October 16, 2021

“మోటు ” బావి

రచన : పసుపులేటి గీత కడుపులో బిడ్డలా నడుం మీద బిందె నడుమ్మీద బిందెలా కడుపులో బిడ్డ .. రెండింట్నీ మోసుకుంటూ ఎక్కడ తొణికిపోతాయో, ఎక్కడ బెణికిపోతుందో.. అడుగులో అడుగు ఈ దూరాభారమేంటో అడుగు ఈ దుర్భర భారమేంటో అడుగు పాదరసపు గట్లమీద పాల గుండెల ‘మోత’ ఎంతెంత దూరం, ఇంకా ఎంత దూరం..? పాదాల్ని నములుతున్న కాలిబాట మోటబావి మోటుసరసం పారాణి ఆరని తొలినాళ్లలో నాకు కాల్లో ముల్లు విరిగితే నా మొగుడికి కంట్లో ముల్లు […]

మాలికా పదచంద్రిక – 6 , రూ. 1000 బహుమతి – ఆఖరు తేదీ మే 20

అడ్డం: 1. ఈ ఉగాది పండక్కి వచ్చే కూతురు (3) 5. వేశ్య, దేవదాసి (3) 7. అసాధ్యము. కఠినము, ప్రౌఢ (3) 9. అధమమును స్ఫురింపజేసే ఆమని, వసంతము (4) 10. యిష్టం వచ్చిన రూపాన్ని ధరించే శక్తి కల దేవుడు/దేవత, యక్షుడు/యక్షిణి లేదా రాక్షసుడు/రాక్షసి(4) 11. పసుపురాచిన బియ్యము ఏకవచనంలో తిరగబడింది (3) 13. తమరివి కాని మామిడి చెట్టు (2) 15. ఇంద్రుని రాజధానిని గుంటూరు జిల్లాలో వెదకండి (5) 17. పై […]

మఱికొన్ని జ్ఞాపకాలు

రచన : డా. ఏల్చూరి మురళీధరరావు,న్యూఢిల్లి గురుం ప్రకాశయేత్ – అని పెద్దలన్నారు. మన గురువులు చెప్పిన పాఠాలను మనసుకు తెచ్చుకొన్నట్లే, వారి పేరును నోరారా పేర్కొనటంలో ఒక ఆనందం ఉన్నది. సమర్థులైన గురువులు విద్యాబోధ కావిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు వారి వచోగరిమ వల్ల ఆధికారికేతివృత్తాని కంటె ప్రాసంగికంలోనే మెఱుములు మెఱుస్తాయి. ఆ మాటలు ముత్యాల మూటలు. జీవితకాలం తమతమ రంగాలలో విశేషమైన కృషిచేసిన విద్వాంసులు, విజ్ఞానవేత్తలు, కవులు, రచయితలు అయితే మఱీనూ. వారితో ప్రసంగావకాశమే ఒక విద్యాసముపార్జనం. […]

సరస్వతీపుత్రుడు – రూ 500 బహుమతి!

  రచన : ??? చెప్పుకోండి చూద్దాం… ఈ రచనాశైలిని గుర్తుపట్టగలరా??   ఈ వ్యాసం రాసిన వ్యక్తిదే   ఈ సంచికలో మరో రచన ఉంది?? ఎవరో చెప్పుకోండి మరి.. రెంటినీ గుర్తుపట్టిన వారికి రూ 500 బహుమతి.. మీ సమాధానాలు పంపడానికి ఆఖరు తేదీ.. మే. 20..     ఒకదినము రాకుంటె – ఓరంత కన్నీళ్ళు కన్నీటిలో చూపు – కదలిపోయింది ఒకదినము రానంటె – ఓరంత దుఃఖమ్ము గద్గదికతో గుండె – కమిలిపోయింది ఒకదినము […]

మా వంశీ “మా పసలపూడి కథలు”

రచన :    లక్ష్మి మల్లాది హేమద్రిభోట్ల         “వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే” అంటూ హాయిగా ఉంటాయి ఆయన తీసిన చిత్రాలు.  అందులో పాటలు శ్రావ్యం గా ఉంటాయి.  పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి.  “దివాకరం”, “బట్టల సత్తి”, ఇలా ఆ పేర్లతో అందులోని నటులు పాపులర్ అయ్యేంతగా గుర్తుండి పోయాయి.  భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకొని, చేతిలో ఓ మైకట్టుకుని అడివిలో చెట్టులు పుట్టలు తిరుగుతూ, పక్షుల పలుకులు రికార్డు […]

వాగ్గేయకార వైభవ ‘ ఆద్యక్షరి ‘

రచన : సత్యనారాయణ పిస్క,   అంత్యాక్షరి తెలుసుకాని, ఈ “ఆద్యక్షరి” ఏమిటి?! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా?……. కాస్త ముందుకు పదండి, మీకే తెలుస్తుంది.   మూడు సంవత్సరముల క్రితం కొంతమంది తెలుగుభాషాభిమానులు పూనుకొని మా ఊళ్ళో (మంచిర్యాలలో) “సాహితీ సంరక్షణ సమితి” అనే సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ ఆధ్వర్యములో ప్రతి నెల 3వ, 4వ ఆదివారపు సాయంత్రాల్లో సాహిత్యసమావేశములు జరుగుతుంటాయి. నేను కూడా ఈ సంస్థలో సభ్యుడినే! సాధారణంగా కవిసమ్మేళనము, ఒక సాహితీప్రసంగం ఏర్పాటు […]

శతక వాఙ్మయము – ఒక విశ్లేషణ

  రచన: కవుటూరు ప్రసాద్     తెలుగువాఙ్మయంలో శతకసాహిత్యానికి ఒక ప్రత్యేకస్థానం ఉన్నది.  శతకం అంటే నూరు పద్యముల సమాహారం.  కొందరు కవులు తమతమ శతకాల్లో శతాధికంగా కూడా పద్యాలు రచించారు.  ముక్తకం, మకుటం అనేవి శతకం యొక్క ప్రధాన లక్షణాలు.  ‘ముక్తకం’ అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రభావ ప్రతిపత్తితో విరాజిల్లటం.  ‘మకుటం’ అంటే కిరీటం.  ప్రభువుకు మకుటం ఎంత ప్రధానమో, శతకానికీ మకుటం అనేది అంత ప్రధానం.  శతకంలోని ప్రతి పద్యం […]

నన్నెచోడుడి ‘వస్తు కవిత ‘ పై ఒక ‘కాంతి ‘

రచన :  ఎం.వి.పట్వర్ధన్   రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స త్కవి భువి నన్నెచోడు డటె! కావ్యము దివ్యకథం గుమార సం భవ మటె! సత్కథాధిపతి భవ్యుడు జంగమ మల్లికార్జునుం డవిచలితార్థ యోగధరు డట్టె! వినం గొనియాడజాలదే!   (కుమార సంభవము)     “మాలిక ఉగాది ప్రత్యేక సంచిక” కు ఒక శివకవిని పరిచయం చేయబోతున్నాను.  అట్లాంటి, ఇట్లాంటి మామూలు కవి కాదండోయ్!  కొద్దిలో తప్పిపోయింది కానీ, ఓ దశలో నన్నయగారి ఆదికవి స్థానానికే ఎసరు […]

చలువ కనుల శ్రీమాత చౌడేశ్వరీ దేవి

రచన:  శ్రీధర్ అయల స్వస్తి శ్రీ చాంద్రమాన నందన నామ సంవత్సర మార్గశీర్ష పూర్ణిమ, శ్రీ దత్త జయంతి పర్వదినం ! రోమన్ కేలండరు ప్రకారం కి.శ. 1593వ సంవత్సరం. తూరుపు దిశ ఎరుపెక్కుతోంది, అంతకు క్రితమే వెలువడిన ‘ఔషసి’( ఉషోదయ కాంతి) నందన వర రాజ ప్రాసాదాల మీద పడి, వాటి శోభని ఇనుమడింప జేస్తోంది. ఆ ప్రాసాదాల వరసలో రెండవ భవంతి లోని , ఆరవ కక్ష్యలో భవ్యమైన పూజా మందిరం ఉంది. ఆ […]

క్షమయా ధరిత్రీ …..

రచన: మంధా భానుమతి   ఆంధ్ర భోజుడు, శ్రీకృష్ణ దేవరాయల పాలనలో, అష్టదిగ్గజాల సమక్షంలో తెలుగు కవితామతల్లి అగ్రపీఠం అలంకరించి అందరి నోటా తెనుగు నానుడి వయ్యారాలు పోతున్నప్పుడు, కవులే కాక ఇతర వృత్తుల వారు కూడా సాహిత్యమంటే మక్కువ చూపించే వారని తెలిసిందే.   ఆ తరువాత అచ్యుతరాయల కాలంలో కన్నడ సాహిత్యానికి ప్రాముఖ్యత నిచ్చినా, విజయనగరంలో ఇంకా తెలుగు పలుకులు వినిపిస్తూనే ఉన్నాయి. అష్టదిగ్గజాల్లోని కవులు కొందరు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.   […]