April 24, 2024

శ్రావణ పౌర్ణమి మాలికా పదచంద్రిక పోటీ ఫలితాలు

మాలిక శ్రావణ పౌర్ణమి సంచికలో ప్రచురించబడిన పదచంద్రిక – 3 ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి వెయ్యి రూపాయల నగదు బహుమతి ప్రకటించడమైనది. కంది శంకరయ్యగారు, ఎన్నెల గారు, భమిడిపాటి ఫణిబాబుగారు ఒక్క తప్పుతో పూరించారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు రెండు తప్పులతో పూరించారు. చివరి రోజు పంపిన మాచర్ల హనుమంత్ రావుగారు ఐదుకంటే ఎక్కువ తప్పులు చేసారు. తప్పులు అస్సలు లేకుండా పూరించివారు.. నేస్తం.. ఈ సంచికలో ప్రకటించిన మరో పోటీ.. […]

మనుచరిత్ర కావ్యారంభ పద్యము

రచన: లంకా గిరిధర్ ఈ లఘువ్యాసము పండితజనరంజకము కానేరదు. తెలుగు కావ్యపఠన ప్రారంభించి అవగాహన జ్ఞానసముపార్జనలో తొలిమెట్టు మెట్టి ప్రాచీనకృతులలో మాధుర్యాన్ని చవిచూడడం నేర్వబూనిన విద్యార్థి కలమునుండి అట్టి జ్ఞానార్థులకోసం వెలువడిన వ్యాసముగానే పరిగణించ వలెనని ప్రార్థన. అందుకు మనుచరిత్రలోని కావ్యారంభ పద్యమును ఎన్నుకోవడంలో వింతలేదు. మన ప్రాచీన కవులు కావ్యాది పద్యాలను శుభసూచకములుగా ఆగామివస్తుసూచకములుగా వ్రాసేవారు. అంటే కృతినిర్మించిన వారికి కృతిని స్వీకరించిన వారికి శుభము కలిగేవిధంగా శాస్త్రసమ్మతమైన పంథాలో మొదటి పద్యము రచించబడేది. మున్ముందు […]

సంపాదకీయం: బంధాలు అనుబంధాలు

(ఈసారి సంపాదకీయాన్ని మనకందిస్తున్నది జ్యోతి వలబోజు)  భార్య.. భర్త తల్లితండ్రులు.. పిల్లలు కొడుకులు.. కోడళ్లు కూతుళ్లు… అల్లుళ్లూ అత్తలు.. మామలు పిన్ని.. బాబాయ్ ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు… అందరి మధ్య రక్తసంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. కాని ఇది ఒకప్పటి మాట అని అందరూ ఒప్పుకునే చేదు నిజం. ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో […]