February 23, 2024

మనసులో మాట నొసటన కనిపించెనట

    రచన : లలిత.జి   పార్వతీ పరమేశ్వరులు పరవశించి నాట్యం చేస్తున్నారు. సరస్వతీ దేవి వీణా గానం వింటూ బ్రహ్మదేవుడు పుట్టబోయే ప్రతి శిశువు నుదుటి మీదా వారి భాగ్య రేఖలు రాస్తున్నాడు. పాలకడలిలో పాముపై పడుకుని తలవంచుకుని తన పాదాలు వత్తుతున్న శ్రీమహాలక్ష్మిని మందహాసంతో చూపు మరల్చుకోలేక చూస్తున్న శ్రీమహావిష్ణువు ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు. “పతికిన్ చెప్పక…” శ్రీదేవి పరుగు అందుకుంటే ఆమె వెనకే హరి, అతని వెనుకే అతని శంఖ చక్రాలతో […]

చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు

రచన: ……….. నూర్ భాషా రహంతుల్లా       గత పది సంవత్శరాలలో516 భాషలు దాదాపుగా అంతరించిపోయాయట. చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ భాషలు మాట్లాడుతున్నారట. ప్రస్తుతం 7299 భాషలు ప్రపంచంలో వాడుకలో ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే దశలో ఉన్నాయని చెబుతున్నాయి. అంతరించిపొయే దశలో ఒక భాష ఉంది అనటానికి ప్రాతిపదికలు ఏంటంటే- 1. ఆ భాషను పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పరు. 2. రోజువారీ […]

రఘునాథ నాయకుని గ్రీష్మర్తు వర్ణన …

రచన  – డా.తాడేపల్లి పతంజలి   ఒక కవి చరిత్రను మొట్టమొదట కావ్యంగా వ్రాసిన మహాకవి రఘునాథ నాయకుడు. కృష్ణ దేవరాయలు మళ్ళీ రఘునాథ నాయకునిగా పుట్టాడేమో అనిపిస్తుంది.ఆయన భువన విజయం నడిపిస్తే ఈయన ఇందిరామందిరం స్థాపించాడు.రాయలు, నాయకుడు ఇద్దరూ మహాకవులే. కాకపోతే రాయలు ఇలలోనూ, కవిత్వంలోనూ సమ్రాట్టు. రఘునాథ నాయకుడు కేవలం కవిత్వంలోనే  సమ్రాట్టు.   రఘునాథ నాయకుని కావ్యాల్లో ప్రసిద్ధికెక్కిన కావ్యం వాల్మీకి చరిత్ర. మొత్తం మూడాశ్వాసాలు.  122+155+169  వెరసి 446 గద్య పద్యాలు […]

నయాగరా! కవితా నగారా!

  రచన : డా. రాధేయ ఒక విషయం గురించిగానీ, ఒక దృశ్యం గురించిగానీ కవితామయంగా కన్నులకు కట్టినట్లు చూపి ఆ దృశ్యీకరణశైలితో ఆలోచన్లని కవిత్వంగా మలిచే దిశగా ప్రయాణించే కవులు కొందరే కన్పిస్తారు మనకు. సామాజిక అనివార్యతనుంచి ఏకవీ తప్పించుకోలేడు. ఇప్పుడు ప్రపంచీకరణతో ప్రపంచమే మన ముంగిట్లో వాలింది. యాంత్రీకరణ మనిషి అవసరాల్ని తీర్చలేని స్థితిలో మనిషి బతుకును మార్కెట్లో నిలబెట్టింది. ఈ మార్కెట్ సంస్కృతిలో మానవ సంబంధాలు లేవు. ప్రేమలు, ఆపేక్షలు లేవు. అన్నీ […]

‘చందమామ’ విజయగాథ

రచన : కె. రాజశేఖర రాజు.   భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన గొప్ప చరిత్ర చందమామ సొంతం. కోట్లాది మంది పిల్లల, పెద్దల మనో ప్రపంచంపై దశాబ్దాలుగా మహత్ ప్రభావం కలిగిస్తున్న అద్వితీయ చరిత్ర చందమామకే సొంతం. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చక్కటి వినోద సాధనంగా పనిచేసిన చరిత్రకు సజీవ సాక్ష్యం చందమామ. చందమామ ఆవిర్భవించి అప్పుడే ఆరు దశాబ్దాలు […]