June 25, 2024

మెడ పట్టినదీ – కనిపెట్టినదీ

రచన: డా. మూర్తి జొన్నలగెడ్డ

 

మెడపట్టి మెడపట్టి

కాలరొకటి వేస్తుంటి

అన్ని జాయింట్లను పట్టి

అడుగిడకుంటి

 

మోకాళ్లు నెప్పెట్టి

మూడంకె వేసుంటి

మందొకటి రాసుంటి

మగతగా పడుకొంటి

 

కండలు బిగపట్టి

కెవ్వున మేలుకొంటి

ఆపైన డాక్టర్ని కలిసుంటి

అతనడుగగ అనుకొంటి

 

డ్రైవింగ్ రఫ్‌గా చేయుచుంటి

చైరులో తిన్నగా కూర్చొనకుంటి

అనునిత్యమూ కంప్యూటరునంటి

కండలస్సలు కదల్చకుంటి

 

ఎముకల వైద్యుని కంటి

ఫిజియోథెరపీ అంటి

వారి సలహాను బట్టి

మెడకు కాపడం పెట్టుచుంటి

 

భుజములు గిరగిర తిప్పుచుంటి

వ్యాయామంబు చేయుచుంటి

ఈతకొట్టి ఈతకొట్టి

 

అలసుంటి అలసుంటి

నిద్ర సుఖముగా పట్టి

రోజెల్ల ఉత్సాహముగానుంటి

కనుగొంటి కనుగొంటి

 

సర్వరోగంబులకు కారణంబిట్టి

ఆధునిక జీవనమనుకొంటి

మంచి అలవాట్లను మానకుంటి

మరి హాయిగా జీవించుచుంటి

 

 

 

1 thought on “మెడ పట్టినదీ – కనిపెట్టినదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *