April 16, 2024

వందనం అభి “నందనా”

మాలిక పత్రిక ఉగాది సంచిక కోసం ప్రముఖ చిత్రకారుడు శంకు వేసిన చిత్రం

 

వంధనం.. అభివందనం.

కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం…..

 

“చైత్ర శుద్ధ పాడ్యమి” తెలుగువారందరికి అతి ముఖ్యమైన రోజు…  సృష్టి పుట్టినరోజు, పరమాత్మ ఈ విశ్వాన్ని సృజించిన రోజు.   ఆకులు రాల్చిన చెట్లన్ని ఫలపుష్పాలతో కనులవిందు చేస్తుండగా, కోయిలల కుహుకుహూ రాగాలతోడుగా  ప్రకృతి పరవశం కలిగిస్తుండగా, మామిడిపళ్ల మధుర రుచులతో,  మల్లె,జాజి, చామంతుల పరిమళాలతో,  మామిడి  తోరణాల ఆహ్వానంతో వసంతరాణి వయ్యారంగా వస్తుంది. వస్తూ వస్తూ తనతో పాటు ఎన్నో అందాలను , నూతన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తోడ్కొని వస్తుంది. గత చేదు అనుభూతులు మరచి కొత్త సంవత్సరంలో కొత్తగా పునఁప్రారంభించాలనే యుగాదికి స్వాగతం పలుకుదాం.

నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా  ఉండాలని కోరుకుంటూ మాలిక పత్రిక తరఫునుండి నందన నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, సాహితీ ప్రేమికులకు ప్రీతికరమైన కవి సమ్మేళనాలు తప్పక  ఉండాల్సిందే కదా. అందుకే ఈసారి మాలిక పత్రికను సాహితీ సంచికగా మలచాము. మాలిక కోసమే రాయబడిన ప్రత్యేక వ్యాసాలు అందించారు శ్రీ ఏల్చూరి మురళీధర్ రావుగారు, సత్యనారాయన పిస్కా గారు, ఉమాభారతి గారు. ఇవే కాక మరెన్నో వ్యాసాలు, కథలు, కవితలు, సమీక్షలు మీకోసం ఈ సంచికలో పొందుపరచబడ్డాయి.  పదండి మరి సాహితీ విందుకు….

 

ప్రముఖ నాట్యకారిణి , హూస్టన్ వాసిని శ్రీమతి ఉమాభారతి మాలిక టీమ్ లో  చేరబోతున్నారు..

3 thoughts on “వందనం అభి “నందనా”

  1. సాహిత్య సౌరభాలు గుబాళిస్తూ ముస్తాబైన మాలిక ఉగాది సంచికకు స్వాగతం. శంకుగారి చిత్రం చాలా బాగుంది. నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మాలికకు…

  2. శ్రీమతి జ్యోతి గారికి
    నమస్కారం.

    “మాలిక” ఉగాది సాహితీ సంచిక మీ సంపాదకీయకౌశలి మూలాన – ఎంతో నిండుగానూ, అందంగానూ, అన్నింటికి అన్నీ చదివి దాచుకోదగిన రచనావళితో ఒకనాటి తెలుగు సాహిత్యపత్రికల లాగా సర్వాంశ పఠనీయం గానూ ఉన్నది.

    మీ ఓర్పుకు, నేర్పుకు, కూర్పుకు, తీర్పుకు అభినందనలు.

    మెప్పుల కుప్పలతో,
    ఏల్చూరి మురళీధరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *