April 19, 2024

ఓనమాలు

రచన : ఆదూరి సీతారామమూర్తి   ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్యగారి కావార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది. ఎంత బడిపంతులు పని చేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి, పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది. విద్యను నమ్ముకుని బ్రతుకుతూన్నందుకు సరస్వతీదేవి తనకు అన్యాయం చెయ్యలేదు. తూర్పు వాకిట్లో పారిజాతం మొక్క దగ్గరగా యీజీఛైర్లో కూర్చున్న శివరామయ్యగారికి ఆ తొలిసంధ్యలో ఎన్నో కొత్త అందాలు గోచరించాయి. […]

చేపకి సముద్రం-భాషకి మాండలికం

రచన :   వై.   శ్రీరాములు-అనంతపురం సంస్కృతం నేర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల్ని వినియోగించిన మనం, ఆంగ్లం నేర్చుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల్ని వినియోగిస్తున్నమనం మాండలిక పదాల్ని గమనించడానికి క్షణాలలో విసుగును ప్రదర్సిస్తున్నాం. మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే వాదనలోనే మనం పయనించినంత కాలం ఆప్రాంత ప్రజల జీవనాన్ని ఆప్రాంత ప్రజల సంస్కృతిని ఆప్ర్రాంత ప్రజలకే దూరం చేసినవారుగా మనం మిగిలిపోతున్నాం.   వెంటనే అర్థం కావడానికే ప్రాధాన్యత జరుగుతోంది గాని ఈనాటికీ వెంటనే […]

ఆదర్శసతి సీత

రచన : డా. వి.వి.రాఘవమ్మ భారతీయ సాహిత్యమునందేగాక విశ్వసాహిత్య వీధులలో కూడా  రామాయణం మహేతిహాసంగా నిస్తుల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.  వాల్మీకి మహర్షి ఉత్తమ ఆదర్శానికి ఉదాత్త దర్శనానికి ఇది ప్రతిరూపం.  అవతారపురుషులలో ఉత్తముడు, ఉదాత్తుడు అయిన శ్రీరామచంద్రుని అపురూపమైన చరితం.  రామాయణం ప్రపంచితమైనది.  “సీతాయాశ్చరితం మహత్”అని వాల్మీకియే ప్రవచించాడు. సీతారాములిద్దరు ధర్మకర్మల్ని ఆచరించి చూపారు.  నాటి నుంచి నేటివరకు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. రాముడు ఆచరించినట్లు,శ్రీకృష్ణుడు ప్రభోధించినట్లు చేయండని విజ్ఞుల విజ్ఞాపన. గీర్వాణ భాషలో మధురాక్షర సమన్వితమై కావ్యంగా […]