March 29, 2024

నాదీ ఓ సినిమా కధే

ఒక ఆదివారం తీరుబడిగా కూర్చుని, కాఫీ తాగుతూ, సిగరెట్టు కాలుస్తూ ఆలోచిస్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్పాలి. టాటా గార్కి అన్ని కోట్లు ఎందుకు ఉన్నాయి? నెలాఖరికి నాజేబులో ఓ పదిరూపాయలు ఎందుకు ఉండవు? పక్కింటి సాఫ్ట్ వేరు ఇంజినీరు తండ్రి , ఆట్టే చదువుకోక పోయినా విమానాలు ఎందుకు ఎక్కుతాడు? నేను కష్టపడి PG చేసినా టికెట్టు కొనకుండా సిటీ బస్సు లో ఎందుకు ప్రయాణం చేస్తాను?

65 ఏళ్ళు వచ్చినా ఆ హీరో జుట్టు నల్లగా ఎందుకు ఉంటుంది? 35 ఏళ్లకే నా జుట్టు ఎందుకు తెల్లబడి రాలి పోయింది? మా ఎదురింటి ఆయన మాట్లాడితే పది మంది చేరి ఎందుకు పగలబడి నవ్వుతారు? అత్యవసరమైతే తప్ప మా ఆవిడ కూడా నాతోటి ఎందుకు మాట్లాడదు? ఇన్ని సమస్యలు చుట్టుముట్టు తుంటే ఆలోచించక ఏమిటి చెయ్యడం? ఆలోచించి ఆయాసపడతాను.

ఈ రోజున ఆలోచిస్తుంటే ఙ్ఞానోదయమైంది . మా నాన్న గారు పరమ పదించే ముందు నాతోటి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “నాయనా ప్రద్యుమ్నా, మన పూజా మందిరం లోని సింహాసనం కింద..  ” అని ఇంకేదో చెప్పబోతుండగానే ఆయన కీర్తి శేషులు అయిపోయారు. ఆతర్వాత నేను ఆ సింహాసనం కింద చూశాను. ఏమి లేదు. ఆ విషయం అంతటితో నేను మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ సుమారు 30 ఏళ్ల తర్వాత అది గుర్తుకు వచ్చింది. పితాశ్రీ గారు ఏమి చెప్పబోయారు అని కడు దీర్ఘముగా నాలోచించితిని. ఆలోచించి చించి, చించడం మానేసి వెళ్ళి ఆ సింహాసనం తీశాను. అంతే ఎక్కడినించో అశరీరవాణి అరిచింది. అశరీరవాణి అంటే మా ఆవిడ శ్రీమతి ప్రభావతి దేవి అన్నమాట. ఆవిడ ఎక్కడున్నా నేను చేసే ప్రతీ పనీ ఇట్టే కనిపెట్టేస్తుందన్న మాట. “ఆ సింహాసనం ఎందుకు ముట్టుకున్నారు ఆ వెధవ చేతులతో. అది అక్కడ పెట్టేసి ఆ చేతులు ఒక మాటు కాల్చుకోండి. “ అంది. ఆవిడ నిత్యాగ్నిహోత్రులు శ్రీ సోమయాజుల గారి పుత్రికా శ్రీ. వాళ్ళ ఇంట్లో నిప్పులు కూడా కడుక్కుంటారుట, అని ఆవిడే చెప్పింది. ఈ లాజిక్కు నాకు అర్ధం కాదు. నా చేతులు అపవిత్రమైనవే కావచ్చు, సింహాసనం మహా పవిత్రమైనదే అవవచ్చు. ముట్టుకుంటే నా చేతులు పవిత్ర మవ్వాలి లేకపోతే సింహాసనం అపవిత్రమవాలి. మరి నాచేతులు ఎందుకు కాల్చుకోవాలి. అపవిత్రమైతే సింహాసనం నే పవిత్రం చెయ్యాలి కదా. కానీ మా ఆవిడ ఉవాచ అంటే సుప్రిము కోర్టు తీర్పు అన్నమాట. No appeal అని భావం. జీవితంలో ఒక్కమాటైనా లక్ష్మణ రేఖ దాటాలి, లేకపోతే మన రామాయణం లిఖించ బడదు. కాబట్టి నా జీవితాన్ని పణం గా బెట్టి, రేఖ మీదనించి దూకేసాను. ఆ సింహాసనం అధిష్టించిన శ్రీ రమా సహిత వెంకటేశ్వర స్వామి ని, చిన్న విఘ్నీశ్వరుడిని, శ్రీల క్ష్మీ దేవి ని తీసి పక్కన పెట్టి, ఆ సింహాసనాన్ని శుభ్రం గా తోమి, కడిగి పరీక్షించాను.

సింహాసనం మామూలుగానే ఉంది. బాగా తోమి కడిగాను కాబట్టి మెరుస్తోంది. సింహాసనం కింద అని మా పితాశ్రీ గారు చెప్పినది గుర్తు తెచ్చుకొని తిరగేసి చూశాను. ఏమి విశేషం గా కన్పించలేదు. ఈ మాటు తీక్షణంగా వీక్షించి కింద అంచుల మీదుగా చేతితో పరీక్షగా రాశాను. ఒక చోట కొంచెం తేడాగా అనిపించింది. అక్కడ నొక్కి విడదీయడానికి ప్రయత్నించాను. కుదరలేదు. నాలో పట్టుదల పెరిగింది. ఈ వేళ ఇదేదో తేల్చుకోవాల్సిందే నని తీర్మానించుకున్నాను. ఓ సుత్తి తెచ్చి రెండు దెబ్బలు వేసాను. ఇంతలో అశరీరవాణి నాముందు ప్రత్యక్షమైంది. “అయ్యో , ఏం పనండి అది, బుద్ధి లేదా మీకు, వందల ఏళ్లగా ఇంట్లో ఉన్న బంగారం లాంటి వెండి సింహాసనం పగల కొట్టేస్తారే మిటి? మీకేమైనా దెయ్యం పట్టిందా” అని మొదలు పెట్టి దండకం చదవడం సాగించింది. మా ఆవిడ దండకం కూడా పద్ధతి ప్రకారం పాడుతుంది. మొదట తెలుగు తర్వాత సంస్కృతం ఆపైన ప్రాకృతం భాషలలొ సుదీర్ఘం గా సాగుతుంది దండకం. ఆవిడ తెలుగు లో ఉన్నంత కాలం మనకి జీవితం మీద విరక్తి కలిగి, సంసారాన్ని త్యజించి సన్యాసుల్లో కలిసిపోవాలనో, హిమాలయాల్లోకి పోయి తపస్సు చేసుకోవాలనో అనిపిస్తుంది. ఇదా జీవితం అని ఏడుపు వస్తుంది. ఆవిడ సంస్కృతంలోకి దిగితే, ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది. చెరువులో దూకడమా, పురుగుల మందు తాగడమా, కిరసనాయిలు మీద పోసుకొని అంటించుకోవడమా లేక ఉరి వేసుకొని తనువు చాలించడమా అని అనేక ఆత్మహత్యా ప్రయత్నాల మీద చర్చ సాగుతుంది. మనసు అల్లకల్లోలం అయిపోతుంది. కడుపులో అనేక గరిటలు ఏక కాలం లో తిప్పుతున్న ఫీలింగు కలుగుతుంది. ఎవరూ ఆపకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసేస్తాం. ఆవిడ ఇంక ప్రాకృతంలోకి ప్రోగ్రెస్ అయితే మనస్సు నిర్మలంగా అయిపోతుంది. మనస్సు ఏకీకృతమై పోతుంది. మన ప్రమేయం లేకుండానే మన శిరస్సు వెళ్ళి గోడలకి కొట్టుకోవడం లేదా మనచేతులు రుబ్బురోలు పొత్రము తీసుకొని మన శిరస్సు ని మర్దనా చేయడమో జరిగిపోతుంది. ఆపైన సర్వేశ్వరుడి దయ అన్నమాట.

మా ఆవిడ సంస్కృతం లోకి ప్రాకృతం లోకి వెళ్ళక ముందే పని కానిచ్చేద్దామని, నా బలం అంతా ఉపయోగించి బలంగా నాల్గు దెబ్బలు వేసాను. ఉన్నట్టుండి ధడేల్ మని ఓ మెరుపు మెరిసింది. ధడేల్ మని మెరుస్తుందా అని ఆశ్చర్యపడకండి. నేను కొంచెం వెరైటీ గా ఆలోచించడం నేర్చుకున్నాను పెళ్లి అయిం తర్వాత. మెరవగానే సింహాసనం కింది భాగం ఊడిపడింది. దానితో బాటు ఒక తాళపత్రం దానికి అంటుకొని ఉన్న ఒక రాగి ఉంగరం కింద పడ్డాయి. మా ఆవిడ దండకం ఆపేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తోంది. నేను విజయ గర్వంతో తల ఎగరవేసి జయ నవ్వు నవ్వాను. అంటే జయ అనే ఆవిడ నవ్వు కాదు. జయజయ విజయీభవ నవ్వు అన్నమాట. అంటే ఆనందం వస్తే నేను కొంచెం అనుమానం పడతాను. ముందు, ఇందులో మతలబు ఏమైనా ఉందా అని క్షుణ్ణంగా పరిశోధించి కానీ ఆనంద పడను.

ఇది పెళ్ళైన మొదటి ఏడాది నించే అలవాటు అయింది. ఆ కాలం లో ఆఫీసు నించి ఇంటికి రాగానే మా ఆవిడ ఒక ప్లేటు లో నాలుగు మైసూరు పాకులు, రెండు మినప సున్ని ఉండలు,రెండు కజ్జికాయలు పెట్టి ఇస్తే, వెఱ్ఱివాడిని కాబట్టి ఓహో భార్యా రత్నమా నేనంటే నీకెంత లవ్వు, ఎంత కష్టపడి చేశావు ఇవన్నీ అని సంబర పడి పోయేవాణ్ణి. అవన్నీ ఆరగించి ఫ్రెష్ గా చేసిన ఫిల్టరు కాఫీ తాగి “నను పాలింపగ నడచి వచ్చితివా అఖిలాండేశ్వరి, భ్రమ్మాండేశ్వరీ ” అని పాడుతుంటే అప్పుడు, అంటే నేను స్వర్గానికి ఇదే దారి అని మహదానంద భరితుండ నై ఉండగా, శ్రీ వెంకయ్యావధాన్లు పౌత్రి , శ్రీ సోమయాజులు పుత్రి , మదీయ పత్ని శ్రీమతి ప్రభావతీ నామధేయి కుడికాలి బొటన వేలు తో నేలమీద బరుకుతూ, ఎడమ చేతి చూపుడు వేలికి పైట చెంగు కుడి చేతి తో చుట్టుతూ, మనోహరంగా చిరునవ్వులు ఒలికిస్తూ xterracyprus అనేది. “నా ప్రియతమా పద్దూ, ఈ వేళ పక్కింటి ప్రతిక్షా బొర్ఘోహైన్ మైసూరు సిల్కు చీర తీసుకొంది. చాలా బాగుంది. అల్లాంటిది ఇంకొక్కటే ఉంది ట ఆ కోట్లో . చవకే 445 మాత్రమే, నాక్కూడా తెచ్చి పెట్టమని చెప్పాను” అని మంద్ర స్వనంతో తెలియబరిస్తే, నందన వనంలో విహరిస్తున్న పద్దూ గాడు ఒక్కమాటుగా కిందకు పడితే, నాల్గు పాకులు , రెండు ఉండలు మరో రెండు కాయలు=445 అని తెలిసిన మరుక్షణం పడిన మనోవేదన, మళ్ళీ మళ్ళీ పడ్డాను కాబట్టి ఆనందం అంటే కొంచెం ఆలోచించి కానీ పడను. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆలోచించ కుండానే, విజయానందం, జయ నవ్వు కలిసి వచ్చేసేయి.

ఆశ్చర్యం గా ఆ తాళ పత్రం మీద తెలుగులో వ్రాసి ఉంది. “నాయనా ప్రద్యుమ్నా నేను శ్రీ సచ్చిదానంద శాస్త్రి ని, నీకు ముందు 162 వ తరం వాడిని. నేను మోక్షకామి నై 12465 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాకు మరణానంతరం మోక్షము + ఈ రాగి ఉంగరం ప్రసాదించాడు. ఈ రాగి ఉంగరం మహా మహితాన్వితమైనది. ఇది కుడిచేతి మధ్య వేలుకి ధరించి, బొటన వేలు తో గీకుతూ, ఎడమచేతి బొటన వేలు చూపుడు వేలు తో నీనెత్తి మీద ఒక వెంట్రుక పీకి పడవేసిన చో ఒక యక్షుడు ప్రత్యక్షమై నీ చిన్న కోరికలు తీర్చును. నీకు జయమగు కాక “ అని వ్రాసి ఉంది. ఇది నేను చదివిన వెంటనే మా ఆవిడ మొదలు పెట్టింది. “ఈ పక్కనో నాలుగు, ఆపక్కనో నాలుగు, వెనక రెండు మిగిలినదంతా మైదానం. మీ తలమీద వెంట్రుకలతో ఏమౌతుంది. సరిగ్గా చదివారా మీ వెంట్రుకలేనా , మీ ఆవిడ నెత్తి మీద వెంట్రుకలని ఉందా మళ్ళీ ఒక మాటు చూడండి” నాకు మండుకొచ్చింది. నావే అని ఘంటా పధం గా చెప్పేను.

మా ఆవిడ అన్నదని కాదు కానీ నాకూ అనుమానం వచ్చింది. బుఱ్ఱ తడిమి చూసు కున్నాను. మా అశరీరవాణి మాట నిజమే అనిపించింది. ఉన్న శిరోజములు సాగదీసి మధ్యకి దువ్వితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నేను భ్రమ పడతాను కానీ ఉన్నవి 10 మాత్రమే అని లెఖ్ఖ తేలింది. అందులో కూడా అన్నీ ఒకే సైజు లో లేవు. కొన్ని పొట్టి, కొన్ని ఒక మాదిరిగా, పొట్టి పొడుగు కానివి, మిగిలినవి పొడుగు అని చెప్పలేను కానీ మిగతా వాటి మీద ఇంకో సెంటీమీటరు ఉంటాయేమో. వీటన్నిటికి ఒకే మాదిరి ఫలితం ఉంటుందా అనే సంశయం కూడా వచ్చేసింది. చిన్న కోరికలు అని వ్రాసి ఉంది కదా, ధన కనక వస్తు వాహనాదులు పెద్ద కోరికలా లేక చిన్నవా? యక్షుడు గారిని అడిగితే ఫ్రీ గా చెప్పుతాడా లేక ఒక వెంట్రుక ఖర్చు రాస్తాడా? యక్షుడి లెఖ్ఖలు ఆకాలం నాటివా ఈ కాలం నాటివా? ఇల్లా అనేక అనుమానాలు నా మనస్సును తొలిచి వేస్తున్నసమయం లో ఉన్నట్టుండి నా నెత్తి మీద చురుక్కుమంది. చూస్తే మా ఆవిడ చేతిలో నావి ఓ అరడజను వెంట్రుకలు. బలంగా పీకిందేమో నా నెత్తిమీద ఇంకా చురుక్కు మంటూనే ఉంది. పొడుగ్గా ఉన్నాయనుకొన్న మూడు వెంట్రుకలు కూడా ఆవిడ చేతిలో.

కొన్ని కొన్ని విషయాలలో మా ఆవిడ రేపటి పని ఇప్పుడే చేసేస్తుంది. ఆలస్యం అసలు సహించదు. తొందర ఎక్కువ. మీరు ఆ ఉంగరం గీకండి, నేనో వెంట్రుక కింద పడేస్తాను అంది. ఏం కోరుతావు అని అడిగాను. మీ కెందుకు, మీరు గీకండి అంది. నేను ఉంగరాన్ని కుడిచేత

15 thoughts on “నాదీ ఓ సినిమా కధే

  1. ఆ. సౌమ్య గార్కి,

    రాజ్ కుమార్ గార్కి,

    ధన్యవాదాలు

  2. as usual hilarious 🙂
    చివరిలో ఆ రెండు వెంట్రుకలు వెతుక్కోవడం…ట్విస్ట్ అదిరింది 🙂

  3. No Need to say sorry sir…. నేను కుడా సరదాగానే జవాబు ఇచ్చాను …సీరియస్ గా నేను తెసుకోలేదు అండి బాబు… ఈ టాపిక్ ని ఇక్కడితే ఆపేద్దాం సారు…మన కామెంట్స్ లో misunderstandin g ఎక్కువైపోతున్నై సారు. thank u

  4. అయ్యా ఎంత మాట… నారద మహర్షుల పాత్ర చేయటమా… అది నాకు పూర్తి వ్యతిరేకం మాస్టారు… మీ బ్లాగ్ చూసాను సర్…మీ పెల్లిచుపుల ప్రహసనం …. మీ విడాకుల కారణాలు …. ఇంకా మీ బందోపఖ్యానం చదివిన తర్వాతే ఈ సందేహం వచ్చింది నాకు…ఎంతైనా మీ తెలివికి జోహార్ సారు… సుబ్బారావు రామారావు తెసుకుంటే వాళ్ళు కొడతారు అని ఎలాగు పడుతున్నాను అని మీ ధర్మపత్ని గారిని కదా వస్తువు గా వాడుకున్నారా ? సూపర్ సర్… అమోఘం 🙂 క్యారీ ఆన్ సారు…

    1. మురళి గార్కి,
      మీరు కామెంటు సరదాగానే పెట్టారనుకొని నేనూ సరదాగానే జవాబు ఇవ్వడానికి ప్రయత్నించాను. మీరు నా జవాబు సీరియస్ గా తీసుకొన్నారేమోన ని అనిపిస్తోంది. I am extremely sorry, if i hurt your feelings.
      నా బ్లాగు లో “నాకు పనీ పాడు లేదు “ సెప్టెంబర్ 2010, అన్న కధ కామెంట్సు లో నేను చెప్పాను.
      “ఇక్కడ నేను సరదాగా, కాలక్షేపం కోసం వ్రాస్తున్న కధలు.ఇందులో ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. ఇంకో విషయం ఇది నా స్వీయచరిత్ర అసలు కాదు. కొంతమంది అల్లా అనుకుంటున్నారేమ ో నని కూడా నాకు అనుమానం వచ్చింది.ఇది నాకు అర్ధంకావటంలేదు. బ్లాగులో స్వీయ అనుభవాలే రాయాలని నేను అను కోవటం లేదు. కధలు కమామీషులు కూడా రాయచ్చనే అనుకుంటున్నాను.”
      ……………………
      ఈ కామెంటు reference ఇవ్వకపోవడం నా పొరపాటు.
      మీలాంటి అనుభవజ్ఙులు కూడా ఇది నా స్వీయ చరిత్ర అనుకుంటున్నారు

  5. నేను వ్రాసేవి ఏవి ఆవిడ చదవరు. ఆవిడ అనేవి ఏవి నేను వినను. అందుకని మాకు సమస్యలు లేవు. మధ్యలో మీరు నారద పాత్ర పోషిస్తానంటే welcome మురళి గారూ. సుబ్బారావు అని కధ మొదలు పెడితే పక్కింటి ఆయన కర్ర పుచ్చుకొని వచ్చాడు. రామారావు అంటే ఎదురింటి ఆయన మంత్రించిన గడ్డిపరక పట్టుకొని నుంచున్నాడు.పోనీ కృష్ణారావు అంటే రెండు వీధుల అవతల సత్యభామ డాబా ఎక్కి ధనుర్భాణాలు ధరించి సవాల్ చేస్తోంది. ప్రభావతీ ప్రద్యుమ్నులు అంటే మీరు ఒప్పుకోవటం లేదు. ఏమి చెయ్యాలి నేను?
    మీకు వీలైనప్పుడు నా బ్లాగు చూడండి సార్. దీని మీద కొంత చర్చ జరిగింది. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  6. ఇది మీ ధర్మ పత్ని గారు చదివారా ? చదివాకా తెలుగు లోనా , sanskrit, లేక ప్రాకృతం వాడరా ? కానీ మీ కధా వస్తువు గా మీ ధర్మ పత్ని గారిని వాడటం ఏమి బాగోలేదు మాస్టారు …
    Good one sir… 🙂

  7. “కానీ మా ఆవిడ ఉవాచ అంటే సుప్రీంకోర్ట్ తీర్పన్నమాట”.

    హ్హహ్హహ్హ…అప్పీలూ లేదూ ఆర్గ్యుమెంటూ లేదు ఈ విషయంలో.

    అద్దరకొట్టేహారం తే గురువుగారూ.

    1. వచ్చిన చిక్కేమిటంటే మా ఇంట్లో కింద కోర్టులుండవు direct గా సుప్రీం కోర్టు అన్నమాట.

      ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ.

Comments are closed.