March 28, 2024

మాలికా పదచంద్రిక – 2

మీ సమాధానాలు మాకు ( admin@maalika.org ) పంపించటానికి చివరి తేదీ మే 31, 2011

 

ఆధారాలు:

అడ్డం:

1 . ఇటీవల సలీంకు సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన నవల! (4,4)

4. సంజయుడు చెప్పినది (3,3)

9. ఆలు మగల _ _ _ /అంత మొందిన రేయి /అనుమానపు హాయి/ ఓ కూనలమ్మ – ఆరుద్ర ఉవాచ (3)

10. కాంతి (1)

11. అరవపు సుబ్రహ్మణ్య స్వామి కాస్త తడబడ్డాడు.(3)

12. బొడ్డు (3)

13. వెనుదిరిగిన సురభి (5)

15. శింజిని లేదా జాతి,కులం (2)

16. శోభ (1)

17. పెద్ద పెద్ద కొండలను ఇలా పిలవ్వచ్చు (5)

19. గంగానదే మరో పేరుతో! (5)

21. కాయ కాని కాయ ఈ ముఖాస్రము (4)

23. తెలుగు సైకాలజీ! (2,3,2)

25. రాశిచక్రము UII (4)

26. లాయర్లకు ఇది ఉంటే రాణిస్తారు (2,3)

28. వార్తాకము, కారవేల్లము (2,3)

31. విషము (1)

33. కరశాఖ సహస్రములా? (2)

34. ఇంటి తలుపులపై ఇలా రాస్తే దెయ్యాలు రావని ఓ గుడ్డి నమ్మకం (1,1,2,1)

35. తుమ్మెద కుడి నుండి ఎడమకు (3)

37. మన బ్లాగర్ శరత్ గారికి యిష్టమైన యిల్లు 🙂  (3)

39. అమృతము (1)

40. ప్రావీణ్యము గలది/ గలవాడు (3)

41. చంద్రబోస్, సీతారామశాస్త్రి లేదా అనంత్ శ్రీరామ్ దీనికి ఒక ఉదాహరణ (2,4)

42. మాటంటే నీదేలే… మనిషంటే నువ్వేలే… అని సి.నా.రె అని వ్రాసిన పాట ఈ సినిమా లోనిది. (4, 4)

 

నిలువు

1. పరమశివుడే. కోకాకోలాగ్రీవుడు కాదు సుమా 🙂 (6)

2. రాయిని తలపించే భూషావిశేషము (3)

3. దేవిక కూతురు కనకది వాలుజడ అయితే రాజేంద్ర ప్రసాద్‌ది? (4)

5. ఒకప్పటి సుప్రసిద్ధ శృంగార నృత్య తార ఈ జగన్మోహిని. (5)

6. ఇది పురుష లక్షణం అంటే ఇప్పుడు స్త్రీలు ఒప్పుకోరు.(3)

7. పేకాటే కాస్త గౌరవప్రదంగా (4,4)

8. ఒకటి రెండు విజయాలు చవిచూస్తే మన సినీ తారలకు వచ్చేది? కళ్ళు నెత్తికెక్కడం వంటిదే.(2, 3)

14. మడకశిర పట్టణంలో నాగలి లభ్యమౌతుంది.(3)

15. సంజీవ్ దేవ్ జీవిత చరిత్ర.(3,4)

17. కాముని పున్నమి (5)

18. రత్నాలు పొదిగిన దుప్పటి కలగాపులగం అయ్యింది(5).

20. మీరూ మేమూ పల్టీ కొట్టాం.(2)

22. ధర్మసంస్థాపనార్థాయ అంతా కొత్తవాళ్ళతో ఓ కొత్త దర్శకుడు తీసిన ఓ కొత్త సినిమా!(4,2,2)

24. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు దీనికి సమానమైన సామెత కన్నడలో పనిలేని కరణం

విప్పినట్లు.[తలక్రిందలైంది](2)

27. _ _ _ సాంగత్యాన్ని కోరుకుంటే ఎంత మహా వీరుడైన ఎంత భక్తాగ్రేసరుడైనా ఎంత విద్వత్సంపన్నుడైనా చివరకు ఆతని జీవితం ఎలా ముగుస్తుందో రామాయణం కళ్లకు కట్టింది.(2,1)

29. పర్యేష్టి (5)

30. హరికథా పితామహుడు ఆదిభట్ల!(4,2)

32. అయస్కాంతము (3, 2)

36. షిర్డీలో నెలకొన్న సాధువు ఫకీరు. చాలామందికి దైవస్వరూపుడు.(4)

38. నిగమశర్మ అక్క  లబోదిబోమన్నది ఇది పోయిందనే! (3)

40. విగ్రహము (3)

 

సమాధానాలు:

4 thoughts on “మాలికా పదచంద్రిక – 2

  1. నిలువు 24కు చిన్న వివరణ “ಕೆಲಸವಿಲ್ಲದೆ ಶಾನ್‍ಭೋಗ ಹಳೆ ದಸ್ತ್ರ ಬಿಚ್ಚುದ” అని కన్నడలో ఒక సామెత ఉంది. అంటే పనిలేని కరణం పాత దస్త్రం (కాగితాల కట్ట) విప్పాడు అని అర్థం.

  2. http://magazine.maalika.org/?p=250

    సమాధానాలను పైన ప్రచురించాం చూడండి. ప్రయత్నించిన వారు

    1. భమిడిపాటి సూర్యలక్ష్మి
    2. వేదుల సుభద్ర.

    ఇద్దరికీ అభినందనలు.

  3. అడ్డం:1. కాలుతున్న పూలతోట 4. సంజయ ఉవాచ 9. లడాయి 10. ——-11.గం ఆ ర్ము 12.——–13.వునుధేమకా 15. 16. 17. మలయములు 19. అలకనంద 21.తలకాయ(?) 23. మనవిజ్ఞానశాస్త్రము 25. 26. వాక్ పటిమ 28.వంగ కాకర 31.33. వేలు 34. ఓ స్త్రీ రేపు రా 35. దంట్పష 37. 39. 40. ప్రవీణ 41.గేయ రచయిత 42.లంబాడోళ్ళ రామదాసు

    నిలువు:1. కాకోలగ్రీవుడు 2.తురాయి 3. తోలు బెల్టు 5. జయమాలిని 6. ఉద్యోగం 7.చతుర్ముఖ పారాయణం 8.———- 14. మడక 15.———– 17. మదనస్తవం 18. లు త్నశావార 20. నంమ 22. సంభవామి యుగే యుగే 24.——27. పర స్త్రీ 29. గవేషణము30. నారాయణ దాసు 32. సూదంటు రాయి 36.సాయిబాబా 38. ముక్కెర 40. ప్రతిమ
    సార్. నాకు వచ్చినంతవరకూ పూరించాను. దయచేసి పరిశీలంచగలరు.

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238