April 19, 2024

పూర్ణాత్మ – పుస్తక సమీక్ష

రచన : శశికళ.వాయుగుండ్ల.

సాహిత్య లోకాలను స్పృశిస్తూ ఊహాలోకాల్లో తేలియాడే నేను ఈ మధ్య ”పూర్ణాత్మ”అనే పుస్తకం చదవటం జరిగింది.ఇది తప్పకుండా అందరు చదవాల్సిన పుస్తకమనిపించింది.అందుకే దీనిని పరిచయం చేస్తున్నాను. ఇది ”ఒరిన్”అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తచే చానలింగ్ చేయబడి ”సనయ” గారు వ్రాసినట్లు,రాధ గారు అనువాదం చేసినట్లుగా వ్రాసి ఉంది. నిజంగా ప్రతీ దానిని నెగటివ్ గా చూసే ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు ఇలాంటి పుస్తకం చదవాలి.తమ పూర్ణాత్మతో మమేకమై హృదయంతో చరించటం వలన జీవితం యెంత హాయిగా గడప వచ్చో తెలుసుకోగలుగుతారు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే మనం మనల్ని తెలుసుకొనే ఒక ప్రయాణం.దీనివలన మనం లోకాన్ని చూసే దృష్టి మారుతుంది.మన ఆధ్యాత్మిక అభివృద్ధి వలన అందరితో ఉన్నత మార్గాన అనుసంధానమై ప్రేమ పూర్వకంగా జనాన్ని పంచుకోగలుగుతారు.పూర్ణాత్మతో అనుసంధానం కావటం వలన నెగటివ్ ఎనర్జీ ని పాజిటివ్ ఎనర్జీ గా మార్చుకోగలుగుతారు. వాస్తవంగా మనకు మంచి జరగాలంటే రెండు శక్తులు ఉపయోగించటం తెలియాలి. సృష్టించే శక్తి,ఊహా శక్తి. వీటి సహాయం తో మనం పూర్ణాత్మతో అనుసంధానం కావటం వలన మనకు ఏది కావాలో అది ఊహల్లో చిత్రీకరించి మన కాంతి శక్తిని దానికి అందించి దానిని పొందవచ్చు.”మీరు విజయం సాధిస్తారని నమ్మండి”అంతే.

 

”విశ్వ మేధస్సు సంపూర్ణంగా ఉంటుంది.మీరు ఏమి ఆలోచిస్తారో దానిని పరిపక్వంగా సృష్టిస్తుంది.” ఇక్కడ మనకు మన ఊహకు ఎలా కాంతిని జత చేయాలో కూడా చెప్పారు. ఇంకా ప్రతి చాప్టర్ వెనుక ఇచ్చిన సూచనలు ఎలా సాధన చెయ్యాలో స్టెప్స్ ఇచ్చారు.నిజంగా మనకు ఎక్కడా ఇది అనువాదం అనిపించదు. మన స్నేహితునిలా సూచనలు ఇస్తూ మన ను పాజిటివ్ భావనల వైపు నడిస్తుంది ఈ పుస్తకం మనకు తెలీకుండానే….. ఇంకా పూర్ణాత్మతో అనుసంధానం అవటం వలన మన సమస్యకు హృదయం నుండి పరిష్కారాలు వస్తాయి.అవి మనం మనసుతో ఆలోచించెవిగా ఉండవు.నిశ్శబ్దం గా ఉండి పూర్ణాత్మతో ఎలా మమేకం అవ్వాలో కూడా చక్కగా ఇచ్చి ఉన్నారు. ఇంకా దీనిలో వాయిడ్ అనే ఒక చక్కని స్తితి గూర్చి వ్రాసి ఉన్నారు. పాతవాటిని వదిలి వేసి ,కొత్త స్తితికి ఎదగటానికి ఇప్పుడు మీరు ఉన్న పరిధులు దాటి మీ చైతన్యం విస్తరించే స్తితిని ”వాయిడ్”అంటారు.ఇది పాత ,కొత్త స్తితి మద్య స్తితి.మీకు చదువు పూర్తీ అయిన తరువాత,లేదా ప్రాజెక్ట్ పూర్తీ అయిన తరువాత ఎవరైనా ఈ స్తితిలో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది.వాయిడ్ మీకు ఎన్నో కొత్త అవకాశాలు ఇస్తుంది. ఇంకా దీని గూర్చి చాలా చక్కని విషయాలు వ్రాసి ఉన్నారు. మనసుని మౌనం చేసి ప్రతి రోజు కొన్ని నిమిషాలు వాయిడ్ లోకి వెళ్ళగలిగితే చాలా గొప్ప స్తితిలో బయటకు వస్తారు.ఇంకా దీనిని మీ జేవితం లో ఎలా ఉపయోగించుకోవచ్చో,అది మీ జీవితం లోకి వచ్చినపుడు ఎలా ఉండాలో వ్రాశారు. దీనిలో నాకు నచ్చిన వాక్యం…. ”ఏదైనా రెండు సార్లు సృష్టింపబడుతుంది.ఒకటి మీ ఊహల్లో… రెండోది మీ వాస్తవంలో…”దీనివలన మన ఆలోచనా విధానాన్ని మార్చుకొని యెంత లాభ పడ గలమో తెలుస్తుంది.

 

ఇంకా దీనిలో కాలం ఎలా ఉపయోగించుకోవచ్చో చక్కగా వివరింపబడి ఉన్నది. ఒక విషయాన్ని ,పనిని ఇష్టపడుతూ చేయటం వలన కాలాన్ని వృధా కాకుండా చేయవచ్చు. ”మీ బుద్ధిని అనుసరించి అది సారి అయినది అని భావించినపుడే చర్య తీసుకోండి” ఇంకా మన ఆధ్యాత్మిక వికాసానికి సేవ దగ్గర దారి అని,ఇతరులను శక్తి వంతులుగా చెయ్యటం ద్వారా…..వారి జేవితం లో పాజిటివ్ గా మార్పులు తేవటం ద్వారా….మనం ఇంకా పూర్ణాత్మకు దగ్గరగా జీవించగలం అని ఉన్నది. మనం ఇతరులను ఎలా చూడాలో ,గౌరవించాలో చక్కగా సూచించారు. ”ఎవరినైనా వారు ఎలా ఉన్నారో అలానే చూడండి.న్యాయ నిర్ణయాలు చేయవద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.దాని ని చూసి మీ హృదయం నుండి వారికి కాంతి,ప్రేమను పంపండి” మనిషి సంతోష జీవనానికి ఎలాటి మార్గం కావాలో తెలుసుకొని ఆనందంగా జీవించాలి అనుకునే వారికి ,హృదయాన్ని వికసింప చేసుకోవాలి అనుకొనే వారికి ఇది చాలా చక్కటి పుస్తకం అనటం లో సందేహం లేదు.ఇది అందరు తప్పక చదివి తీరాల్సిన పుస్తకం. ………..

5 thoughts on “పూర్ణాత్మ – పుస్తక సమీక్ష

  1. kalyaan gaaru thanku…..

    srinivas garu sry for the delay….bcoz of tenth public exams ….
    they have given this address
    h.no.16-11-477/6/1/a-6, upside of andhrabank counter,
    beside of sahadevareddy sweet house,dilshuknagar,
    HYDERABAD-36,phone:040-66637630,9290125886

  2. Respected One
    Please give me the details of Book Publishers , where it can be available author name, publishers name

    I want to read the book , i want to change my thoughts

    Thanking you

  3. మంచి పుస్తకం మంచి స్నేహం వంటిది ! నిజమే పుస్తకాలు మనలోని మనల్ని వెలికితీసి చూపుతాయి ఎందుకంటే అవి మాట్లాడవు చదివేవారికే అన్నీ వదిలేస్తుంటాయి …చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు శశికళ గారు … రెండు శక్తుల గురించి చక్కగా తెలిపారు.. సృష్టి కానివన్ని ఊహల్లో ఉంటాయి … ఊహలైనవన్నీ కచ్చితంగా సృష్టించబడుతాయి … కావున నమ్మకం కనుక ఉంటే ఈ సృష్టి మనదే ఆ సృష్టి మనమే…. ఇక పోతే మీ ఈ సమీక్ష చదివిన తరువాత ”ఎవరినైనా వారు ఎలా ఉన్నారో అలానే చూడండి.న్యాయ నిర్ణయాలు చేయవద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.దాని ని చూసి మీ హృదయం నుండి వారికి కాంతి,ప్రేమను పంపండి” దీనిని ఇంకా బాగా అవలంబించడానికి ప్రయత్నిస్తున్నాను . చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *