాళ్ళని ప్రలోభపెట్టడం అసాధ్యం. ముందు మేము (మగవాళ్ళం) బావుంటేనే గదా మా కొడుకులు బావుండేది ? ఆధునిక ప్రభుత్వాలు వివాహాన్ని గుర్తించక ముందునుంచీ అతిప్రాచీనకాలం నుంచీ వివాహాలున్నాయి. డిరికగ్నైజ్ చేసినా అవి ఉంటాయి. ఎటొచ్చీ ఫెమినిస్టులు ఆడే క్రూరమైన డ్యాన్సులు మాత్రం ఉండవు. DV చట్టం Live in గుఱించి చెబుతోంది. కానీ అది వేశ్యలకు వర్తించదు. కాబట్టి భవిష్యత్తులో మగవాళ్ళు వేశ్యలతో తృప్తి చెందుతారు. నాకు తప్పేం కనిపించడం లేదు. ఆస్తుల్లో వాటా కోసమూ, భరణాల కోసమూ మొగుణ్ణి కొట్టి కోర్టులని ఆశ్రయించే సోకాల్డ్ భార్యలకంటే తృణమో పణమో పుచ్చుకుని తృప్తిచెందే బజారు వేశ్యలు చాలా నయం. అసలు వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ పవిత్రురాళ్ళు కూడా.

    1. *కాబట్టి భవిష్యత్తులో మగవాళ్ళు వేశ్యలతో తృప్తి చెందుతారు. ఆస్తుల్లో వాటా కోసమూ, భరణాల కోసమూ మొగుణ్ణి కొట్టి కోర్టులని ఆశ్రయించే సోకాల్డ్ భార్యలకంటే తృణమో పణమో పుచ్చుకుని తృప్తిచెందే బజారు వేశ్యలు చాలా నయం. అసలు వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ పవిత్రురాళ్ళు కూడా.*

      తాడేపల్లిగారు, రెండేళ్ల క్రితం అమేరికాలో వచ్చిన రిసేషన్ వలన చాలా మంది మగవారికి ఉద్యోగాలు పోయాయి. ఆకాలం లో వ్యభిచారాం ఇండస్ట్రి చాలా బాగా అభివృద్ది చెందిందని సుధీర్ వేంకటేష్ అల్లాడి న్యుయార్క్ టైంస్/స్లేట్ అనే పత్రికలో ఒకా వ్యాసం రాశాడు. దానికి ప్రధాన కారణం ఉద్యోగాలు లేకపోవటం వలన జీతాలు సరిగా రాక మగ వారు కిందా మీద పడుతుంటే, ఇంట్లో భార్య డబ్బులు లేని వీరిని అవమానించటం మొదలు పేట్టారని. వారి చేతిలో అవమానం భరించలేక మగవారు వేశ్యల దగ్గరికి వేళ్లే వారని. వారిలో కొందరు, వేశ్యలతో తమ కష్ట్టాలనుగురించి చెప్పుకొని ఉపశమనం పొందేవారని. కొంతమంది వేశ్యలు వీరి బాధలను విని చలించి, వారి దగ్గర డబ్బులు లేకపోతే క్రేడిట్ (అప్పు) ఇచ్చే వారని రాశారు.

  6. మీకు తెలుసో లేదో మగ వారి మీద పెట్టిన కేసూలలో 80% బోగస్ అని తేలాయి. ఇటువంటి తప్పుడు కేసులు పేట్టినందుకు కోర్టు వారిని శిక్షించాలి అప్పుడు ఈ చట్టం మిస్ యుస్ కావటం తగ్గుతుంది.
    మౌళి గారు మీరు ఎప్పుడో పాత రోజుల్లో ఉన్నట్లున్నారు, ఇప్పుడు 4 సం పిల్ల వాడికి జవాబు ఇచ్చే పరిస్థితిలో లేము, ఇక చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఎడి పించే భార్య, ఆమేకి మద్దతు నిచ్చే అత్తామామలు, కోర్టులో కమీషన్ కొరకు నీ భర్త ఆస్థిలో నేను నీకు ఇంత %శాతం ఇప్పిస్తాను నాకు దానిలో ఇంత వాటా ఇవ్వండి అని చెప్పుడు మాటలు ఎక్కింఛె న్యాయవాదుల మూఠా వీట్టన్నిటిని తట్టుకొని నిలవటం మగ వారికి చాలా కష్ట్టమౌతున్నాద ి. కోడలి దెబ్బకి కుంగి కృశించి పిల్ల వాడి తల్లిదండ్రులు మంచాలు పడుతున్నారు.
    —————————————————-
    రానున్న రోజులలో ఆడవారు పిల్లలు కనవలసిన అవసరం ఉండదు. ఇద్దరు మగ వారి నుంచి కూడా పిల్లలను పుట్టించవచ్చని టైంస్ ఆఫ్ ఇండియాలో 15రోజుల క్రితం చదివాను.

  7. * అప్పుడు మగవారు త౦డ్రి అయ్యే హక్కు కొల్పోవడానికి సిద్దమే నా …*
    మౌళి గారు, మీ దృష్టిలో మగ వారు పెళ్ళి చేసుకొనేది తండ్రి కావడానికి మాత్రమే లాగున్నాది. వివాహం చేసుకొనేది ముఖ్యం గా మొగుడు పెళ్లాలు కలసి అనురాగం తో జీవించటానికి తరువాతనే పిల్లల సంగతి. మీరు పైన అడిగిన ప్రశ్న మగ వారి వంశాన్ని ఉద్దరించటానికే పేళ్ళి చేసుకోవాలి అనే మాదిరిగా ఉన్నాది.

    *@ఆడా – మగా సమానమన్నప్పుడు ఆడదాన్ని మగవాడు ఎందుకు పోషించాలి ?
    పోషిస్తాను అని మాట ఇచ్చాడు కాబట్టి …ఆమె యె౦దుకు ప్రాణాలు ఒడ్డి అతని ని త౦డ్రి ని చేస్తు౦ది. *

    ప్రాణాలు ఒడ్డి తండ్రిని చేసిన రోజుల్లో మా నాయనమ్మ కాలం లో ఎవ్వరు ఇలా మొగుడిమీద కేసులు పెట్టి కోర్ట్టుల చుట్టు తిప్పలేదు. ఈ రోజుల్లో మేడికల్ ఫెసిలిటి వలన ఎవ్వరు ప్రాణభయం గురించి ఆలోచించ వలసిన అవసరం లేదు. ఈ రోజు పిల్ల వాడు పుడితే మూడొ రోజు నుంచే ఉద్యోగానికి వచ్చిన వాళ్ళను చూశాను. మీరింకా ప్రాణభయం, అది ఇది అని కామేడిగా పెద్ద రాయుడు సినేమా లో మోహన్ బాబు ని గుర్తుకు తెస్తున్నారు.

    1. pillalni kanadam comedy kadu lendi enni medical facilities vachina,
      meeru cheppinatlu biddani kanna 3 day ne office ki vachina valladi,tappani sari paristite tappa ,comedy kadu.
      meeku pillalni kanadam comedy ga anipiste okasari aa comedy chesi aa taravata matladandi.

  8. @# తాడేపల్లి గారు //వివాహాన్ని డీరికగ్నైజ్ చేయిస్తే ఇలాంటి అమానుష చట్టాలు చేసే అవకాశాన్ని ప్రభుత్వాలూ, ఫెమినిస్టులూ శాశ్వతంగా కోల్పోతారు.//

    అప్పుడు మగవారు త౦డ్రి అయ్యే హక్కు కొల్పోవడానికి సిద్దమే నా …

    @ఆడా – మగా సమానమన్నప్పుడు ఆడదాన్ని మగవాడు ఎందుకు పోషించాలి ?

    పోషిస్తాను అని మాట ఇచ్చాడు కాబట్టి …ఆమె యె౦దుకు ప్రాణాలు ఒడ్డి అతని ని త౦డ్రి ని చేస్తు౦ది?

    ప్రతి చట్ట౦ లొను ..కొన్ని లోపాలు ఉ౦టాయి ..ఈ చట్ట౦ మగ వారికి అపాయ౦ అనుకున్నప్పుడే, అ౦ద౦, డబ్బు మాత్రమే చూడట౦ తగ్గిస్తారు …పెద్దలు వెల్లిన దారే ఇది ..దారి తప్పిన సమాజాన్ని మార్చే చట్ట౦ గా చూడ౦డి …

    నేను ఇ౦త కన్నా వాది౦చ కూడదు..

    -శెలవు

    1. ప్రతి చట్ట౦ లొను ..కొన్ని లోపాలు ఉ౦టాయి ..ఈ చట్ట౦ మగ వారికి అపాయ౦ అనుకున్నప్పుడే, అ౦ద౦, డబ్బు మాత్రమే చూడట౦ తగ్గిస్తారు …పెద్దలు వెల్లిన దారే ఇది ..దారి తప్పిన సమాజాన్ని మార్చే చట్ట౦ గా చూడ౦డి …
      —————————————————————————————————

      ఇది పూర్తిగా అసంబద్దమైన ఆలోచన. మగవారిని బయపెట్టడం ఆడవారికి అవసరమన్నట్లుగా ఉంది మీ వాదన. మరి మగాడికి కూడా ఆడదాన్ని బయపెట్టడం అవసరమే కదా. కాబట్టి, అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చేసే వారు సరైన పనే చేస్తున్నారన్న మాట. మీ వాదన ప్రకారం.

      అప్పుడు అడావారు కూడా మగవాడి హోదాను, డబ్బును చూసి కాకుండా ప్రేమను, మంచి తనాన్ని చూసే పెళ్ళీచేసుకుంటా రు. మరి ఈ సిద్దాంతాన్ని పాటించడం మీకు సమ్మతమేనా?

  9. @తాడేపల్లి గారు
    మొదట నెను ఫెమినిస్టు కాదు అనుకొ౦టున్నాను అ౦డి..

    @ వివాహాన్ని డీరికగ్నైజ్ చేయిస్తే ఇలాంటి అమానుష చట్టాలు చేసే అవకాశాన్ని ప్రభుత్వాలూ, ఫెమినిస్టులూ శాశ్వతంగా కోల్పోతారు.

    సరే వివాహమ్ అవసరమ్ లేనప్పుడు అలాగే అడగ౦డి ..ఇప్పుడు సహజీవనమ్ కి కూడా భారత దేశ౦ లో చట్ట౦ వర్తిస్తున్ది ..

    పులి ని , సి౦హా ల ని కూడా బోను లొ పెట్టడమ్, బ౦ధి౦చడ౦ (నగరమ్ లొ ప్రవెశిస్తె) నిషేది౦చుదా౦ …

    పైన చెప్పినవి రె౦డూ ఒకే కోవ అని నా భావ౦ 🙂

    ఆడా – మగా సమానమన్నప్పుడు ఆడదాన్ని మగవాడు ఎందుకు పోషించాలి ? ఎందుకు కాపాడాలి ? ఎందుకు ఆస్తులివ్వాలి ? అనే ప్రశ్నల్ని వేయడం పురుష హక్కుల కార్యకర్తలు కూడా నేర్చుకోవాలి

    1. చివరి ౨ లైనులు అనుకొకు౦డా కాపీ అయ్యాయి…అవి తీసెసి వ్యాఖ్య చదువు కొవలసినది గా మనవి

  10. అదెలానో చెబుతారా? మగైనా ఆడైనా పై పై మెరుగులు చూసి పెళ్ళి చేసుకునేది అవతలివారు కూడా అలానే చేసుకుంటున్నారన ి మీరు అనుకుంటే నేను చేయగలిగింది యేమీ లేదు. అది నిజం కాదు అని చెప్పడం తప్ప.

    మగవారి హక్కులను దారుణంగా కాసరాసి, ఇది Family Harmonyని పెంపొందించేవి అని చెప్పడం విచిత్రంగా ఉంది. మగాని సొంత ఇంటినుండి అతన్ని తరిమేసి, పిల్లలనుండి దూరం చేయడం, అది కూడా అతని తప్పు లేనప్పుడు జరిగినా కూడా మార్పే అనుకోవడం కేవలం కౄరత్వం మాత్రమే. కౄరత్వానికి మీరు మార్పు అని పేరు పెట్టుకుంటాను అంటే అది మీ ఇష్టం. కానీ, మేము దాన్ని ఒప్పుకొని చూస్తూకూర్చోలేం .

  11. @ఆకాశరామన్న గారు …..పై పై మెరుగులు చూసి పెళ్ళిచేసుకునేద ి మగవారు మాత్రమేనా? ఆడవారు చేసుకోరా,
    ————————————————————————-

    మన౦ మాట్లాదుచున్నది , మగ వారి సమస్య గురి౦చి కదా..ఒకరు పై పై మెరుగు లు చూడ్డ౦ మానేస్తే ..ఇ౦కొకరి తప్పు సరి అవుతు౦ది…

    @Family Haromony ని పెంపొందించే చర్యలేవన్నా తీసుకునింటే బాగుంటుంది కదా?

    ఇవి ఆ చర్య లే అని అనుకోవచ్చు .. మార్పు కావాలి అ౦టె మనమ్ ము౦దు మారాలి కదా

  12. అసలుకే ఎసరు పెడదాం.

    పెళ్ళి ద్వారా ఆడదానికి మగవాడు కల్పిస్తున్న భార్య అనే హోదాని అడ్డం పెట్టుకొని, ఆమెని అతడు పోషించాలనే/ రక్షించాలనే సాంప్రదాయిక భావజాలాన్ని కూడా అడ్డం పెట్టుకొనీ ఫెమినిస్టులు ఈ డాన్సులు ఆడగలుగుతున్నాను . వివాహాన్ని డీరికగ్నైజ్ చేయిస్తే ఇలాంటి అమానుష చట్టాలు చేసే అవకాశాన్ని ప్రభుత్వాలూ, ఫెమినిస్టులూ శాశ్వతంగా కోల్పోతారు. ఆడా – మగా సమానమన్నప్పుడు ఆడదాన్ని మగవాడు ఎందుకు పోషించాలి ? ఎందుకు కాపాడాలి ? ఎందుకు ఆస్తులివ్వాలి ? అనే ప్రశ్నల్ని వేయడం పురుష హక్కుల కార్యకర్తలు కూడా నేర్చుకోవాలి.

  13. వివాహం ప్రాథమికంగా మతపరమైనదీ, వ్యక్తిగతమైనదీ గనుక అందులో ఏ రకమైన ప్రభుత్వజోక్యమై నా, న్యాయస్థానాల జోక్యమైనా అక్రమమనే వాదంతో ప్రచారం ప్రారంభించాలి. అదొక్కటే కాకుండా “స్త్రీల మీద” అని చెప్పబడుతున్న నేఱాలన్నింటికీ ప్రత్యేక ఫెమినిస్టు చట్టాలవసరం లేదనీ సాంప్రదాయికమైన నాన్-ఫెమినిస్టు చట్టాలు సరిపోతాయని తెలియజెప్పాలి.

  14. IVAWA ప్రయత్నాలు ఇండియాలాంటి హక్కుల చైతన్యం లేని అజ్ఞానుల దేశాల్లోనే తప్ప అభివృద్ధి చెందిన knowledge societies లో వర్కౌట్ అవ్వవు. కనుక వారి ప్రతిపాదనలు ఆమోదం పొందడం ఎప్పటికీ జఱగదు.

    అయితే వివాహాన్ని ఆధికారికంగా డీరికగ్నైజ్ చేయించడానికి పురుషహక్కుల కార్యకర్తలు ఇప్పట్నుంచి కృషిచేయాలి. వివాహాలు జఱుగుతూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం మనుషుల్ని ఒకఱి భార్యలుగానో, ఒకఱి భర్తలుగానో కాక దేశపౌరులుగా, వ్యక్తులుగా గుర్తిస్తుందంతే ! ప్రేమ, పెళ్ళి, సెక్సు, కాపురమూ, కుటుంబవివాదాలూ, విడాకులూ గట్రాలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. వాటన్నింటినీ చూసే బాధ్యతని ఆయా మతధార్మిక పీఠాలకు అప్పగించాలి. అలాంటి వ్యవస్థ మనక్కావాలి.

  15. మరో విషయం, దంపతుల మధ్య ప్రేమ ఉంటే ఎటువంటి సమస్యా ఉండదన్నారు, మరి ఈ చట్టం మాత్రం ఎందుకు? దంపతుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి హింసా ఉండదు కాబట్టి, గృహహింస చట్టం స్థానములో, Family Haromony ని పెంపొందించే చర్యలేవన్నా తీసుకునింటే బాగుంటుంది కదా?

  16. ఇ౦కా స్త్రీ తనకు తాను గా యెప్పుడూ మ౦చి కాపురాన్ని విడాకుల దాకా తీసికొని వెల్లదు అ౦డి
    ——————————————————————————————————————-

    ఇది కేవలం సత్యదూరమైన నమ్మకం. యెందరో స్త్రీలు పంతాలతో పట్టింపులతో తమ కాపురాలను కూల్చుకున్న వారున్నారు. ఒక వేల యే స్త్రీ అలా చేయదని ప్రస్తుతానికి అనుకున్నా, ఇదివరకే వివాహ బంధములో సఖ్యత లేని జంటల మాటేమిటి. A failed marriage should not be a crime for anyone. కానీ, ఇక్కడ అది మగవారికి మాత్రం నేరమే అవుతోంది.

    పై పై మెరుగులు చూసి పెళ్ళిచేసుకునేద ి మగవారు మాత్రమేనా? ఆడవారు చేసుకోరా, అలా చేసుకుంటే ఆ మగవాడి పరిస్థిథి యేమిటి, ఒక సారి ఆమెరుగులన్నీ పోగానే, ఆమె అతని మీద ఇలాంటి కేసులు బనాయించొచ్చా?

    ఈ చట్టం కేవలం మగవారిని మాత్రమే సరైన దారి( అంటే ఆడవారు వెల్ల మన్న దారే సరైనదని మనం భావించాల్సి ఉంటుంది) వెల్లమని సూచిస్తుంది. ఆడవారిమీద ఎటువంటి నిభందనలూ ఉండావు, ఈ చట్టం దుర్వినియోగం చేసినా శిక్షలుండవు.

  17. ఉదాహరణకు – నాకొక వివాహిత స్త్రీ మీద మోజు కలిగి, ఆమెను ఆమె భర్త నుంచి విడదీయాలని నేను పథకం వేస్తే

    —————————————————————————

    అప్పుడు భర్త కు యె౦త నమ్మక౦ ఉన్నది తెలిసి పొతు౦ది కదా..

    ఇ౦కా స్త్రీ తనకు తాను గా యెప్పుడూ మ౦చి కాపురాన్ని విడాకుల దాకా తీసికొని వెల్లదు అ౦డి.

    ప్రేమ ఉన్న చోట ఈ చట్టాలు యేమి చెయ్యలేవు. మగవారు పై పై మెరుగు లు చూసి పెళ్ళి చేసుకొ౦టే నష్ట పొతారు ..ఈ చట్ట౦ బారిన పడతారు .అలాగే ఇదెమి చెయ్యగలదు అని మాటలతొ హి౦సిస్తు౦టే కూడ ఈ చట్టమే రక్ష.

    కావున ఈ చట్టము స్త్రీ, పురుషులు ఇద్దరి ని సరి అయిన దారి లొ వెల్లాలి అని శాసిస్తు౦ది 🙂

    1. మౌళి గారు, ఎంత అమాయకులండి మీరు.
      >ఇ౦కా స్త్రీ తనకు తాను గా యెప్పుడూ మ౦చి కాపురాన్ని విడాకుల దాకా తీసికొని వెల్లదు అ౦డి.
      బహుశా అలాంటివారు మీకెన్నడూ తారసపడిఉండరు.
      ఈ జనరలిజేషన్లు కథల్లో కబుర్లలో పనికివస్తాయేమో కాని చట్టం దగ్గర ఉండకూడదు.
      ఆకాశరామన్న గారు..మంచి ఆర్టికల్.

      1. అందరు ఆడవాళ్ళూ ఒకేలా ఉంటారనుకోవడం కరెక్ట్ కాదండీ… ఎవరూ తన కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకునేందుకు సిద్ధం అవ్వరు.. మీరు చెప్పినట్టు ఎక్కడో కొందరు ఉంటారు.. కాదనటంలేదు.. ( చట్టం విషయంలో మాత్రం మీరు చెప్పింది 100 % కరెక్ట్..)

  18. తాడేపల్లి గారూ,
    వ్యాఖ్యానించినద ుకు నెసర్లు. మీరన్నట్లు ఈ చట్టము అంతర్జాతీయ సూత్రాలకు నీల్లొదిలిన మాట వాస్తవమే. కాకపోతే, ఇది పూర్తిగా మన వారి మేధోచితం కాదు. అమెరికాలోని VAWA కు నఖలు లాంటింది. కాకపోతే, VAWA కనీసం పేపరుమీదైన Gender Neutral గా ఉంటుంది. మన గృహహింస చట్టం అది కూడా లేదు. ఇలాంటి కొన్ని వ్యత్యాసాలు మినహా, రెండు ఒక్కటే. కాబట్టి అంతర్జాతీయ న్యాయస్థానములో గృహహింస చట్టం వీగిపోయే అవకాశాలు ఎంతమాత్రం ఉన్నాయో చెప్పలేం. అంతేకాదు ఒక వేల వీగిపోయినా, దాన్ని గురించి పట్టించుకునే వాల్లు ఉండరు.

    కొసమెరుపేమిటంటే , ఈ గృహహింస నిరోధక చట్టాన్ని అంతర్జాతీయంగా అమలు చేయడానికి పాశ్చాత్య ఫెమినిస్టులు కొత్త చట్టం రూపొందించారు. అదే I-VAWA (International Violence against women act). ఒక సారి ఇది ఆమోదం పొందిన తరువాత, అన్ని దేశాలకు ఈ చట్టాన్ని అనుసరించమని ఒత్తిడి మొదలవుతుంది. అప్పుడు తప్పక అన్ని దేశాలు, ఈ చట్టాలను అనుసరించాల్సి వస్తుంది. I-VAWA గురించి తెలుసు కోవడానికి ఈ లంకెను దర్శించండి.

    http://www.mediaradar.org/why_ivawa200801_campaign.php

  19. అందుచేత చట్టాలను స్త్రీపక్షపాతంత ోనో, పురుష పక్షపాతంతోనో కాక పూర్తి లింగాతీతం (gender-neutral) గా రూపొదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కుటుంబవ్యవస్థ అనాదిగా మగవారిచేతనే మెయిన్‌టెయిన్ చేయబడుతోంది. మగవాడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ వ్యవస్థలో ఇవ్వడం మూలాన, ఇస్తామనే భరోసాని మగవాడిలో కలిగించడం మూలాన ఈ వ్యవస్థ ఇప్పటిదాకా కొనసాగగలిగింది. అది పోయాక, లేదా పోయిందని మగవారికి ఒక నిశ్చితమైన అభిప్రాయం కలిగాక వారు ఈ వ్యవస్థలోంచి మూకుమ్మడిగా వాకౌట్ చేస్తారు. ఈ చట్టాలు కొనసాగితే ఈ పరిణామం ముందో వెనకో తప్పనిసరిగా జఱిగి తీఱుతుంది. అది ఎవ్వఱికీ మంచిది కాదు.

    ప్రతి మగవాడూ తననొక వ్యక్తిగా భావించుకుంటాడు. ఒక లింగంగా కాదు. తమనొక లింగంగా భావించుకునేది ఆడవారు. కనుక మగజాతి మీద ఇలాంటి చట్టాలతో కక్ష తీర్చుకుండామనే ధోరణి ఆచరణలో ఫలించదు. ఎందుకంటే ఈ చట్టాల్ని తలకిందులు చేయడానికి మగవారు రోడ్డెక్కడానికి బదులుగా వ్యక్తిగత పరిష్కారాల వేటలో పడతారు. అవి సాధారణంగా ఆడవారికి మేలు చేసే విధంగా ఉండవు.

  20. ఈ చట్టంలో ఇంకా అనేకానేక లొసుగులున్నాయి. దీన్ని కాకలు తీఱిన వృద్ధ జూరిస్టులు కాక, యంగ్ ఫెమినిస్టులు రూపొందించడం వల్ల జఱిగిన పరిణామం ఇది. దీన్ని డ్రాఫ్టు చేసినది ఇందిరా జైసింగ్ అనే ఢిల్లీకి చెందిన ఆడ ఫెమినిస్టు లాయరు. ఆమెగారి వ్యక్తిగత తలతిక్కలన్నీ ఈ చట్టంలో ప్రతిబింబిస్తున ్నాయి. ఉదాహరణకు – ఈ చట్టం ప్రకారం – బాధితురాలి తరఫున ఆమె కాకుండా బయటివారెవఱైనా ఆమె తరఫున ఆమెకు చెప్పకుండానే ఆమె భర్త మీద గృహహింస కేసు నమోదు చేయించవచ్చు. ఈ క్లాజుని జనం ఎలా ఉపయోగించుకుంటార ో చూడండి. ఉదాహరణకు – నాకొక వివాహిత స్త్రీ మీద మోజు కలిగి, ఆమెను ఆమె భర్త నుంచి విడదీయాలని నేను పథకం వేస్తే ఆమెకు తెలియకుండా ఆమె భర్త మీద ఆమె తరఫున కేసు పెడతాను. అది న్యాయస్థానంలో విచారణకు రాకముందే ఈ కేసు సమన్ల మూలాన ఆమె భర్తకు ఆమె బ్యాక్‍గ్రౌండ్ మీద తప్పకుండా అనుమానం కలుగుతుంది. ఈ కేస్ ఇలా ఉండగానే అతను విడాకుల దాకా వెళ్ళిపోతాడు. నా పథకం ఫలిస్తుంది.

  21. మగవాళ్ళు చట్టాల్ని రూపొందించడానికీ ఆడవాళ్ళు వాటిని రూపొందించడానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని నా వ్యక్తిగత నమ్మకం. చట్టాలు చేసేటప్పుడు మగవాళ్ళు అందఱినీ, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటారు. ఆడవాళ్ళు కేవలం ఆడవాళ్ళనే దృష్టిలో పెట్టుకుంటారు. భవిష్యత్తు సంగతేమో గానీ ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితైతే ఇది.

    ఒకఱి మీద నేఱం మోఫి అది తాను చేయలేదని నిరూపించుకునే బాధ్యత అతని మీదనే పెట్టడం – ఐక్యరాజ్యసమితి గుర్తించిన
    అంతర్జాతీయ మానవహక్కుల చార్టర్ కు పూర్తిగా విరుద్ధం. ఆ దృష్ట్యా భారతీయ గృహహింసచట్టం ఒక అమానుషమైన బ్లాక్ యాక్టు. అది అంతర్జాతీయ న్యాయస్థానంలో పునస్సమీక్షకు పెడితే తప్పకుండా ఓడిపోతుంది. ఎవఱైనా శ్రమకోర్చి దీన్ని అక్కడిదాకా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది.

  22. వ్యాసములో ఇచ్చిన విడియోను చూడాలంటే లంకెకు ముందున్న్న Youtube= అనేదాన్ని తొలగించి కాపీ, పేస్ట్ చేయండి.

Comments are closed.