April 23, 2024

నాకు నచ్చిన పుస్తకం

రచన : డా. ఏల్చూరి మురళీధరరావు   “నాకు నచ్చిన పుస్తకం” అన్న శీర్షికతో వ్యాసరచన పోటీకి భావనిర్భరమయిన ఒక వ్యాసాన్ని రచింపవలసినదిగా ఇరవైఆరేళ్ళక్రితం – 1985లో అనుకుంటాను, నా విద్యార్థులను కోరినప్పటినుంచీ, శారదిక మధురచంద్రికలా ఈ విషయం నా హృదయంలో తళతళ మెరుములీనుతూనే ఉన్నది.   కళాశాల శరత్సమాపనవేళకు మునుపు ఈ విషయాన్ని పోటీకి ప్రకటించిన వెంటనే, ఒక విద్యార్థి – పులిపాటి జయరాం ప్రసాద్ అతని పేరు – నా దగ్గరి చనువుతోనూ, నాపైని […]

రంగాజమ్మ…

రచన : జి.ఎస్.లక్ష్మి రంజిత అక్కయ్య రంగాజమ్మ కొడుకు పెళ్ళి. పెళ్ళంటే మామూలు పెళ్ళి కాదు. ఆ పెళ్ళికోసం బంధువులంతా ఎప్పట్నించో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళికొడుకు మంచి చదువు, గొప్ప జీతంతో అమెరికాలో డాలర్ల మీద డాలర్లు సంపాదించేస్తున్నాడు. రంగాజమ్మ కొడుకు ఇంగితఙ్ఞానం ఉన్నవాడు. ఎవరికేం కావాలో అతనికి బాగా తెలుసు. అందులోనూ తల్లి గురించి ఇంకా బాగా తెలుసు. రంగాజమ్మకి డబ్బన్నా, డబ్బున్నవాళ్ళన్నా మహా ఇష్టం. ఆ డబ్బుని రకరకాలుగా ప్రదర్శించడంలో ఆవిడకి గొప్ప నేర్పుంది. […]

జీవుడే దేవుడు

రచన: వసంతరావు   దేవుడో దేవుడంచు దేవులాడనేలరా నిన్ను నీవు తెలుసుకుంటె నీవే దైవంబురా   మూఢ నమ్మకాల జిక్కి వ్యసనాలకు బానిసవై నిరక్షరాస్యత కోరలలో నిర్జీవిగ మారినావు   కోర్కెలీడేరునంచు ముడుపులెన్నొ గట్టినావు లెక్కలేని దేవుళ్ళకు మొక్కులెన్నొ మొక్కినావు   నిజతత్త్వం గానలేక మొక్కులెన్నొ మొక్కినావు కాలసర్ప కోరలలో బందీగా జిక్కినావు   గొర్రెదాటు ఆచారాలు గొప్పగ పాటించి నీవు అజ్ఞానపు మంటలలో మిడుతవోలె మాడినావు   మారెమ్మల మైసమ్మల మంత్రాలలొ జిక్కి నీవు చేతబడులంటు […]

అంచనా వెయ్యకు

రచన : కావలి కోదండరావు   ఒక గొంతే అరిచిందని చులకన చేయకు. కాసేపట్లో మరో పది గొంతులు శృతికలిపితే ఆ కోరస్ నింగినున్న చుక్కను తాకుతుంది. చీమలైనా క్రమశిక్షణతో నడిస్తే బండరాళ్లే అరిగిపోతాయి.   ఒకడే నడుస్తున్నాడని హేళన చేయకు. ఇంకో నలుగురు ఆ నడకకు జతకడితే, కారడవైనా దారి విడవక తప్పదు.   ఇప్పటి ఈ నదులన్నిఒకప్పుడు ఏ కొండల్లోనో తప్పటడుగులు వేసినవే. చినుకేనని చూస్తుండగానే, అది వర్షోదయానికి తొలిపొద్దే అవుతుంది. దానికి కాలం […]