May 19, 2024

భక్తులను భద్రంగాకాచే భద్రకాళి అమ్మవారు

  భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది.  అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో,   ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు.  అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట.  పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట.  అలాగే  చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ […]

రామో విగ్రహవాన్ ధర్మః

రచన : యఱ్ఱగుంట సుబ్బారావు శ్రవ్యకం : డా.కౌటిల్య   ||శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః|| ఉపక్రమము ధర్మం సర్వమానవులకూ సుఖాన్నే కలిగిస్తుంది. ఎవని ధర్మాచరణము అతనియందెట్టి అలజడిని కలిగింపక, పశ్చాత్తాపానికి గుఱిచేయక మనస్సును శాంతంగా ఉంచుతుందో, అప్పుడది అతనికి ఆత్మతుష్టిని కలిగించినట్లవుతుంది. అలాంటి తుష్టి కలిగి ఉండటమే సుఖముఆ సుఖము -“సర్వభూతములు నా వంటివే” – అనే తలపువల్ల వస్తుంది. అట్టి తలపే ధర్మము. ఆ ధర్మాచరణము సర్వులకూ సుఖదాయకమవుతుంది. కాని ప్రతిజీవికి తనయందు అనురాగముంటుంది. […]

అవసరాల రామకృష్ణారావు రచన-జీవితం-వ్యక్తిత్వం

రచన : కె. రాజశేఖర రాజు   15 సంవత్సరాల వయసులో చందమామ కథతో మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో చందమామ కథతోనే జీవితం ముగించిన తెలుగు విశిష్ట కథా రచయిత అవసరాల రామకృష్ణారావు గారు. బాల్యంలో అమ్మ చెప్పిన కథనే ఊకొట్టే భాషలోకి మార్చి ఆయన పంపిన ‘పొట్టిపిచిక కథ’ తొలి చందమామ పత్రికలో -1947 జూలై- యధాతథంగా అచ్చయి ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసింది. దాదాపు అరవైనాలుగు సంవత్సరాల తర్వాత ఈ […]

కవిబ్రహ్మ గుఱ్ఱం జాషువా

రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి.. నవయుగ కవితా చక్రవర్తి గుఱ్ఱం జాషువా తెలుగు సాహిత్యరంగంలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకున్న కవి.  తెలుగు పద్యం బలహీనపడుతున్న దశలో పద్యానికి జవజీవాలు అందించినవాడు జాషువా.  పద్యానికి పదునుపెట్టి సామాజిక ప్రయోజనం కోసం కవిత్వం రాశారాయన.  జాషువా కవిత్వం మీద ఇరవయ్యో శతాబ్దపు ఉద్యమాలు, రాజకీయ, సాంఘీక, ఆర్ధిక, సామాజిక స్థితిగతులు ప్రభావం చూపాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.   గుంటూరు జిల్లా వినుకొండలో మిస్సమ్మతోటలో 1895 సెప్టెంబర్ […]

ఆమె – సార్ధకత

చిత్రాలు, రచన: జ్యోతిర్మయి మళ్ల   పెళ్లిచూపుల్లో అందరిముందూ నీ సమ్మతి తెలిపాక, వెళుతూ వెళుతూ ‘ఇక మన మనసులు రెండు కావు ఒకటే’ అనేలా తన మెరిసే  కళ్లల్లోకి  నువు మురిపెంగా చూసినపుడు …ఆమె మురిసిపోయింది మంగళ వాద్యాల మధ్య ఆమె మెడలో మూడు ముళ్లు వేశాక మనసా వాచా కర్మణా ‘ఇక మన జీవితాలు రెండు కావు ఒకటే’ అనేలా తన సంశయ నయనాల్లోకి నువు నమ్మకంగా చూసినపుడు …ఆమె తృప్తిపడింది ముత్తైదువుల కిలకిలనవ్వుల […]