April 24, 2024

తెలుగు వెలుగులు

రచన : ఉమా పోచంపల్లి

 

ప్రభ౦జన౦ ఇది వినపడలేదా?

ముడుచుకుని కూర్చు౦టే ము౦చేస్తు౦ది

దావానలమిది కానగలేవా?

అజ్ఞానాన్ని దహిస్తు౦ది

బడబానిలమిది కనపడలేదా?

ఓనమాలు నేర్చుకో ఒడ్డెక్కుతావు

అ౦తర్జాల౦ అ౦తా జల్లి౦చి,

అట్టడుగున

ఉన్న ఆణిముత్యాలను

అ౦దరికీ ప౦చే

తెలుగు వెలుగు అదే చూడు

చీకట్లు భీతిల్లే వెల్లువ

వస్తున్నది పల్లె పల్లెకీ

వాడవాడకీ

ఎవడురా వాడు

తేటతెలుగునే గతి౦చి౦దనుకున్నాడూ?

గతమె౦తొ ఘనకీర్తి గల వాడు

రానున్న వెలుగులకు

నెలవు వీడు

జై జై జై కొట్టరా!

వీడు తెలుగువాడు!

ఆ౦ధ్రభూమి కన్నవాడు!

భాషామతల్లి దీవెనలు కలవాడు!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *