June 19, 2024

ఉగాది పచ్చడి – ఇది షడ్రసోపేతం

రచన: పాకవేదం (డా.కౌటిల్య)   కొత్త ఏడాది వచ్చేసింది. కొత్తసంచికతో మేమూ మీముందుకొచ్చేశాం. మావాళ్ళు ఇది “సాహిత్యసంచిక” అన్నారుకదా అని వట్టి పద్యాలూ, పురాణాలూ చదువుకుంటామా ఏంటి? నోరూరగా చవులు పుట్టే పదార్థాలు లేకపోతే అది పూర్తిసాహిత్యం కాదని నా అభిప్రాయం. అందుకని మా “పాకవేదం” తరపునుంచి ఇవ్వాళ మీకు షడ్రసాలనీ ఒకటిగా చేసి నాలుకకు చూపించే తెలుగింటి “ఉగాది పచ్చడి”ని రుచ్చూపించబోతున్నాం.   చిన్నప్పుడు ఉగాదంటే నాకు ఎంత ఉత్సాహమో చెప్పలేను. పిల్లలందరికీ ఇది ఒక […]

సంపెంగలూ సన్నజాజులూ — నవలా సమీక్ష

రచయిత: అవసరాల రామకృష్ణారావు సమీక్షకులు: మంగు శివరామప్రసాద్ 1960-70 దశకంలో వెలువడిన అవసరాల రామకృష్ణారావు గారి నవలలు ఆనాటి సామాజిక సమస్యలను వివిధ కోణాలనుంచి పరిశీలిస్తూ సమకాలీన సాంఘిక చైతన్యాన్ని ప్రతిఫలింపచే్స్తూ, పాఠకులను ఆకర్షించాయి. వీరి సహజ హాస్య వ్యంగ్యశైలి, మధ్యతరగతి కుటుంబాల్లోని వాస్తవిక అంశాలను వస్తువుగా గ్రహించి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సవాళ్లకు సరైన పరిష్కార మార్గాలను సూచిస్తూ, తెలుగుదేశం ఉట్టిపడే విధంగా సరళంగా, స్వాభావికంగా, సంసారపక్షంగా చెప్పేవిధానం ఆయనకు పాఠకుల హృదయపీఠంలో ఒక ప్రత్యేక […]

వందనం అభి “నందనా”

మాలిక పత్రిక ఉగాది సంచిక కోసం ప్రముఖ చిత్రకారుడు శంకు వేసిన చిత్రం   వంధనం.. అభివందనం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం…..   “చైత్ర శుద్ధ పాడ్యమి” తెలుగువారందరికి అతి ముఖ్యమైన రోజు…  సృష్టి పుట్టినరోజు, పరమాత్మ ఈ విశ్వాన్ని సృజించిన రోజు.   ఆకులు రాల్చిన చెట్లన్ని ఫలపుష్పాలతో కనులవిందు చేస్తుండగా, కోయిలల కుహుకుహూ రాగాలతోడుగా  ప్రకృతి పరవశం కలిగిస్తుండగా, మామిడిపళ్ల మధుర రుచులతో,  మల్లె,జాజి, చామంతుల పరిమళాలతో,  మామిడి  తోరణాల ఆహ్వానంతో వసంతరాణి […]

వేణీ సంహారం – ఒక పరిచయం

రచన : రవి ENV..     ఉపోద్ఘాతము   “నాటకాంతే సాహిత్యం” – అని లక్షణకారుడి తీర్పు. హితమును కూర్చేది సాహిత్యమయితే, సాహిత్యానికి చివరి ప్రస్థానం దృశ్యకావ్యాలు. వేదాలు ప్రభుసమ్మితాలు, పురాణాలు ప్రియసమ్మితాలు కాగా కావ్యాలు కాంతాసమ్మితాలు. అంటే – వేదాలు సమాజ జీవన నియమాలను ప్రభువు వలే శాసించి చెబితే, పురాణాలు అనునయంగానూ, కావ్యాలు ప్రేమగానూ చెబుతాయి. కావ్యాలలో దృశ్యకావ్యాల స్థానం అనుపమానం. చాతుర్వర్ణ్య వ్యవస్థలో వేదాధ్యయనాధికారం అన్ని వర్ణాల వారికీ లేదని, అందుకు […]

‘మానసపుత్రి’ …. (శ్రీ శారదాంబ ప్రియ పుత్రిక కథనం)

రచన: కోసూరి ఉమాభారతి   [బంగారు భవిష్యత్తుకై ఉన్నత విద్యల ఆశలతో, కలలతో విశాల ప్రపంచంలోకి అడుగిడుతున్న నేటి యువతకి, వారి కలలు సాకారమవ్వాలని ఆశీరభినందనలతో, శుభాకాంక్షలతో, ఈ ‘మానసపుత్రి’ కథానిక అంకితం. ‘మానసపుత్రి’ నృత్య రూపకంగా, అమెరికాలో విశ్వవిద్యాలయ విద్యార్ధుల గౌరవార్దం ప్రదర్శించ బడిన కథాంశం – కోసూరి ఉమాభారతి]       సకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ బ్రహ్మదేవుని కను సన్నలలో, శివుని ఆజ్ఞ మేరకు జీవనాన్ని సాగిస్తున్నాయి. బ్రహ్మదేవుని సృష్టి నిరంతరం కొనసాగుతూనే ఉంది. అంతటి  బృహత్తర కార్యంలో మానవ కోటి లోని ప్రతి జీవి యొక్క తలవ్రాత  వ్రాస్తూ, ఆ అనంత నిరవధిక ప్రక్రియలో మునిగి తేలుతున్న ఆ బ్రహ్మదేవునికి, ఆనంద రూపిణి, అర్ధాంగి ఐన సరస్వతీదేవి తన వంతు సహకార సహాయాలని […]

పూర్ణాత్మ – పుస్తక సమీక్ష

రచన : శశికళ.వాయుగుండ్ల. సాహిత్య లోకాలను స్పృశిస్తూ ఊహాలోకాల్లో తేలియాడే నేను ఈ మధ్య ”పూర్ణాత్మ”అనే పుస్తకం చదవటం జరిగింది.ఇది తప్పకుండా అందరు చదవాల్సిన పుస్తకమనిపించింది.అందుకే దీనిని పరిచయం చేస్తున్నాను. ఇది ”ఒరిన్”అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తచే చానలింగ్ చేయబడి ”సనయ” గారు వ్రాసినట్లు,రాధ గారు అనువాదం చేసినట్లుగా వ్రాసి ఉంది. నిజంగా ప్రతీ దానిని నెగటివ్ గా చూసే ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు ఇలాంటి పుస్తకం చదవాలి.తమ పూర్ణాత్మతో మమేకమై హృదయంతో చరించటం వలన జీవితం […]

“మోటు ” బావి

రచన : పసుపులేటి గీత కడుపులో బిడ్డలా నడుం మీద బిందె నడుమ్మీద బిందెలా కడుపులో బిడ్డ .. రెండింట్నీ మోసుకుంటూ ఎక్కడ తొణికిపోతాయో, ఎక్కడ బెణికిపోతుందో.. అడుగులో అడుగు ఈ దూరాభారమేంటో అడుగు ఈ దుర్భర భారమేంటో అడుగు పాదరసపు గట్లమీద పాల గుండెల ‘మోత’ ఎంతెంత దూరం, ఇంకా ఎంత దూరం..? పాదాల్ని నములుతున్న కాలిబాట మోటబావి మోటుసరసం పారాణి ఆరని తొలినాళ్లలో నాకు కాల్లో ముల్లు విరిగితే నా మొగుడికి కంట్లో ముల్లు […]

మాలికా పదచంద్రిక – 6 , రూ. 1000 బహుమతి – ఆఖరు తేదీ మే 20

అడ్డం: 1. ఈ ఉగాది పండక్కి వచ్చే కూతురు (3) 5. వేశ్య, దేవదాసి (3) 7. అసాధ్యము. కఠినము, ప్రౌఢ (3) 9. అధమమును స్ఫురింపజేసే ఆమని, వసంతము (4) 10. యిష్టం వచ్చిన రూపాన్ని ధరించే శక్తి కల దేవుడు/దేవత, యక్షుడు/యక్షిణి లేదా రాక్షసుడు/రాక్షసి(4) 11. పసుపురాచిన బియ్యము ఏకవచనంలో తిరగబడింది (3) 13. తమరివి కాని మామిడి చెట్టు (2) 15. ఇంద్రుని రాజధానిని గుంటూరు జిల్లాలో వెదకండి (5) 17. పై […]

మఱికొన్ని జ్ఞాపకాలు

రచన : డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి గురుం ప్రకాశయేత్ – అని పెద్దలన్నారు. మన గురువులు చెప్పిన పాఠాలను మనసుకు తెచ్చుకొన్నట్లే, వారి పేరును నోరారా పేర్కొనటంలో ఒక ఆనందం ఉన్నది. సమర్థులైన గురువులు విద్యాబోధ కావిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు వారి వచోగరిమ వల్ల ఆధికారికేతివృత్తాని కంటె ప్రాసంగికంలోనే మెఱుములు మెఱుస్తాయి. ఆ మాటలు ముత్యాల మూటలు. జీవితకాలం తమతమ రంగాలలో విశేషమైన కృషిచేసిన విద్వాంసులు, విజ్ఞానవేత్తలు, కవులు, రచయితలు అయితే మఱీనూ. వారితో ప్రసంగావకాశమే ఒక విద్యాసముపార్జనం. […]

సరస్వతీపుత్రుడు – రూ 500 బహుమతి!

  రచన : ??? చెప్పుకోండి చూద్దాం… ఈ రచనాశైలిని గుర్తుపట్టగలరా??   ఈ వ్యాసం రాసిన వ్యక్తిదే   ఈ సంచికలో మరో రచన ఉంది?? ఎవరో చెప్పుకోండి మరి.. రెంటినీ గుర్తుపట్టిన వారికి రూ 500 బహుమతి.. మీ సమాధానాలు పంపడానికి ఆఖరు తేదీ.. మే. 20..     ఒకదినము రాకుంటె – ఓరంత కన్నీళ్ళు కన్నీటిలో చూపు – కదలిపోయింది ఒకదినము రానంటె – ఓరంత దుఃఖమ్ము గద్గదికతో గుండె – కమిలిపోయింది ఒకదినము […]