April 24, 2024

గిన్నీస్ రికార్డ్

రచన : డి.వి.హనుమంత్ రావు.

పాత్రలు :  భార్య — శ్రీమతి విజయలక్ష్మి.. భర్త .. శ్రీ డి.వి.హనుమంత్ రావు..

 

 

భార్య.. (పాట)వాసంత సమీరంలా .. నులివెచ్చని గ్రీష్మంలా….. సారంగ సరాగంలా ..అరవిచ్చిన లాస్యంలా.. ఒక శ్రావణమేఘంలా…. సాధించాలి

భర్త : ఈ గోల మొదలైపోయింది..

భార్య : ఈసారి ఎలాగైనా సాధించాలి…

భర్త :(మధ్యలో ఆపి) అమ్మా! తల్లీ! ఈసారేమిటమ్మా నీ సంకల్పం?

భార్య: కస్తూరి..కస్తూరి.. (వినిపించుకోకుండా పాట కంటిన్యూ చేస్తూ వుంటుంది)

భర్త : ఏమిటి? ఏవిటి చేయదలుచుకున్నావు?

భార్య: ఇరవై నాలుగ్గంటలూ శాస్త్రీయ సంగీతం  పాడి గిన్నీస్ బుక్కులో కెక్కిన మహానుభావులు ఉన్నారా?

భర్త : ఊ వున్నారు. వున్నారు.

భార్య: అలాగే ఇరవై నాలుగ్గంటలూ నాట్యప్రదర్శన చేసి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన మహానుభావులూ వున్నారు ?

భర్త : అవును..మహానుభావులు…కెక్కారు..కెక్కారు…

భార్య:   (ఆవేశంతో) అలాగే…వారి అడుగుజాడల్లో నడిచి నేను కూడా..ఇరవై నాలుగ్గంటలు. టి.వి.సీరియల్స్‌ టైటిల్ సాంగ్స్ పాడి, గిన్నీస్ బుక్‌లో కెక్కి ఆ  రికార్డులన్నీ బ్రద్దలు కొడ్తాను. ఇదే…ఇదే నా శపధం. (ఆవేశంతో ఊగిపోతుంది).

భర్త :   ఓర్నాయనోయ్ … ఓర్నాయనోయ్ …  ఎప్పటికయ్యేనిది..

భార్య:(పాట) అంతరంగాలూ.. అనంత మానస చదరంగాలూ..

భర్త : ఓ!  అనంతలక్ష్మీ.. ఈ లోపల  కాస్త కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకో తల్లి!

భార్య:(పాట) మెట్టెల సవ్వడి.. ఓ. ఆ..మెట్టెల సవ్వడీ..

భర్త : మెట్టెల సవ్వడి సరే..కాఫీ ఇయ్యమ్మా!

భార్య : మెట్టెల సవ్వడీ .ఓ.. మెట్టెల సవ్వడి…మెడలో మాంగల్యం.. మదిలో అలజడులు..

భర్త : కాఫీ సరే…పోనీ కనీసం భోజనమైనా పెట్టేదుందా? అదీ లేదా?

భార్య:(పాట) ఎండమావులే నీ గుండెలోని ఆశలూ..

భర్త : బోజనం తల్లీ ఎండమావులంటావేం?

భార్య:(పాట కంటిన్యూ చేస్తూ) ఎండమావులే..నీ మనసులోని ఆశలు…

భర్త: ఆశ కాదమ్మా.. ఆకలి బాధ..క్షుద్బాధ..

భార్య : ఎందుకో నాకు ఈ ఆశలు…ఎందుకో నాకు ఈ ఆశలు..

భర్త : ఆకలి..ఆకలి..

భార్య: వంటవ్వలేదండి..

భర్త : ఇంకా వంటవ్వలేదా? నాకు తొమ్మిదిన్నరకే అలవాటు ? అప్పుడే పన్నెండున్నరైపోయింది .. ఇంకా వంటవ్వలేదా?

భార్య:(పాట)  మనసంటే మమతల నిలయం మమతంటే తీరని బంధం..

భర్త : ఎప్పుడు చేస్తావ్? ఎప్పుడు వండుతావ్? ఎప్పుడు పెడతావ్? అబ్బెబ్బే!! దిమ్మెత్తిపోతుంది..

భార్య:  ఏవండి! ఐదు నిమిషాల్లో వండి అక్కడ పడేస్తాను. ఏం వండమంటారు చెప్పండి?

భర్త : ఏవిటి? ఇప్పుడు అడుగుతున్నావా? (వ్యంగ్యంగా) ఏం వం డ మం టా రూ అంటూ.. ఎప్పటికి పెడతావ్??

భార్య:చెప్పండి .. ఆనపకాయా? అరటికాయా? ఏం వండమంటారు?

భర్త (కోపంతో) నాకు  .చిర్రెత్తిపోతోంది  తలకాయ వండు….

భార్య: ఆవేసి చేయనా? వేయించనా??

భర్త: ఆ..ఆ…

 

*******************************

 

5 thoughts on “గిన్నీస్ రికార్డ్

  1. ఎన్నెలగారు,, జీ కామెడిలో రెండు ఎపిసోడ్స్ గా వచ్చాయి.. ఆ తర్వాత వారి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాము.

  2. ఇది జీ తెలుగులో వచ్చిందా..చాలా బాగుంది .అభినందనలండీ…

  3. ఓ ప్రక్క ఆవెట్టనా అంటూంటే…కాలూ చెయ్యీ ఆడదు కదా గురువుగారు…అవాక్కయిపోయా..ఇంకప్పుడు ఆవెట్టిందా–
    లేక ఉడకపెట్టిందా అన్నది ఏంతెలుస్తుంది స్వామీ….
    మీ అభిమానానికి కృతఙ్ఞతలు..

  4. మీ ఇద్దరి పెర్ఫార్మెంస్ చాలా బాగుంది మాష్టారు. ఇంతకీ మీ ఆవిడ గారు గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టారా? ఆ వేళ ఆవ పెట్టారా లేక వేయించేశారా? తెలియపర్చలేదు.

    Zee తెలుగు TV లో మీ ప్రదర్శనకు మీ ఇరువురికీ నా హృదయ పూర్వక అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *