March 29, 2024

మాలికా పదచంద్రిక – 6 , రూ. 1000 బహుమతి – ఆఖరు తేదీ మే 20

అడ్డం:

1. ఈ ఉగాది పండక్కి వచ్చే కూతురు (3)

5. వేశ్య, దేవదాసి (3)

7. అసాధ్యము. కఠినము, ప్రౌఢ (3)

9. అధమమును స్ఫురింపజేసే ఆమని, వసంతము (4)

10. యిష్టం వచ్చిన రూపాన్ని ధరించే శక్తి కల దేవుడు/దేవత, యక్షుడు/యక్షిణి లేదా రాక్షసుడు/రాక్షసి(4)

11. పసుపురాచిన బియ్యము ఏకవచనంలో తిరగబడింది (3)

13. తమరివి కాని మామిడి చెట్టు (2)

15. ఇంద్రుని రాజధానిని గుంటూరు జిల్లాలో వెదకండి (5)

17. పై ఆధారం పేరుతో వచ్చిన సినిమాలో నటించిన సింధూర ఇంటి పేరా?(2)

18. అట్నుంచి 100000వవంతు (4)

19. జాతరలో వాణిశ్రీ కడుగునీళ్లు కోరిందా? (4)

20. వరుస లేదా పది (2)

21. మేఘము(5)

23. వైజాగుకు చెందిన ప్రముఖ కథకుడు (2)

25. చెదరిన కంపము (3)

27. సినిమాల్లో ఒక ముఖ్యమైన శాఖ (4)

28. కానుపు (4)

30. ప్రఖ్యాత (3)

32. ఇరువురు శోధించిన జింక (3)

33. బేవార్సు అనొచ్చా?(3)

 

నిలువు:

1. ఎంకిపాటల సృష్టికర్త ఈ సుబ్బారావు (3)

2. సూర్యభగవానుడు. ఆకాశంలో రత్నంలా ప్రకాశిస్తాడు కదా!(4)

3. శిబి చక్రవరి దానగుణాన్ని పరీక్షించిన పక్షి (2)

4. నయగారా కవియైన క్రైస్తవ ప్రభువు (2)

5.  పుష్యరాగము(4)

6. సరస్వతి చేతిలోని ఆడు తాబేలు (3)

8. శీర్షాసనం వేసిన అసురుడు (4)

11. తాంబూలమునకు కావలసినది (5)

12. దిగుట లేదా దివ్యమైన జన్మ (5)

14. రంగనాయకమ్మ నవల జానకి ___ (3)

15. లాంగిట్యూడు (3)

16. తిరుక్షవరములో నిలకడైనది (3)

17. శ్రీనివాస రామానుజన్ దీనిలో మేధావి (3)

22. తెల్లనిది, తేటయైనది, నిర్మలమైనది (4)

24. ఏ క్షామము అని అడిగితే పదేపదే చెప్తావేం?(4)

26. ఇల్లరికంలో ఉన్న మజాను రుచి చూపిన రాఘవయ్యచౌదరిగారు (4)

27. బారు కాని బారు, కచ్చేరీ (3)

29. నేరము మోపబడిన ఖైదీ(3)

30. శ్రీశ్రీ నడిపిన ప్రశ్నోత్తరాల శీర్షిక (2)

31. అడ్డం 1 దీనికి బైబై చెప్పింది (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *