March 28, 2024

గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర

రచన :  మన్నె సత్యనారాయణ   గతచరిత్రలోని అంధకారాన్ని చీల్చుకుంటూ ఒక సూర్యుడుదయించాడు! మేలుకొలుపులు కోడి కూసింది.‘తూర్పు’బలబల తెలవారింది. అప్పటి విశాఖ మండలం, ఎస్.రాయవరం గ్రామంలో గొడవర్తి కృష్ణయ్య పంతులుగారింట్లో, వారి కుమార్తె కౌశల్యమ్మ ఒక ‘చిన్న మగవానిని’కన్నది. ఆ రోజు 21, సెప్టెంబరు, 1862వతేదీ ఆదివారం అభిజిత్ ముహూర్తం, మఖా నక్షత్రం జన్మకాల కేతు మహర్దశ. అది దుందుభినామ సంవత్సరం, భాద్రపదమాసం. కౌసల్యమ్మ భర్త గురజాడ వెంకట రామదాసు.   ఆరోజు ఉదయించిన చిన్ని సూర్యుడే […]

జయించు జగాన్ని

రచన : డా. వి.సీతాలక్ష్మి . విశ్రాంత తెలుగు రీడర్   ఏ ఇంటి కథనం విన్నా ఏమున్నది కొత్తదనం ప్రతి ఇంటి చరిత సమస్తం వృద్ధాప్యపు ఒంటరి పయనం   అమ్మానాన్నా ఆరునెలలకే అనుమతి అమెరికా డాలరు  స్వర్గాదపీ గరియసి స్వదేశీ సౌరభ సంస్కృతి పరిమితి విదేశీ వింత వికృతి దిగుమతి..   తాను నాటిన మొక్క ఎదిగి మ్రానై నీడనిస్తే తాను సాకిన కన్నబిడ్డే నీడనివ్వక త్రోసివేస్తే చెట్టా? బిడ్డా? ఏది మనకు తోడూ […]

సహజ భాషా ప్రవర్తనం (Natural Language Processing) – 2

రచన : సౌమ్య వి.బి.   “కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్” అని ఒక జర్నల్ ఉంది. Computational Linguistics అంటే గణనాత్మక భాషాశాస్త్రం (అనుకుందాం తాత్కాలికంగా). సాధారణంగా, సహజ భాషా ప్రవర్తనానికి సమానార్థకంగానే వాడుతూ ఉంటారు. సహజ భాషా ప్రవర్తనం (నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్ – రంగంలోని ప్రముఖ పత్రికల్లో ఇదీ ఒకటి. తరుచుగా సమకాలీన పరిశోధనల గురించిన పత్రాలతో పాటు, “చివరి మాటలు” (Last Words) అన్న శీర్షికన, ఈ పరిశోధనల గురించిన ఆలోచనల వ్యాసాలు కూడా […]