October 16, 2021

శివధనుస్సు

రచన : రసజ్ఞ   సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?   రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే….. అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం ధనుహు, శరోహ్యాత్మ, […]

“అమ్మగారికీ దండంపెట్టూ..”

రచన : జి.ఎస్.లక్ష్మి “ఏంటే అక్కయ్యా… ఈ పెళ్ళి కైనా నువ్వు రాకపోతే ఇంక నీకు ఫోన్ చెయ్యనంతే..”   “అదికాదురా..” ఏదో చెప్పబోతున్న రేణుక మాటల్ని మధ్యలోనే ఆపేసి, “అసలు నువ్వే చెప్పవే.. ఎన్నాళ్ళైంది మనం కలిసి? పదేళ్ళు దాటటంలెదూ.. ఎప్పుడో పెద్దమావయ్యగారి పెద్దబావ పెళ్ళికి వచ్చేవ్. అంతే.. మళ్ళి మనం కలవందే. నా పెళ్ళిక్కూడా రాలేదు.  మా ఆవిణ్ణి చూడవూ?   “సరే.. చూస్తాలేరా..” అని ఫోన్ పెట్టేసింది రేణుక.   రేణుక వుండేది […]

గృహస్థాశ్రమ ధర్మములు.

రచన : శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రి   గృహస్థుడు భగవద్భక్తుడై యుండవలెను. భగవద్ఙ్ఞానమే అతని జీవిత పరమావధి. సదా కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మములను నిర్వహించుచు కర్మఫలముల నీశ్వరార్పణ మొనర్ప వలయును. జీవనోపాధి నార్జించుట గృహస్థునికి మహా విద్యుక్త ధర్మము. కాని తత్కార్యమును కల్లలాడుటచేతనూ, పరులను మోసగించుటచేతనూ, పరద్రవ్యాదుల నపహరించుటచేతనూ మాత్రము చేయతగదు. మరియు ఈశ్వరసేవయూ  దీనజనసేవయూ తన జీవిత ధర్మములని యాతడు గుర్తింపవలయును. తల్లిదండ్రులు సాక్షాద్భగవత్స్వరూపులని గ్రహించి గృహస్థుడు సదా సర్వవిధములను వారల సంతుష్టుల […]

చివరకు మిగిలేది…. బుచ్చిబాబు

రచన : మానస చామర్తి వందేళ్ళ జీవితాన్ని చవిచూచిన వృద్ధులైనా, విద్యా సాగర సంచితాన్ని ఔపాసన పట్టిన అగస్త్యులైనా, సన్యాసులైనా, సంసారులైనా సమాధానం చెప్పే ముందు పునరాలోచించుకోదలచే ప్రశ్న ఒకటుంది . అది “చివరకు మిగిలేది”  ఏమిటన్నది. సరిగ్గా దీనినే నాందీ వాక్యంగా ఎన్నుకుని, తెలుగు సాహితీ చరిత్రలో తొలి మనో వైజ్ఞానిక నవల గానూ, తెలుగు తల్లి కీర్తి కిరీటంలో వెలుగులీనే మరకతమణి గానూ నిలువగల నవలగానూ పేరొందిన రచన చేశారు బుచ్చిబాబు.   సందిగ్ద్థ […]

తెలుగు సంవత్సరాది

రచన : శైలజ మిత్రా నిజం ఈ వనంలో మొక్కలెప్పుడు సజీవంగా ఉంటాయి నిత్య వసంతం వాటి చిరునామా ఆరుబయట సందిగ్ధంగా నిలబడిన శిశిరాన్ని తలచుకుని గజ గజ వణుకుతోంది వయసు మళ్ళిన ఒక వృక్షం కోకిల నిత్య యవ్వనంతో వర్తమానాన్ని తన గళంలో వినిపిస్తోంది వేప చిగురులు భుతకాలపు అన్వేషణలో మామిడి కొమ్మ చారిత్రక దృక్పధంతో చేదు తీపి కలయికల రధాన్ని నడిపిస్తున్నాయి ఇది అలనాటి సంప్రదాయపు పదగామి అప్పుడప్పుడు చినుకుల కలనేత వస్త్రాన్ని ధరిస్తున్న […]

ప్రథమాచార్యుడు

రచన  –  కొంపెల్ల రామకృష్ణమూర్తి. “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ” యనుచున్ శ్రీకారముం జుట్టి -వా గ్దేవీ మంజుల కచ్ఛపీరవళి కాంధ్రీకంఠ మాధుర్యమున్ నీవే కూర్పక యుండిపోయిన మహాంధీభూత హృద్రంగమై యేవో గాలుల తేలిపోయెడిది కాదే  తెల్గు ముమ్మాటికిన్.   “దేశ్యమనగ నొక్క దివ్యప్రవాహము కదలుచుండు నద్ది కాలము వలె ” అనుచు నాడె పలికి యాగామి  సాహిత్య రీతి దలచినావు ఋషి సముడవు !   స్వస్థాన వేషభాషలయందు తులలేని రక్తి కల్గించు సూత్రము ఘటించి, పామర వ్యవహార […]

మనం మరచిన మన మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా

     రచన : సయ్యద్ నసీర్ అహ్మద్ మౌల్వీ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృజియించి మహాకవిగా  ఆయన ఖ్యాతిగాంచారు. స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో ఆవిశ్రాంతంగా పాల్గొన్నారు. భారత శాసన సభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి పథ నిర్దేశకునిగా, మంచి వక్తగా, మానవతావాద ప్రవక్తగా ఉమర్‌ అలీషా గణుతికెక్కారు.  అజ్ఞానం, మూఢనమ్మకాలు, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి  సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని […]

కవులు – కాంతామణులు

రచన: నూర్ భాషా రహంతుల్లా…   “భార్య అనుకూలవతి అయితే కవి, లేకుంటే వేదాంతి అవుతాడు” అంటారు.. భార్య పోరు పడలేకనే సోక్రటీస్ పెద్ద తత్వవేత్త అయ్యాడు అని కొందరి వాదం. లోకంలో మానవులు పడుతున్న కష్టాలు, హింస చూడలేక బుద్ధుడు వేదాంతి అవుతాడు. ఆయనకు బుద్ధి రావటానికి ముందు భార్యను విడిచి వెళ్ళడం గమనార్హం. బైబిల్లోని సొలోమను కూడా అంటాడు “గయ్యాళితో మంచి భవనంలో కాపురం చేయటంకంటే అరణ్యములో నివసించుట మేలు” అని.. ఇంకా “భార్యతోటి […]

తెలుగులో సైన్స్ ఫిక్షన్

రచన: శ్రీనివాస చక్రవర్తి “సామజిక ధర్మాలని ఉల్లంఘించేవారిని సంఘవిద్రోహ శక్తులు అంటారు. భౌతిక ధర్మాలని ఉల్లంఘించేవారిని సైన్స్ ఫిక్షన్ రచయితలు అంటారు.”   నిజానికి అనరు. కాని తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు చదువుతుంటే అలా అనాలనిపిస్తుంది. ఈ మధ్యన తెలుగులో ఓ సైన్స్ ఫిక్షన్  నవల చదవడం జరిగింది. ఓ పత్రికలో అచ్చయిన, పోటీలో బహుమతి గెలిచిన ఓ చిట్టి నవల. 2012  లో యుగాంతం వస్తుందనే మాయన్ గాధ ప్రాతిపదికగా అల్లబడ్డ కథ. భూమి […]