April 19, 2024

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

— రచన:  ?????? (మీరే చెప్పాలి)

 

మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు….అదేంటీ, వంటలు వండుతారుగాని రాయటమేమిటీ అంటారా…..ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..)…..ఒకాయన “బ్లాగునలుడూ”, ఇంకొకాయన  “బ్లాగుభీముడూ”…… ఒకావిడ ఆరో, పదారో,నూటయాభైయ్యారో “రుచులు”తెగ రాసేస్తుంటుంది…..మరొకావిడ “రుచులు” అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది…..:)….. మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా….అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా సారీ రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా అనుకుని రాసేద్దామని డిసైడైపోయా….

ఇక వాళ్ళలా కాకుండా కాస్త సిన్సియర్గా వండిమరీ రాద్దామని బాగా ఇదిగా అనేసుకున్నా…కాని ఎక్కడ రాయాలి???….. గోడలమీదా,గొబ్బెలమీదా రాస్తే ఎవరు చూస్తారు? పైగా మా ఇంటిఓనరు పట్టుకు తంతాడు…బ్లాగొకటి తెరిచి రాద్దామా అనుకుంటే మనం మహావీర బద్దకస్తులం కదా…”ఉన్న మూణ్ణాలుగు బ్లాగులే సరిగ్గా మెయింటైన్ చెయ్యట్లా, ఇప్పుడు కొత్తగా మరోటి మొదలెట్టి, అదికూడా గాలికొదిలేస్తే, బ్లాగ్లోకంలో ఇప్పుడున్న కాస్తపరువు కూడా పోతుంద”ని మా –.బ్లా.స. మిత్రులు హెచ్చరించారు….ఏ పత్రిక్కో పంపిద్దామా అంటే మనవాళ్ళు చూసే పత్రికలేం ఉంటాయ్, పైగా ఆ పత్రికలవాళ్ళు మన వంటకం వేస్తారని గ్యారంటీ ఏం లేదుకదా అని తెగ ఆలోచించేస్తుంటే ఓ అవిడియా తట్టింది…..

మన “మాలిక పత్రిక” వాళ్ళు, కొత్తవాళ్ళని, వాళ్ళ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారని, విభిన్నమైన అంశాలకి ప్రాముఖ్యతనిస్తారని తెలుసు కదా! సో వాళ్ళని డవిరెక్టుగా కాంటాక్టు చేశా… వాళ్ళదసలే విశాల హృదయం…నా విషయం చెప్పగానే, “మీకెందుకు, మీరు రాసి పంపండి.వేసేస్తాం..”అని నాకు అభయహస్తం ప్రకటించేశారు….అద్గదీ ఇంకేముంది! హాయిగా ఊపిరి పీల్చుకుని రాయటానికి ప్రిపేరై పోయా…….

హ్మ్! రాయాలంటే మరి వండాలికదా… “ఆ! మరీ చెప్తావ్! రాయాలంటే నిజంగానే వండాలా ఏంటీ, ఏదో ఒకటి రాసేస్తే పోలా, చదివే వాళ్ళంతా నిజంగా చూడొచ్చారా పెట్టారా?”అన్నారు మా –.బ్లా.స. మిత్రులు….ఊఁహూఁ! నే ఒప్పుకోలా, మరి నేను చాలా సిన్సియర్ కదా! అందుకని నిజంగా వండాక రాద్దాం అనుకున్నా….ఐతే ఇంతకీ ఏం వండాలి? అని తెగ ఆలోచించా……
ఇంతలో మా బికీలీక్స్ బృందం ఓ మాంఛి ఇన్పర్మేషన్ తెచ్చారు…..ఆ సదరు బ్లాగుభీముడుగారు ఒక వెరైటీవంటకం చేసి మరొకాయనకి పార్సెలు ఇచ్చారంట. అది ఇంకా ఆయన బ్లాగులో పెట్టలా, ఇప్పుడప్పుడే పెట్టే ఆలోచన కూడా లేనట్టుంది….. ఇంతకీ ఆ వంటకం ఏంటనుకున్నారు, “పులిహోరగోంగూర పచ్చడి”……ఓస్! అదే కదా అనిపించింది….ఆయనేనా చేసేది, మేం చెయ్యలేమా,రాయలేమా అనుకున్నా…..పైగా మొదలెట్టటమే “ఊరగాయలతో”, అదీగాక నాకు అత్యంత ప్రాణప్రదమైన మన “ఆంధ్రమాత” గోంగూరతో మొదలెడితే మనకీర్తి దశదిశలా వ్యాపిస్తుంది కదా అనిపించి ఉబ్బితబ్బిబ్బై ,”శభాష్” అని నా జబ్బ నేనే చరిచేసుకున్నా…….:)……

ఇక పచ్చడి ఎలా పెట్టాలి, ఏమేం సంభారాలు కావాలి అని ఆలోచించా….. మా అమ్మ,పెద్దమ్మ కలిసి పెట్టేవాళ్ళు ఆ పచ్చడి…..వాళ్ళు పెట్టిన పచ్చడి సప్తసముద్రాలవతలక్కూడా ప్రయాణం చేసొచ్చేది…..అమ్మకో ఫోనుకొట్టి ఎలా పెట్టాలో, ఎంతెంత కొలతలో కనుక్కున్నా…పైగా వాళ్ళు పెడుతుంటే ఏళ్ళ తరబడి చూసిన అనుభవంకూడా బోలెడుంది కదా…ఇంకేముంది అన్నీ తెచ్చుకుని రంగంలో దూకేశా…..

ఏమేం తెచ్చుకున్నానంటే :-

1)     మాంఛి ముదురుగోంగూర – ఒక కేజీ
2)    చింతపండు – నూటాయాభై గ్రాములు
3)    ఎండు మిరపకాయలు – రెండొందల గ్రాములు
4)    ధనియాలు – చారెడు
5)    మెంతులు – రుచికి సరిపడా (అంటే ఒక రెండు స్పూనులనుకోండి)
6)    నూనె – అరకేజీ
7)    వెల్లుల్లి పాయలు –  వలిచిన రెబ్బలు ఒక చారెడు
8)    ఉప్పు – పావుకేజీ
9)    ఇంకా తాలింపుకి ఇంగువ, తాలింపు గింజలు

ఎలా చేశానంటే :-

•    ముందు గోంగూరని శుభ్రంగా కడిగేసి ఆరనిచ్చి బాండీలో సరిపడా నూనె వేసి వేయించాను.
•    గోంగూర వేగుతుండగానే, ముందే బాగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా పిసికి పులుసు తీసి పొయ్యిమీద పెట్టి పులిహోర పులుసులా కుతకుతా ఉడికించా…..ఉడికాక దించి పక్కన పెట్టా… వేగిన గోంగూరని కూడా…
•    ఇప్పుడు ఎండు మిరపకాయలు మరికాస్త నూనెవేసి బాగా వేయించా…అవి బాగా వేగేప్పుడు చివర్లో  ధనియాలు,మెంతులు వేసి అన్నీ బాగా వేగగానే దించేశా….
•    ఇప్పుడు ఈ మిరపకాయలు,ధనియాలు,మెంతులు,ఉప్పు కలిపి మిక్సీలో వేసి, బాగా మెత్తగా అయ్యేలా చేసి ఆ “కారం” పక్కన పెట్టుకున్నా…
•    ఇక పైన వేయించి పెట్టుకున్న గోంగూర, ఉడకబెట్టిన చింతపండు పులుసు, కొట్టిపెట్టుకున్న కారం అన్నీ కలిపి గ్రైండర్లో వేసి రుబ్బాను….
•    వెడల్పాటిబాండీ పొయ్యిమీద పెట్టుకుని మిగిలిన నూనె అంతాపోసి బాగా కాగనిచ్చి తాలింపు గింజలు,ఇంగువ వేసి చిటపటలాడగానే దించి ఈ నూనె ముందు రుబ్బిపెట్టుకున్న పచ్చడికి కలిపాను….
•    చివర్లో ఆ చారెడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి ఆరాకా తీసి బుల్లిజాడీకి పెట్టాను….
•    అంతే! ఘుమ్మని వాసనలు కొడ్తున్న “పులిహోర గోంగూర” తయారైపోయింది…….

ఈ పచ్చడి ఎలా తినాలంటే :-

కంచంలో వేడివేడన్నం పెట్టుకుని, ఈ పచ్చడేసుకుని్, మాంఛి వెన్నపూసేసుకు తింటుంటే ఉందీ నా సామిరంగా…అబ్బబ్బ…యమాగా ఉందిలే……. ఇది జొన్నసంకట్లోగాని, రాగిసంగట్లో గాని ఏసుకుతింటూ మజ్జెన ఉల్స్ కుమ్ముతూ ఉంటే ఇంకా యిరగదీసేస్తదంతే…..;)

మీరు చేసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :-

ఏం లేదండీ, ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే పచ్చడి రుచీ అదిరిపోద్ది, ఎక్కువనాళ్ళూ ఉంటది….
•    మొదట గోంగూర బాగా ముదురాకు తీసుకోవాలి…ఎందుకంటే లేతాకు వేయించగానే లేహ్యంలా ఐపోతుంది….. ముదురాకైతేనే తాళ్ళుతాళ్ళుగా ఉండి బాగుంటుంది…ఇక లేతాకే దొరుకుతుందనుకోండి ఎక్కువ రుబ్బాల్సిన పన్లేదు….బాగా కలిపినా సరిపోతుంది….. ఏ ఆకైనా మిక్సీలు,గ్రైండర్ల కంటే రోట్లో రుబ్బితేనే బాగుంటది…..
•    ఆకు కేజీ అంటే వలిచిన ఆకు, కట్టలతో కాదు…:)….. ఆకుని ఎక్కువగా కడగొద్దు, ఒక్కసారి నీళ్ళల్లో ముంచి దులిపి తీసెయ్యండి..ట్యాపుల కింద ఎక్కువసేపు పెట్టి కడగొద్దు….అలా చేస్తే ఆకుకి ఉన్న పులుసు కారిపోతుంది…అప్పుడు రుచీ పచీ ఉండదు..నిలవకూడా ఉండదు…….
•    ఇక పై కొలతలన్నీ నేను ఉజ్జాయింపుగా చెప్పినవే… ఎందుకంటే అమ్మ అన్నీ కట్లు,అరసోలల లెక్కన చెప్పింది…:)
•    చింతపండు పులుసు పిసకక పోయినా, బాగా ఉడికించి అది మిక్సీ పట్టేస్తే తొక్కంతా కూడా కలిసిపోతుంది…పులుసుకూడా చిక్కగా ఉంటుంది…
•    ఇక కారం…. పైన నేను చెప్పినట్టు అప్పటికప్పుడు కొట్టుకున్నా సరే లేకపోతే మామూలు పచ్చళ్ళకారమైనా వాడుకోవచ్చు…అప్పుడు కారం కొలత – అరసోల, అంటే షుమారు ౩౦౦మిలీ గ్లాసుతో కొలిస్తే ఎంత వచ్చిద్దో అంత, ఉప్పు కూడా అంతే….ఆ కారానికి ధనియాలు,మెంతులూ సరిపడా కలిపి కొట్టుకోవాలి… కాని వేయించికొట్టిన కారమే రుచి….ఉప్పుకూడా కళ్ళుప్పైతేనే బాగుంటుంది…..
•    నూనె కూడా చూసుకుని కలుపుకోవాలి…ఆకుని బట్టి మారుతుంది కలుపుకోవాల్సిన కొలత…..వేరుశనగనూనె ఐతేనే కమ్మగా ఉంటుంది…..గోంగూర ఎంత నూనె పోసినా, ఎన్ని మిరపకాయలు పోసినా వద్దనదని వెనకటికెవరో ఓ కవిగారు చెప్పారు…:)
•    తాలింపు గింజల్లో మినప్పప్పూ,పచ్చనగపప్పూ,ఆవాలూ,ఎండు మిరపకాయలూ, ఇంగువా వేసుకోవాలి…..జీలకఱ్ఱ్రా,కరివేపాకూ అవసరం లేదు……
•    ఇక వెల్లుల్లి ఇష్టమున్నవాళ్ళు వేసుకోవచ్చు,లేకపోతే లేదు….
•    ఇక అన్నిటికన్నా ముఖ్యం తడిచేతులు,తేమ అస్సలు తగలనివ్వొద్దు….పచ్చడి బాగా ఆరాకే డబ్బాకో,జాడీకో పెట్టండి…..ఇలా చేస్తే తేలిగ్గా నాలుగైదునెలలుంటుంది, మీరు ఉండనిస్తే…;)……ఫ్రిజ్జులో అయితే సంవత్సరంపాటుంటుంది……
•    పచ్చడి రెండురోజులు ఊరనిచ్చి తింటే సరిపోతుంది మరి…నేనిక్కడ తెగ లాగించేస్తున్నా, మీరూ బరిలోకి దిగండి మరి.

ఇట్లు,
మీ
(చెప్పుకోండి చూద్దాం.. రోజూ నన్ను చూస్తూనే ఉంటారు. ఆ మాత్రం చెప్పుకోలేరా. ఇంతమంచి గోంగూర పచ్చడి చెప్పాను. అది చేసి తినేసి వచ్చి నేనెవరో చెప్పుకోండి)

29 thoughts on “ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

  1. hmm,enti eee gongura discussion sorry gongura pachadi discussion.Sorry saradaga annanu,kani gongura pachadila discussion chala bavundi.Kani C.I.D. valla ni adagandi rasina donga evaro.Voorinchi voorichi champeru kadandi gongura pachadini.

  2. definitegaa kautilya gaare, amma ,peddamma pachchaallu pettadam, solala lekka kolavadam…ekkuva chadavaledanukondi kaanee ennela oka saari chadivinaa 100 saarlu chadivinatte….

    bulusu gaaruu, meeku naa vanta meedunna nammakaaniki boldu kRtajnatalandee…kaanee baabOy! nenu illaanti vantalu cheste…30 rojulu nilavundaalsina pachchadi oka rojuke….govindaa…govindaa…anduvalana nenu cheppochchedentante: anta nammakamgaa cheppaaru kaabatti oka saari satee sametamgaa maa canadaa ki vachchi naa vanta ruchi choodaalsindigaa korutunnaanu.

  3. బులుసుగారండి. ఈ పత్రికలో బ్లాగర్లు కానివారి రచనలు కూడా ఉన్నాయి. మరి వాళ్లెవరో మీకు తెలీదుకదా. అలాంటప్పుడు ఒకటికంటే ఎక్కువ రచనలు ఎవరివైనా ఉండొచ్చుకదా..

  4. >>> ఈ సంచికలో ఒకే రచయిత/త్రి రాసిన రచనలు ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి.

    కాబట్టి జ్యోతి, తృష్ణ, భరద్వాజ్ గార్లు కారు. సంపాదకీయం వ్రాసిన సుజాత గారు కూడా కాకపోవచ్చు. (సంపాదకీయం ఎథికల్ గా ఒక రచన కింద పరిగణించకూడదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి. తప్పు అంటే చెంపలు వేసుకుంటాను)
    కౌటిల్య గారు too obvious అనిపిస్తోంది. కాబట్టి కాకపోవచ్చు. కానీ అనుమానం ఈయన మీదే ఉంది నాకు.
    మధ్యలో జ్యోతి,సుజాత,కౌటిల్య, వేణు గార్లు కన్ఫ్యూస్ చేసేస్తున్నారు.
    అవును, రహ్మాన్, కృష్ణ ప్రియ గార్లు ఎందుకు కాకూడదు. కృష్ణప్రియ గార్కి ఎన్ని బ్లాగులున్నాయో తెలియదు. రీసెర్చ్ చెయ్యాలి.రహ్మాన్ గార్కి ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయనుకుంటాను. వీళ్ళిద్దరు ఛుపా రుస్తుం లా అన్న అనుమానం.
    ఇంతకీ ఈ క్విజ్ కి లాస్ట్ డేట్ ఎప్పుడు? అప్పటిదాకా ఆలోచిస్తూనే ఉంటాను.

  5. ఇది రాసింది భరద్వాజ అని నాకు అనుమానమొస్తోంది

    వరూధిని గారూ, నాకు మూడు నాలుగు బ్లాగులు లేవు గానీ ఒకటి రెండు బ్లాగులున్నాయి. నా బ్లాగూ, మా వూరి బ్లాగూ

  6. నా ఓటూ జ్యోతిగారు రాశారనే. కానీ మిగతాకామెంట్లు చూడకపోతే కౌటిల్య అనే అనుకునేవాణ్ణి.

  7. కొంచం కౌటిల్య శైలిలా ఉంది కాని కౌటిల్య కాదు..ఉల్లిపాయకి కౌటిల్యకి ఆమడ దూరం.
    సుజాత గారు అసలు కాదు..(అవును సుజాత గారూ మీకు మూడు నాలుగు బ్లాగులున్నాయా?).

    ఇది ముమ్మాటికి జ్యోతి గారే వ్రాసి ఉంటారని నా నమ్మకం.

  8. నేను కాదు నిజంగా!

    కానీ రాసిందెవరో కానీ కౌటిల్య మీద డౌటొచ్చేట్టుగా ఉంటది, అదిరి పోద్ది అని అచ్చ తెలుగు గుంటూరు, ఒంగోలు మాటలు వాడి కౌటిల్యని బాగా ఇరికించారు. కానీ కౌటిల్యే కూడా అయ్యుండొచ్చు, ఎందుకంటే ఈ మధ్యే కౌటిల్య పులిహోర గోంగూర పెట్టానని చెప్పి నన్ను ఊరించాడు.

    ఇది రాసింది జ్యోతి ! Am I right Jyothi?

    ఈ సందర్భంగా నాకోటి అర్థమైంది, నా బ్లాగులు నేను సరిగా మెయింటైన్ చెయ్యాలి!:-))

    ఈ సందర్భంగా నాకింకోటి అనిపిస్తోంది. నేను అర్జెంట్ గా పులిహోర గోంగూర పెట్టాలి.

  9. ఎహే ఎవరు రాస్తే ఏంటి,తినేసి రుచి బాగుందో లేదో చెప్పడానికి ఇంత తాత్సారం ఎందుకంటా!!!

  10. ఇది రాసింది జ్యొతి గారు 🙂

    కౌటిల్య గారి లాగా రాయలనుకున్నారు కాని వలవటం , పెద్దమ్మ కౌటిల్య గారి
    యవ్వారం కాదు . ఇక ఆయనకి ఉల్స్ కి ఆమడ దూరం 🙂
    భాస్కర్ గారు అసలె కాదు .
    సుజాత గారు పచ్చడి ఎలా చేయలి అని అడిగే రకం కాదు, చెసెసి చెప్పే రకం కాబట్టి ఆవిద కూడ కారు .

    1. శ్రావ్య గారు.. మీ పాయింట్స్ బానే ఉన్నాయ్ కానీ జ్యోతి గారికి మూడో నాలుగో బ్లాగులేంటండీ.. ముఫ్ఫైనాలుగు బ్లాగులుంటేనూ :-))

  11. రాసిన వారెవరో కానీ క్షుణ్ణంగా కౌటిల్య పద్దతిని అద్యయనం చేసి రాశారు 🙂
    ట్రిక్ చేయడానికి అబద్దాలాడితే ఏం చేయలేం కానీ నా అబ్సర్వేషన్ ఇదీ..
    కౌటిల్య కాదని నా ఉద్దేశ్యం….చెప్పిన ఉపోద్ఘాతం కరెక్ట్ ఐతే ఈ రచయితకి వంటల బ్లాగ్ లేదు. కౌటిల్య రోలూ రోకలీ అంటాడే కానీ మిక్సీలు గ్రైండర్లు వాడడు (నేను చూసినపుడు తన దగ్గరలేవు) అలానే మా తమ్మాయ్ వంటల్లో పెద్ద ఉల్లి కూడా అంతగా వాడడు. కౌటిల్య పోస్టుల్లో ఉంటుంది కన్నా “ఉండిద్ది” అని వాడడం చూస్తాం అది మిస్సింగ్. ఇక మా వాడి వంటల ఫోటోలు కూడా ఒక ప్రత్యేకమైన క్వాలిటీ తో ఉంటాయ్ పై ఫోటో ఆ స్టాండర్డ్స్ మీట్ అవడంలేదు 😛 ఇంకా రచయిత వాళ్ళ అమ్మ పెద్దమ్మ చేసిన పచ్చడి సప్త సముద్రాలు దాటి ప్రయాణం చేసొచ్చేదిట అంటే రచయిత ప్రస్తుతమో గతంలోనో సప్తసముద్రాలకావల ఉండి ఉంటారు.
    నాకు ఈ రచయిత సుజాత గారు అయి ఉండచ్చు అని అనిపిస్తుంది 🙂

    1. “””” పైగా మా ఇంటిఓనరు పట్టుకు తంతాడు…బ్లాగొకటి తెరిచి రాద్దామా అనుకుంటే మనం మహావీర బద్దకస్తులం కదా…”ఉన్న మూణ్ణాలుగు బ్లాగులే సరిగ్గా మెయింటైన్ చెయ్యట్లా, ఇప్పుడు కొత్తగా మరోటి మొదలెట్టి, అదికూడా గాలికొదిలేస్తే, “”””
      నిజమే!!!
      ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చదువుతుంటే, సుజాత గారేమో అని డవుటు వస్తోంది. ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నా. కానీ,
      సుజాత గారికి ఇంటి ఓనర్ లేదు… ఉన్నది ఇంటాయన మాత్రమే!!!! సప్త సముద్రాలు పాయింట్కాస్త మీట్ అవుతోంది. 🙂
      పైగా మూణ్ణాల్గు బ్లాగులు తెరిచి గాలికొదిలేసిన బ్లాగరు సుజాత గారే… (సుజాత గారూ. మిమల్నే… వింటున్నారా? ). ఈ పాయింటూ కూడా మీటింగు 🙂

      సుజాత గారూ క్షమించాలి. సరదాకి మాత్రమే.
      కౌటిల్య, మిక్సీలు వాడొద్దని చెబ్తారే కాని వాడరు అని తెలీదు.

  12. ఒక్కో వాక్యం చివరా మూడు చుక్కలు. ఇది మన బాటిల్యే.. ఛ, సారీ.. కౌటిల్యే 🙂

    1. Flow of thoughts….
      అక్షరాలు కాపీ చెయ్యొచ్చు కాని. అలోచనా సరళి ని కాపీ చెయ్యలేము..
      బ్లాగు ని కాపీ చెయ్యొచ్చేమో కాని, రాసే విధానాన్ని కాపీ వల్ల అలవర్చుకోలేరు.
      -sudha

  13. కన్ ఫ్యూస్ చెయ్యడానికి. ఉల్స్ ని భాస్కర రామరాజు గారి దగ్గరి నుండి, బండి ర రాయడం తాడేపల్లి వారి నుండి అరువు తెచ్చుకున్నారు కానీ!!!!

    మనకి ఆ మాత్రం తెలీదేంటి ఎవరన్నది 😛

  14. ఇంకెవరూ? కచ్చితంగా. కౌటిల్య గారే!!!
    అనుమానం లేదు .

    ఎలా తెలుసు అంటారా?

    ఈయన వంటకం కన్నా ఉపోద్ఘాతానికే కమ్మదనం ఎక్కువ. భలే గా కమ్మగా రాసేస్తుంటారు…
    ఇక బ్లాగు ల్లో ఈయన కన్న అమ్మ కూచి ఇంకెవరు? హి హి హి. అమ్మ ఊసు లేక ఈయన బ్లాగు పూర్తి కానే కాదు…
    ముఖ్యంగా మరో క్లూ ఎంటంటే , వంట పూర్తి చేశాక, దాన్ని ఎలా కలుపు కోవాలో , ఎంత మోతాదు లో ముద్దలు కలిపి నోట్లో పెట్టుకోవాలో.ఏ సైజు ముద్దలకి, రుచి గ్రంధులు ఎలా స్పందిస్తాయో, కొలత లతో సహ ఇచ్చే ప్రావీణ్యత బహుశా ప్రపంచం లో కౌటిల్య ఒక్కరేనే మో…

  15. హన్నా! జ్యోతిగారూ! మనకి పోటీగా వచ్చేశారు ఎవరండీ వీరు?
    పైగా నా వంటకం కాపీ……నేను బ్లాగులో పెడదాం అనుకున్నేలోపే…….

    సునీత గారూ! నేనా! హ్మ్…నా బ్లాగులో రాసుకోటానికే నాకు టైము లేదు…..ఇక రాసి పత్రికలకి పంపటానికి టైమెక్కడా!
    పైన బ్లాగరు చెప్పిందాన్ని బట్టి, శైలినిబట్టి చూస్తుంటే
    నాకు సుజాతగారేమో అనిపిస్తోంది….;)….

  16. uls, jonna buvva—bhaskar gaari patent.

    raasina style, soela aragidda, veese lekkaloo, amma peddamma, ruchi adiripoevaTam, goengoora taalhlhulaagaa unDaTam, sambaaraaloo, ivvannee kouTilya maaTalu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238