December 6, 2023

వాయువు

రచన:  రసజ్ఞ   పంచభూతాలలో రెండవది, మానవ మనుగడకి అత్యంత ఆవశ్యకమయినది వాయువు. దీనినే వ్యవహారికంగా గాలి అంటాము. దీనికి శబ్ద, స్పర్శ అనెడి ద్విగుణాలున్నాయి. భాగవతం ప్రకారం ఆకాశం నుండీ వాయువు ఉద్భవించినది. వాయువుకి అధిదేవత వాయుదేవుడు. ఈయన వాయువ్యానికి దిక్పాలకుడు. ఈయన భార్య అంజన, వాహనం దుప్పి, ఆయుధం ధ్వజం, నివాసము గంధవతి. తైత్తరీయోపనిషత్తులో వాయువుని “త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి” (నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి) అని సంబోధించారు. సర్వదా చరిస్తూ ప్రతీచోటా నిండి ఉన్నా, […]

వన్ బై టు కాఫీ

రచన  – భండారు శ్రీనివాసరావు   నలభై ఏళ్ళ కిందటి మాట.   ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన […]

ఇలాగే ఇలాగే సరాగమాడితే..

  రచన – మధురవాణి   “ఇదిగో చిట్టెమ్మా.. ఆ అంట్లు కడిగే పని తర్వాత చూడొచ్చు గానీ ముందు నువ్వు ఈ టిఫినూ, కాఫీ పట్టుకెళ్ళి ఉత్తరపు గదిలో ఉన్న చుట్టాలకిచ్చిరా.. అలాగే, వచ్చేటప్పుడు ఆ పక్క గదిలో మన చిన్న రాకుమారి గారి మేలుకొలుపు సేవ కూడా చూడు.. పది నిమిషాల్లో నేనటొచ్చేసరికి దాన్ని మంచం మీద కనపడకూడదన్నానని గట్టిగా చెప్పు..” “అమ్మాయ్ సంధ్యా.. ఇలా రా.. తలకి కొబ్బరినూనె పెడతాను. ఇదిగో.. ఈ […]

సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన

రచన : నూర్ బాషా రహంతుల్లా   ప్రజలకు విషయం మరింత సులువుగా అర్ధమవడానికి ఉపన్యాసాల్లోనూ, రచనల్లోనూ సామెతలూ, ఉపమానాలూ వాడతారు . ఇవన్నీ భాషను పరిపుష్టం చేసేవీ, అలంకారమైన అంశాలే. సామెతలంటే సమాజం పోకడలలో హెచ్చు తగ్గులు అవకతవకలు అతిక్లుప్తంగా చెప్పే అక్షరసత్యాలు.ఆనాటి పెద్దలచే చెప్పబడిన అనుభవసారాలు.ప్రత్యక్షంగా చెప్పలేనివి పరోక్షంగా చెప్పటానికి వీటిని చురకలుగా ఉపయోగించారు.సామెతలు ఏమి చెప్తున్నాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యమే కానీ అవి స్త్రీలని,కులాలనీ,మతాలనూ హేళనచేసేవైతే? సామెతల్లో భక్తి,వైరాగ్య,శృంగార,నీతి,విజ్ఞాన,చమత్కారాల వలెనే ,మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళనా సామెతలు […]

వికృ(త)తి రాజ్యం

రచన : రావి రంగారావు     వీణ్ణి చూసి వీడి  దేహాన్ని చూసి వీడి  బతుకును చూసి వాడు జాలిపడ్డాడు…   వీణ్ణి ఎలాగైనా బాగుచేయాలని వాడు తీర్మానించుకున్నాడు… పథకం ప్రకారం మత్తు పెట్టి వీడి  వెన్నెముక విరిచాడు…   వీడి ఎముకల్లోని మూలుగు వాడు కమ్మగా జుర్రుకున్నాడు, వీడికి ఉత్త ఎముక లిచ్చి ప్రేమగా  తిను అన్నాడు,   వీడి మనసు సోలయింది, మానికయింది, వీడి అభిమానం “బ్యానర్’ అయింది, గుడ్డిగా  భజన చేయటం  […]

ఇంటర్‌నెట్-2

రచన: నరేష్ నందం     ఏంటి, ఇంటర్‌నెట్ 1 ఎక్కడ, ఎప్పుడు మిస్ అయ్యాం అని వెదుక్కుంటున్నారా? కంగారు పడకండి! మీరు ఇప్పుడు వాడుతున్నదే ఇంటర్‌నెట్ 1. మీరు ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయటానికి, అంటే maalika.org, lekhini.org, google.com, naukri.net, blogspot.in, yahoo.co.in ఇలా టైప్ చేసి ఉంటారు కదా. వీటిని డొమైన్ నేమ్స్ అంటారు. వీటిలో .com, .net, .org, .infoతో పాటు .biz, .pro, .name వంటి ఏడింటినీ జనరిక్ టాప్ […]

చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

రచన : శ్రీనివాస చక్రవర్తి     స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్. 1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి […]

అక్రూరవరద మాధవ

రచన : ఆదూరి హైమవతి                       ‘కృష్ణాష్టమి’ శ్రీకృష్ణుడిజన్మదినం’గా వేడుకచేసుకుంటాం.ఎవ్వనిచేజనించుజగమెవ్వనిలోపలనుండు లీనమై –అన్నట్లు సృష్టి స్థితి కారుడైన భగవంతునికి పుట్టుట గిట్టుట అనేవి లేనేలేవు కదా! ఐనా మనకు భగవంతుని జన్మదినాలను జరుపుకోడం ఆనవాయితీగా వస్తున్నది. శ్రీముఖ నామ సం శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి” శ్రీకృష్ణజన్మాష్టమి”, “శ్రీకృష్ణజయంతి” ,”జన్మాష్టమి” అనికూడ అంటాం. భగవంతుడైన కృష్ణుడు దుష్టశిక్షణ , శిష్టరక్షణకోసం  యుగయుగాల్లోజన్మిస్తుంటానని చెప్పడంవలన మనం పండుగలు జరుపుకుంటూ ,మనలోని […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2012
M T W T F S S
« Aug   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
293031