April 24, 2024

ఆధునిక మీరా – జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాదేవి వర్మ

రచన: ఎ.జె. సావిత్రీమౌళి అభివ్యక్తీకరణ కాంక్ష మానవుని సహజ ప్రవృత్తి. మానవుడు తన హృదయంలోని భావాలు, సుఖ దుఃఖాలు మొదలయిన జీవితపు వివిధ చిత్రాలను అభివ్యక్తంచేసి, ప్రపంచ అనుగ్రహాన్ని అభిలషిస్తాడు. తద్వారా ధన్యులౌతారు. ఈ భావన సనాతనమైనది. అన్య భాషలలో వలెనే ఆధునిక హిందీ సాహిత్యంలో కూడా కమనీయమైన కల్పనలతో కావ్యాలందించిన మహానుభావులు అసంఖ్యాకులు. వారిలో శ్రీమతి మహాదేవి వర్మ హిందీ కావ్యాకాశపు మహోజ్వల తారికగా పరిగణింపబడెదరు. ఆమెనెరుగనివారు హిందీ సాహిత్యమందేకాక, అన్య భాషాకోవిదులలో కూడా లేరు. […]

నీ”వై” నా “వై”

వై. శ్రీరాములు ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రేమించడమే జీవితానికి అర్ధం ప్రేమ తోడుంటే తుఫానులైనా లోకం ఏమనుకున్నా ప్రేమే, ప్రేమే పరమార్ధం. ప్రేమించడమంటే అంత సులభం కాదు! నిన్ను నువ్వు అర్పించుకోనిదే అది అర్ధం కాదు ప్రతి క్షణం హృదయాన్ని వెలిగించే వుండాలి ! వేరే ఆలోచనకు తావే లేదు. అటు అలజడి, ఇటు అలజడి ఎటు అడిగిడితే అటు గుండె సడి తణువు అణువణువు భావాల పూల పుప్పొడి మనువులో వెన్నెల […]

మేల్ అబార్షన్

మేల్ అబార్షన్ – పురుషుడికి తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం..!! మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ఒక స్త్రీ, తనకు ఇష్టము లేక పోయినా గర్భాన్ని ధరించవలసి వచ్చింది. బహుశా ఆమె ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకొని ఉండొచ్చు. దానికి ఆమె కారణాలు ఆమెకుండొచ్చు. దురదృష్టవశాత్తూ ..ఆమె ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి, బిడ్డకు జన్మ నివ్వడం తప్ప వేరే మార్గం లేదనుకుందాం. మరొక సందర్భాన్ని తీసుకుంటే, స్త్రీ […]

సెంటిమెంటల్ రేజర్

( రచన: డి.వి.హనుమంతరావు.) ’అయ్యో! అయ్యో!…” అంటూ పెరట్లోంచి మా ఆవిడ గావుకేక పెట్టింది…నా కంగారులో చివరి మాటలు సరిగా వినపడలేదు. పెరట్లోకి పరిగెత్తాను.. “ఏమిటి? ఎక్కడ? పాము కుట్టిందా, తేలు కరిచిందా”  పెళ్ళికానుక  సినీమాలో రేలంగిలా అడిగా! “అదికాదండీ–మా అన్నయ్య రేజర్ మరచిపోయాడండీ” “ఓస్! ఇంతేనా? చంపావు కదే!”. “ఇంతేనా అంటూ అలా తీసిపారేస్తారేమిటండీ..అది మా తాత గారి టైములో రేజరండీ… అన్నయ్య గెడ్డం గీసుకోవడానికి ముందు…గెడ్డం గీసుకున్నాకా కూడా  నాన్నగార్నీ, మా తాతగార్నీ తలచుకుని […]

ఇంటి భాషంటే ఎంత చులకనో!

  భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మా గ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, […]

వేగుచుక్కలు వేమన వీరబ్రహ్మాలు

మానవుడితోపాటు ప్రతీ జీవి సుఖాన్ని, భోగాన్ని కోరుకుంటుంది. సుఖసంతోషాలతో ఉండాలని,  ఇహంతోపాటు పరాన్ని కూడా సాధించాలని అనుకుంటాడు ప్రతి మనిషీ. కాని మనం అనుభవించే సుఖం శాశ్వతం కాదనీ, చివరికి మిగిలేది దుఖఃమేననీ  తేల్చేస్తారు వేదాంతులు. చరిత్రకారులు స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు .. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్ధం లేని […]

ఆ చూపుకర్ధమేందీ….

కొత్త పత్రిక మొదలు పెడుతున్నాము నీకు తోచింది రాసి పంపివ్వమని భరద్వాజ గారు అడగడం తో ఆలస్యం చేయకుండా ఒక “వ్యాసం” లాంటిది పంపించాను. బాగా రాసావు అన్న తిరుగు టపా ఉత్తరం వస్తుందనుకుంటే “నిన్ను పంపమన్నది ఒక చిన్న కధ గాని కావ్యం కాదు ” అన్న చివాట్లు వచ్చాయి. ముందు చెప్పడం ఏమో నీకు తోచింది రాయి అన్నారు రాస్తేనేమో చివాట్లు. బొత్తిగా కళాపోషణ లేని వారు. అయినా దాన్లో నేను ఏం రాసానండీ? […]

అనగనగా ఒక రోజు..

“రేపు బోల్డంత పని ఉంది.. తలచుకుంటేనే నీరసం వస్తుంది!” “ఇప్పుడేగా చేపల పులుసు బావుందంటూ అన్నం తిన్నారు! నీరసమై ఉండదు.. భుక్తాయాసమేమో?! మీరసలే తెలుగులో వీక్.” “నా తెలుగుకొచ్చిన ప్రోబ్లెమేమీ లేదు కానీ రేపు నేను గరాజ్ క్లీనింగ్ చేసుకోవాలి.” “దాందేముంది.. నేను హెల్ప్ చేస్తాను.. మీరు కూడా క్లీనింగ్ లో ఓ చెయ్యేయండి.. మీరే అంటారుగా టీం వర్క్ టీం వర్క్ అని.” “అమ్మో, నువ్వు మాత్రం నా పనిలో చేయి పెట్టకు.. అంతకుముందు నేను […]

మిషన్ నిద్ర

కిం కర్తవ్యం అతణ్ణి నిర్దాక్షిణ్యంగా లొంగదీసుకోవడం. అతని మస్తిష్కాన్ని నిస్తేజం చేసి, శరీరాన్ని నీరసింపజేసి, కంటినిండా నిండి, రెప్పలను బరువెక్కించి, మెడలు వంచి, నిద్ర పుచ్చాలి. అదీ నా మిషన్!