March 28, 2024

మాలికా పదచంద్రిక – 1

ఆధారాలు:

అడ్డం: 1.ఏ పనినైనా మొదలెట్టడానికి తీపి కానిదానిని చుట్టుతారు.(4)

3.వైదిక ధర్మమునకు సంబంధించినవి ఈ సాంగు ఉప అవయవాలు.(5)

6.ఖాకీవనం రచైత.(4)

9.లిమిట్‌లో ఉన్న మిడతంబొట్లు.(2)

10.డాంబికమా అంటే మిద్దెను చూపుతావేమయ్యా?(2)

12. రోమను చరిత్రకాదు మనదే!(5)

13.పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది.(5)

14.అప్పున్న యువకుడు.(7)

15.చలనచిత్రములో మే మే అనే జంతువు దాగివుంది.(3)

17.ఏదో సామెత చెప్పినంత మాత్రాన కాలు కడిగేముందు ఇది తొక్కితీరాలా అని అడుగుతున్నావ్ భలే ‘గడుసు’పిండానివే!(3)

19.విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్.టి.ఆర్ కు ప్రజలతోనున్న అనుబంధము?(2)

20.ఆంగ్లమున విసురుము.(1)

21.అడ్డం 20తో యుద్ధము.(1)

22.రాధ నందుడిని డబ్బు అడుగుతుందా?(2)

24.సందు కలిగిన యిష్టము.(3)

26.హీనపక్షము, కనీసము (3,1,3)

27.స్టేజి ఆర్టిస్టును ఇలా పిలిస్తే గౌరవంగా ఉంటుంది కదా!(4.3)

28.కంగారు పడిన హనుమంతుడు(3)

30.ఖడ్గసృష్టి సృష్టికర్త ఇంటిపేరులో నాట్యస్థలము(2)

32.అడ్డం 21తో వ్యాఘ్రము(1)

33.అడ్డం 32తో తెరమరుగైన ఒక సినీ నటి(1)

34.పలాస దీనికి ప్రసిద్ధి.(2)

35.పసివాడు అనదగిన అప్పడం.(3)

37.ధర్మదాత సినిమా దర్శకుడు (3)

40.ఉపవాసదీక్షకు ఈ మాసం ఈవారం గొప్పదని హిందువుల నమ్మకం.(3,4)

43.బ్రహ్మ చేతిలో ద్రాక్ష,రుమాల ఉంటాయా?(5)

44.మాల్గాడి శుభ,కామ్నా జఠ్మలానీలు అందజేస్తున్న గ్రీటింగు!(5)

45.చుంబనము కొరకు అటునుంచి రుద్దుము.(2)

47.ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం రెండుసార్లు పలుకు బేబీ!(2)

48.నల్లగేటు – నందివర్ధనం చెట్టు వీరిదే.(4)

49.గోగినేని రంగనాయకులు ఈ విధంగా ప్రసిద్ధులు(2,1,2)

50.పుణ్యభూమి కొమ్మును నరికేస్తే బజారు!(4)

 

నిలువు:1.షోడానాయుడు కథకుడు(4)

2.పరిటాల రవి జీవిత గాధ ఆధారంగా రూపొందిన సినిమా (5)

3.ఆసాంతం తల నరికినా మొత్తమే.(2)

4.హేమమాలిని తొలి సినిమా!(3,4)

5.తిరగేసిన అజ్ఘలము తలనరికిన బాలుడా?(2)

7.విరటుని కొలువులో సహదేవుని మారుపేరు(5)

8.శీర్షాసనం వేసిన విష్ణువు(4)

9.సుమిత్ర తల్లి స్నేహమును కలుగియున్నదా?(3)

11.బ్రాహ్మణుడు.(3)

15. మాయాబజార్ సినిమాలోని రమణారెడ్డి పేరులో దాగియున్న అల్పము.(2)

16. ఫాలనేత్రుడు కదా ఈ పరమశివుడు (7)

17. పృథుకముతో జేసిన ఈ అమృతాన్నము కృష్ణునికి ప్రీతికరమైనది కాదా? (4,3)

18. భూమిలో దాగియున్న అమృతము? (2)

19. వజ్రపు గనులు ఈ జిల్లాలో ఉన్నాయి!(5)

23. నంజుకు తినే రాక్షసుడు!(5)

24. పవన కుమారునిలో ఉన్న శక్తి!(3)

25.దుమ్ము కొట్టుకుపోయి అటుఇటు అయ్యింది.(3)

29. జంబుకమును తన పేరులో దాచుకున్న కవిబ్రహ్మ! (3.4)

31. బుట్టా?(2)

34. అడ్డము 37లో దాగున్న ప్రాణి (2)

36. ఇన్‌డైరెక్టు లవ్వు? (3,2)

38. పెటా (PETA) ఈ తరహా సంస్థకు ఒక ఉదాహరణ!(5)

39. చారు కలిగిన రాగము!(4)

40. ములక్కాడలో సమయాన్ని వెదుకు! (3)

41. తలక్రిందలైన తిరుప్పావై పాట(పద్యం) (3)

42. పి. వి. నరసింహారావు స్మారక స్థలం (4)

46. వృషభం పల్టీకొట్టింది.(2)

47. కోటలో ఇది వెయ్యడమంటే తిష్ట వెయ్యడమా?(2)

 

సమాధానాలు

ఈ పజిల్‌ను సాధించడానికి చాలా తక్కువ మంది ప్రయత్నించారు. భమిడిపాటి సూర్యకుమారిగారు మాత్రం నాలుగు తప్పులతో పూరించగలిగారు. తుమ్మల శిరీష్ కుమార్ గారు గడువు పూర్తి అయిన తరువాత పంపారు. వారు దాదాపు అన్నీ సరిగ్గానే పంపారు కానీ ఒకటి రెండు మా సొల్యూషన్‌తో సరిపోలేదు. అయినా వాటిని తప్పులుగా పరిగణించడం లేదు. వారికి నా అభినందనలు. వచ్చే సంచికలో మరో పజిల్‌తో కలుద్దాం. – కోడీహళ్లి మురళీమోహన్