April 25, 2024

మొగుడూపెళ్ళాల పద్యాలు

ఆ.వె. బెడ్డు కాఫి అడిగి బెదరగొట్టగభర్త;
ఉరిమి చూచు భార్య ఉష్షుమనుచు;
కాఫి ఇవ్వలేని కారణ మేమన;
టయము జూడు బాబు! భయము లేద?

ఆ.వె.అమ్మ డ్రస్సు వేయి! ఆలస్య మౌనాకు
అనుచు యేడ్చు బిడ్డ.. అయ్యొ… వనిత!
ఆడు దాని బాధ అరణ్య రోదనే!
సర్వ పనులు జేయు సాధ్వి నీవే!

ఆ.వె. టిఫిను పెట్టి త్వరగ టీయివ్వు నాకింక.
గోల జేయు బాసు ఈల వేసి
బాక్సు ఏది? కాళ్ళ సాక్సు లేవి?
వెదికి ఇవ్వు ఆపి వెకిలి నవ్వు!

తే.గీ. ఓరి దేవుడ నాకింక ఓపికేది?
పని మనిషులు లేరన్న పట్టదేమి?
మొగ వారేమి పుణ్యము మొదట జేసె?
తెలియ జెప్పుము నాసామి తేట తెల్ల.

భర్త పిల్లలు యేగగ శిరము తిరిగి
సొమ్మ సిల్లెను యావిడ దిమ్మ దిరిగి
తిరిగి మధ్యాన్న వేళకు తెలివి రాగ
తిఫిను జేయగ నడచెను తిన్నగాను.

భర్త వడలిన మోముకు భయము వేసి
కాఫి టిఫినును పెట్టగ కాంచి తాను
సినిమ టిక్కెట్లు తెచ్చెను సిత్ర రీతి
అంత సంతోష మాయెను వింత గాదె!

2 thoughts on “మొగుడూపెళ్ళాల పద్యాలు

Comments are closed.