March 28, 2024

రాముని భర్తృధర్మము

             రచయిత :- యఱ్ఱగుంట సుబ్బారావు   ధర్మప్రధానుడైన రాముడు దారనైనను, ధనమునైనను(అర్థకామములను) ధర్మబద్ధమైన వానినే స్వీకరించును. ప్రభువు, తండ్రి అయిన దశరథుని ఆజ్ఞానువర్తియగుటయే తన ధర్మమని రాముడు విశ్వసించినాడు. వంశసంప్రదాయమునుబట్టి, ప్రభువు ఆనతినిబట్టి జ్యేష్ఠుడైన తనకు లభించిన రాజ్యమును, వరముల వలలో చిక్కిన తండ్రి కోరగా భరతునికై పరిత్యజించినాడు, వనవాసమును అంగీకరించినాడు. అట్లే స్వపరాక్రమ విజితయు, స్వయంవరలబ్ధయు అయిన సీతను జనకుడు కన్యాదానము చేయుటకు జలపాత్రతో సిద్ధముకాగా తండ్రి అనుమతి లేకుండా ఆమెను స్వీకరించలేదు. […]

సాహిత్య “ఈ” ప్రస్థానం

రచన: మాచర్ల హనుమంతరావు   సుదీర్ఘ చరిత్రగల సాహిత్య ప్రస్థానం అనంతమైనది, నిరంతరమైనది. అందులో తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, రసాత్మకమైనా, జనజాగృతిలోనైనా, మనమెంతో గర్వపడేంత విశేషమైనదై, విశిష్టమైనదై, విలక్షణమైనదై వెలుగొందుతోంది. స్త్రీల కోకిల కంఠములలో, కార్మిక, కర్షక, శ్రామిక స్వేదంలో, జానపదుల మోదంలో మొదలైన తెలుగు సాహిత్యం , విభిన్న భావజాలాలతో, భిన్న విభిన్న ప్రక్రియలతో కాలనుగతంగా పరిణితి చెందుతూ ఆయా దేశ కాల సామాజిక పరిస్థితులను, అవసరాలనూ, ఆవశ్యకతలనూ, ప్రతిబింబిస్తూ జనాకాంక్షలను ప్రతిధ్వనిస్తూ […]