April 19, 2024

జయించు జగాన్ని

రచన : డా. వి.సీతాలక్ష్మి . విశ్రాంత తెలుగు రీడర్

 

ఏ ఇంటి కథనం విన్నా ఏమున్నది కొత్తదనం

ప్రతి ఇంటి చరిత సమస్తం వృద్ధాప్యపు ఒంటరి పయనం

 

అమ్మానాన్నా ఆరునెలలకే అనుమతి

అమెరికా డాలరు  స్వర్గాదపీ గరియసి

స్వదేశీ సౌరభ సంస్కృతి పరిమితి

విదేశీ వింత వికృతి దిగుమతి..

 

తాను నాటిన మొక్క ఎదిగి మ్రానై నీడనిస్తే

తాను సాకిన కన్నబిడ్డే నీడనివ్వక త్రోసివేస్తే

చెట్టా? బిడ్డా? ఏది మనకు తోడూ నీడా?

 

అవుతున్నాయి ఇళ్లన్నీ వృద్ధాశ్రమాలు

మృగ్యమవుతున్నాయి మమతల విలువలు

ఈ మెయిల్, సెల్‌ఫోన్‌ల పలకరింపులే వరాలు

ఇవి రూకలు తీర్చని బాధలు, సభ్య సమాజానికి సవాళ్లు

ఇవే వ్యషి కుటుంబాల వ్యధలు, వరాల్లాంటి శాపాలు..

 

అయితే వృద్ధాప్యం శాపం కాదు

జరరుజలు కర్మలు కావు

మనిషి మనుగడకు మనసే మూలం

జయిస్తే అంతా ఆనందం…

 

భయం వద్దు  రోగం తలచి

బెదురు వద్దు ఏకాంతం చూసి

జగమంత కుటుంబం నీదని

దర్జాగా గడిపెయ్ దర్పంగా బ్రతికెయ్…

 

1 thought on “జయించు జగాన్ని

  1. //భయం వద్దు రోగం తలచి

    బెదురు వద్దు ఏకాంతం చూసి

    జగమంత కుటుంబం నీదని

    దర్జాగా గడిపెయ్ దర్పంగా బ్రతికెయ్…//,,good idea

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *