June 14, 2024

సహస్ర స్క్వైర్ అవధానం …..

రచన : శశి తన్నీరు

 

ట్రింగ్…ట్రింగ్…మంటూ మోగే అలారం నెత్తిన ఒక్కటిచ్చాను. దెబ్బకి నెత్తిన బుడిపను తడుముకుంటూ నోరు మూసుకుంది.

సరే ముందు కొంచం సేపు ధ్యానం చేద్దాం అని శ్వాస గమనిస్తూ ఉన్నాను……”ఇడ్లీ కి చట్ని వేయకపోతే కరెంటు పోతుందేమో”……ఐదున్నరేగా ….ఆరుకి కదా కరెంటు పోయేది.

“పప్పులోకి టొమాటోలు ఉన్నాయా?”….ఒకటుందిలే…..శ్వాస మీద  ధ్యాస….పెట్టు….

“పాప తొందరగా లేపమంది…. లేచేటప్పటికి పాలు ఇస్తే తాగుతుంది”…ఇక లాభం లేదు..పద వంటిట్లోకి……

ముందు బ్రష్  చేసుకొని మొహం కడుక్కున్నాను.

కొంచం పేపర్ చూద్దాం. ఎప్పుడు పనేనా….అయ్యా బాబోయ్…

ఈ రోజు శనివారమ్…కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఇప్పుడు కాదు ముందు చట్నీ వేయాలి….ఆ పని ముందు కానిచ్చి ….పొయ్యి పై పాలు పెట్టి ….ఈయన లేచినట్లున్నారు…..బయటి తలుపు తీసి పాలు , పేపర్ లోపలికి తెచ్చారు….”ఆ పేపర్ వాడికి చెప్పు.. నీళ్ళల్లో వేస్తున్నాడు పేపర్” అన్నారు.

సరే …పాలు తీసుకొని లోపలి వెళ్లి పొయ్యి మీదుంచాను.

ఆరుంపావు….ముందు పాపని లేపాలి…కుక్కర్  రెడీ చెయ్యాలి, ఇడ్లి పెట్టాలి, చట్నీ తాలింపు వేయాలి….వేన్నీళ్ళు పెట్టాలి…..కెవ్వ్……

“రేయ్ ఇద్దరు లేవండి….టైం..టైం….అయిపోతుంది”

(మాంటిసోరి, గిజుబాయి వాళ్ళను  కలల లోకం నుండి లాగుతున్నారు)

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఇప్పుడు ఇంకేం చెయ్యాలి…..పాలలో తాలింపు వేసి, కుక్కర్ లో హీటర్  వేసి ఇడ్లీ లో టీ పొయ్యాలి…..

కెవ్వ్….కాదు కాదు….గబా గబా…ఇడ్లీ పెట్టి , తాలింపు వేసాను….పిల్లలకు . ఈయనికి బూస్ట్ ఇచ్చిగబా గబా కుక్కర్  రెడీ చేసాను. హయ్యో బయట తుడిచి ముగ్గు పెట్టాలి……సరేలే…..అరచేయ్యంత ముగ్గు…అదైన వెయ్యోద్దా?

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఈ లోపల కేక….”నీ అరియర్స్ సంగతి స్కూల్ లో కనుక్కో”

సరే…..బాబోయ్…ఏడు….కల్లాపి లో కుక్కర్ పెట్టి, ఇడ్లీ లో అరియర్స్  వేసి స్నానానికి  వెళ్ళాలి.ముందు ఈ రాక్షసులు వెళ్ళారో లేదో…..రేయ్ నాకు అడ్డం రాబాకండి….ప్లీజ్….

“మా నా క్యారియర్ కూడా పెట్టేయ్యి”పాప ఆర్డర్….

మెల్లిగా టైం వంక చూసాను….ఏడు నలబై ఐదు…..చచ్చాన్రా దేవుడా…..రేయ్…రాక్షసుడా….(పిల్లల సైకాలజిస్టుల్లారా!) కాసేపు కళ్ళు మూసుకోండి…..కాదు…చెవులు…కాదు ఏదో ఒకటి….)

నా వేన్నీళ్ళు నువ్వు తీసుకెళ్ళవాకు……

హు…వెళ్లి పోయాడు…బాబోయ్ కుక్కర్ విజిల్స్…ఆపేసి….ఇడ్లీ కూడా….మాడితే….గోవింద….ర.రేయ్ నువ్వు తొందరగా రారా బాబు….

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

చెట్నిలో కారం వేసి, పాలు గిన్నెలో  పోసి తాలింపు వేసి, కుక్కర్ దించి ఉప్పు వేసి పేపర్ బాయ్ కి చెప్పాలి….

హమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి…..

క్యారియర్ని పోపు  పెట్టి, పర్సుని నీళ్ళ బాటిల్ లో వేసి ఇడ్లీని అరియర్స్ లో వేసి పేపర్ బాయ్ కి ఇచ్చి తాళం పక్కింటి ఆమెకి ఇచ్చి …స్కూటీ ఎక్కేసాను…..

ఇంక పది నిమిషాలు…..నో ఆలోచంస్….మేఘాలలో….

స్కూల్ గేటు లో కి వెళుతూ….మళ్ళీ మొదలు….పదికి త్రికోణమితి , తొమ్మిదికి వర్గ మూలాలు, ఎనిమిదికి గ్రాఫ్ లు

చెప్పాలి….అసెంబ్లీ…..జనగణమన…..

“మేడం””ఏమిటి”

“పదో తరగతి నామినల్ రోలేస్ చూడాలి….పుట్టినరోజులు, పుట్టుమచ్చలు చూడాలి”సూపరిండెంట్ గారి రెక్యెస్ట్……

సరె పదో తరగతికి వెళ్లి ….త్రికోణమితి లొ విమానం పైన  తిరిగి వర్గమూలాల్లో తేలి పుట్టు మచ్చలతో గ్రాఫ్ లకు వచ్చాను.

మళ్ళా పిలుపు …..ప్రిన్సిపల్ మేడం పిలుపు……..

హు…ఇక అయినట్లే….సరే అమ్మాయిలు …మీరు రెండు గ్రూప్లు …..ఒకరు బిందువు చెప్పాలి….ఇంకోరు అది బోర్డ్

మీద గుర్తించాలి……సరిగా గుర్తిస్తే పాయింట్స్…..స్పాంటెనియస్  క్రియేటివిటితో  చెప్పేసాను…..

కౌసల్యా సుప్రజా రామా…పూర్వా ….

“యేమిటి మేడం”

“కొత్త డి.యే. విషయం కనుక్కో….ఇంకా స్లొ లర్నర్స్ రికార్డ్ వ్రాయండి”

“సరే”…..గ్రాఫ్ లో డి.యే. పెట్టి పుట్టుమచ్చలు వెసి….రికార్డ్ వ్రాయాలి.”మేడం….కొంచం నా మొబైల్ రీచార్జ్ చేయించరా?”  పక్క మేడం రిక్వెస్ట్.

“సరే”……..

“యేమండీ”

“చెప్పబ్బా….యెందుకు ఫోన్ చేసావు?”

“మరేమొ యేమిటొ డి.యే.పర్టికులర్స్ కావాలంట….

“ఇందుకా ఫొన్ చేసావు?”

“ఇంకో మెడమ్ కి రీచార్జ్ చెయ్యాలి”

“నీకేమి వద్దా?”

“కావాలి….ఉల్లిపాయలు,మిర్చి”

“నీ యెన్కమ్మ….సర్లే ఫొన్  పెట్టు….లోకం తెలీని దాన్ని లీడర్ గా పెట్టుకున్న వాళ్ళను అనాలి”….పెట్టేసారు.

లోకంలోకి పంపితే జ్ఞానం వస్తుంది…..జ్ఞానం వస్తే గాని పంపరు…..తాగితే మరువగలను…తాగలేను….

అవును తాగితే లొకజ్ఞానం వస్తుందా?

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్…….తాగటం యేమిటి?

క్షమస్తత్వం …..క్షమస్తత్వం …..శేష శైల శిఖామణే…..

బెల్ మోగింది. గుర్తు పెట్టుకొన్నాను…..లంచ్ బెల్….

అందరం గుండ్రంగా కూర్చున్నాము…కూరల వాసనకు కబుర్ల గుబాళింపు……మమత పెళ్ళికి ఎవరు వెళతారు?

మాధురి వాళ్ళ అబ్బాయికి చాలా పెద్ద ఆపరేషన్ …..చెన్నైలో ఉన్నాడు…..మజ్జిగ  చారు తాలింపు వేడి మీద వెయ్య కూడదు….

“మేడం” ఇహం లోకి వచ్చి చూసాను….”మేము ఏమి చెప్పామో  చెప్పండి”

పరీక్ష…….

ఏముంది మమతకు తాలింపు వేసి చెన్నై కి పంపాలి….

నయాగరా జలపాతాన్ని మించిన నవ్వుల జలపాతం …

“మేడం …ఈ లోకం లోనే లేదు”…. కొట్టేస్తారా ఏమిటి?

ఆయనే నయం …..లోకం తెలీదు అన్నారు….వీళ్ళు ఈ లోకంలోనే లేనంటున్నారే…….హర్షాల మధ్య ఆప్యాయతల వర్షం…..గుత్తి వంకాయ వేసుకోండి…వడియాలు….మజ్జిగ చారు…

“నా పప్పు సంగతి”…

“మేము వేసుకుంటాములే ”

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఎప్పటికి పూర్తయ్యేను సుప్రభాతం….

మళ్ళీ బెల్..

క్లాస్సులలోకి పొమ్మని…..హమ్మయ్యా కాలాన్ని నెట్టేసాను….లాంగ్ బెల్……

పుట్టుమచ్చల్ని మజ్జిగ చారులో వేసి… మమతని గ్రాఫ్ లో ఉంచి, పిల్లల్ని ప్రిన్సిపాల్ కి ఇచ్చి

ప్రిన్సిపాల్ని సూపరింటెండెంట్ కి ఇచ్చి బయట పడిపోయాను…

హమ్మయ్య….ఇంక స్కూటీ మీద పది నిమిషాలు మనవే…..

అరే!  మల్లె పూలు….ఇప్పుడా? …కొందాము….మళ్ళా ఈయన కూడా తెస్తే…..ఆ పెద్ద అంతర్జాతీయ సమస్య…..రేపు కూడా  పెట్టుకుంటే  పోయే….

హమ్మయ్య అందరు అన్నం తినేసారు….రేపటికి బియ్యం  ఏరాలి…..హబ్బో మా హోంజాకి పాటలు పెట్టేసారు….

“వెన్నలవే…..వెన్నెలవే …నువ్వే సాగి వస్తావా?”

సరే…సరే….బాబుకు వేన్నీళ్ళు తాగిస్తే బాగుండు…..పెడదాము….

“రావోయి చందమామ…..తన మతమేదో తనది…..పర మతం అసలే పడదోయి….మనది మనదను మాటే…

ఎవరి ఎదుట లేదోయ్”

సరే….సరే…..దోసె పిండిలో ఉప్పు కలిపానా…….

“మంటలు రేపే నెలరాజా….ఈ తుంటరితనము నీకెలా?…

ఈ శీలా పై రాలిన పలమేమి”

కెవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్   …..సన్యాసులలో కలిసిపోతారా?

ఏమిటి?వచ్చే….వచ్చే….

వేన్నీళ్లలో రాళ్ళు వేసి…..కుక్కర్ లో దోస పిండి కలిపి…చట్నీ కి….పప్పు నానేసి…..టీ కోసం అన్నం పెట్టి…..

ఇదుగో వచ్చే…వచ్చే…..నాన్ స్టాప్ ….అవధానం…..

 

మంగళాశాసన పరై మధాచార్య పురోగమై…….

 

18 thoughts on “సహస్ర స్క్వైర్ అవధానం …..

 1. పప్పులో టమాటా కూర వెయ్యడానికి ఇంత కన్ఫుజనా.
  కౌసల్యా సుప్రజా మీకు పూర్తిగా వచ్చునా అని డౌట్?
  >>> అవును తాగితే లొకజ్ఞానం వస్తుందా?
  మీకు లోక జ్నానము వచ్చినట్టే ఉంది. … దహా
  మీ సహస్రావధానం బాగుంది.

 2. ?వేయినోక్క ప్రశ్నల ఎత్తు ఈ ప్రశ్న .సమాధానం చెప్పక పోయారో!? వేయినొక్క చిప్స్ పెడతాను బుర్రలో.. ఆలోచనలని కాపీ కొట్టడానికి.
  పెట్టండి…..యెంచక్కా,,,,,,,తినిపెడతాను

 3. శశికళ గారు “కౌసల్య సుప్రజ రామా “మొదలు పెట్టి “మంగళాశాసన పరై మధాచార్య పురోగమై” తో ముగించారు..చాలా బాగుందండి..”సహస్ర స్క్వైర్ ” కన్నా infinite అవధానం అంటే బాగుంటుందేమో..:))

 4. చాలా బాగుంది. ఇంత కన్ఫ్యూజన్ తో..సంసారం ఎలా నడుస్తుందబ్బా..!/ ప్రయాణంలో..ఎందుకు కన్ప్యూజ్ అవరు?వేయినోక్క ప్రశ్నల ఎత్తు ఈ ప్రశ్న .సమాధానం చెప్పక పోయారో!? వేయినొక్క చిప్స్ పెడతాను బుర్రలో.. ఆలోచనలని కాపీ కొట్టడానికి.

 5. శశి గారూ.. మీ సహస్ర…..
  కౌసల్యా సుప్రజా రామ..
  అదేనండీ మీ స్క్వేర్ ఇడ్లీ ఎలా ఉందంటే..
  పూర్వ సంధ్యా ప్రవర్తతే….
  అవధానం చట్నీలో కారం మహా ఘాటుగా ఉందండీ.. 😀 😀

 6. బావుంది శశి గారు
  కెవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్ …..సన్యాసులలో కలిసిపోతారా?
  :)))

 7. వామ్మో… మీరొక్క పనీ సరిగ్గా చెయ్యరా?
  కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్ శశిగారూ.. మీ సహస్రా స్క్వేర్ అవధానం..;)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *