May 19, 2024

రాధామాధవ దివ్యదీపావళి

రచన : తన్నీరు శశి   మెల్లగా పారుతున్న యమునమ్మ చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం… పున్నమి వెళ్లి కొన్ని రోజులే అయినా చంద్రుని మోము చిన్న పుచ్చుకొని జాలిగా చూస్తున్నాడు… ఎవరి చైతన్య స్ఫర్శో కావాలని గాలి మారం చేస్తూ ఆకుల చెవిలో గుస గుసలు … అంతట అలుముకొన్న స్తబ్దత లో… హు…అని మెల్లగా  నిట్టూర్చింది  పొన్నచెట్టు కింద ఆనుకొని  కూచున్నరాధ. నిట్టూర్పు వేడి సెగకి చుట్టూ  రాధ గుండె రగులుతూ… “రాడేమి ఈ నల్లనయ్య …ఝాము గడిచిపోతున్నా  […]

నిత్యజీవితంలో హాస్యసంఘటనలు

  రచన : మల్లాది వెంకట కృష్ణమూర్తి   ఈ సంఘటన నా  చిన్నప్పుడు 1950లో విజయవాడలో గాంధీనగర్‌లోని మా ఇంట్లో జరిగింది. మా నాన్న దక్షిణామూర్తిగారికి కోపం వస్తే అందరిలా తిడతారు. మరీ ఎక్కువ కోపం వస్తే ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉండేది. ఓసారి జమీందార్ సి.వి.రెడ్డిగారు గవర్నర్ పేటలోని వారింటి నించి తమ గుర్రపు బగ్గీలో మా ఇంటికి వచ్చారు. (ఎస్సారార్ ఆండ్ సివీఅర్ కాలేజీని, స్కూల్‌ని స్థాపించిన ధార్మికుడాయన). మా నాన్నగారు, రెడ్డిగారు […]

హిమగిరి తనయే హేమలతే

రచన: డా.తాడేపల్లి పతంజలి పల్లవి హిమగిరి తనయే  హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే మామవ   అనుపల్లవి రమా వాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరీ చరణం పాశాంకుశేషు దండ కరే అంబ పరాత్పరే నిజభక్త పరే ఆశాంబరే హరి కేశ విలాసే ఆనంద రూపే అమృత ప్రతాపే పదార్థం హిమగిరి తనయే                    =        హిమవంతుని పుత్రికవైన తల్లీ! హేమలతే                                      =        బంగారపు తీగెవంటి ఆకృతికలదానా! అంబ                                          =        ఓ జననీ! ఈశ్వరి                               =        […]

వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?

  రచన : లలిత.జి.   “సాయంత్రం పూట పిల్లలు ఆడుకుంటున్నారు. అందరిలోకీ పెద్ద పిల్ల అందరికంటే చిన్న అమ్మాయి కళ్ళు మూసి ఆమె చేతికి ఒక బెత్తం ఇచ్చి చుట్టూ ఉన్న వారిని ఒక్కొక్కరినే చూపిస్తూ, “వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమి?” అని అడుగుతోంది. ఆ అమ్మాయి పేర్లు సరిగ్గా చెప్పలేకపోతోంది. వాళ్ళు పారిపోయి దాక్కుంటున్నారు.  అందరూ వెళ్ళి దాక్కున్నాక కళ్ళు మూసిన అమ్మాయి “దాగుడు మూతా, దండా కోర్, పిల్లీ వచ్చే […]

మనుచరిత్ర కావ్యారంభ పద్యము

రచన : లంకా గిరిధర్   ఈ లఘువ్యాసము పండితజనరంజకము కానేరదు. తెలుగు కావ్యపఠన ప్రారంభించి అవగాహన జ్ఞానసముపార్జనలో తొలిమెట్టు మెట్టి  ప్రాచీనకృతులలో మాధుర్యాన్ని చవిచూడడం నేర్వబూనిన విద్యార్థి కలమునుండి  అట్టి జ్ఞానార్థులకోసం వెలువడిన వ్యాసముగానే పరిగణించ వలెనని ప్రార్థన. అందుకు మనుచరిత్రలోని కావ్యారంభ పద్యమును ఎన్నుకోవడంలో వింతలేదు. మన ప్రాచీన కవులు కావ్యాది పద్యాలను శుభసూచకములుగా ఆగామివస్తుసూచకములుగా వ్రాసేవారు. అంటే కృతినిర్మించిన వారికి కృతిని స్వీకరించిన వారికి శుభము కలిగేవిధంగా శాస్త్రసమ్మతమైన పంథాలో మొదటి పద్యము […]

నేను

రచన : లీల  మంత్రి నేను “అ౦ద౦గా” లేనని తెలుసు నా “అక్షరాలు” “ఆణిముత్యాల్లా” అ౦దమైనవి కావని యి౦కా బాగా తెలుసు- అయినా నా “భావాలు” మాత్ర౦ “అ౦ద౦”గా ఉ౦టాయని నేన౦దరిలో చెప్పగలను.- నేను “కోయిల”లా పాడలేనని తెలుసు- కాని ఇ౦కా “కాకి” లా అరవనని కూడ తెలుసు- అ౦దుకే పదిమ౦దిలో “గొ౦తెత్తి కమ్మగా” పాడగలనని నే”న౦దరిలో” చెప్పగలను జన్మలన్నిటిలో ఈ “మానవ జన్మ” ఎ౦తో “ఉత్కృష్త” మైనదని తెలుసు- అ౦దుకే “మనీషిగ” జీవి౦చలేకపోయినా ఒక “మ౦చి […]

తెలుగు వెలుగులు

రచన : ఉమా పోచంపల్లి   ప్రభ౦జన౦ ఇది వినపడలేదా? ముడుచుకుని కూర్చు౦టే ము౦చేస్తు౦ది దావానలమిది కానగలేవా? అజ్ఞానాన్ని దహిస్తు౦ది బడబానిలమిది కనపడలేదా? ఓనమాలు నేర్చుకో ఒడ్డెక్కుతావు అ౦తర్జాల౦ అ౦తా జల్లి౦చి, అట్టడుగున ఉన్న ఆణిముత్యాలను అ౦దరికీ ప౦చే తెలుగు వెలుగు అదే చూడు చీకట్లు భీతిల్లే వెల్లువ వస్తున్నది పల్లె పల్లెకీ వాడవాడకీ ఎవడురా వాడు తేటతెలుగునే గతి౦చి౦దనుకున్నాడూ? గతమె౦తొ ఘనకీర్తి గల వాడు రానున్న వెలుగులకు నెలవు వీడు జై జై జై కొట్టరా! […]

డాక్టర్ ధన్వంతరి – పేషెంట్ రోగేశ్వర్రావు

రచన: అప్పారావు, ఖాదర్ ఖాన్ (సురేఖాన్)   పాత్రలు: డాక్టరు, పేషేంట్   ముక్కుతూ మూలుగుతూ రోగేశ్వర్రావు డా. ధన్వంతరి హాస్పిటల్లోకి ప్రవేశిస్తాడు. ధన్వంతరి : రావయ్యా! రోగేశ్వర్రావు! బాగున్నావా!! రోగేశ్వర్రావు: హు! బాగుంటే  మీ దగ్గరకెందుకు వస్తానండి! వళ్ళంతా భరించలేని నొప్పులు. ఈ చూపుడూ వేలుతో తలమీద, చేతిమీద, కాలిమీద, పొట్టమీద, నడుం మీద ఎక్కడ నొక్కినా భరించలేణి నొప్పి, ఇంతకన్నా చావే నయమనిపిస్తున్నది. ధన్వంతరి : నా దగ్గర కొచ్చారుగా అ అవిషయం నాకొదిలేయండి. […]

కల్పవృక్షంలో కైక – Gospel Of Judas

రచన : భైరవభట్ల కామేశ్వరరావు కల్పవృక్షంలో కైక సరే, ఆ Gospel of Judas ఏమిటి? దానికీ దీనికీ సంబంధం ఏమిటి? అని తికమక పడుతున్నారా? సంతోషం. అందుకేగా ఆ శీర్షిక పెట్టింది 🙂  ముందుగా రామాయణ కల్పవృక్షంలో కైక పాత్ర గురించి చెప్పుకొని, తర్వాత ఆ Gospel of Judas గోలేమిటో చూద్దాం. రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష […]

ఇలా చేస్తే బాగుంటుంది

రచన : నూర్ భాషా రహంతుల్లా తెలుగుభాష అమలు గురించి పత్రికలకు నేను రాయడం మొదలుపెట్టి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమంది సూచనలు చేస్తున్నారు. అయితే ఎవరెవరు ఏమేం చేశారో, ఎలా చేసి సఫలీకృతులయ్యారో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని అనిపించి, భాష అమలుకోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించీ నా అనుభవాలు రాస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను. ఆనాటి […]