May 19, 2024

కలసి ఉంటే కలదా సుఖం???

అమ్మా నాన్న, అన్న, తమ్ముడు, అక్క, పిల్లలు. ఇలా ఎన్నో బంధాలతో ఇమిడి ఉండి ఒక కుటుంబం. ఒక స్త్రీ, పురుషుడు కలిసి మరో కుటుంబాన్ని ప్రారంభించి, వంశాన్ని ముందుకు నడిపిస్తారు. తమ పిల్లలకోసం అహర్నిశలు కష్టపడతారు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదు అని వారికి అన్ని వసతులు సమకూర్చి, చదువులు చెప్పించి, వారు కోరినవి తమ తాహతుకు తగినవి అయినా,  కాకున్నా ఎలాగో అమరుస్తారు… పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని […]

శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

రచన : పద్మిని భావరాజు   భగవంతుడిని మాతృ  రూపాన పూజించడమే దేవి ఉపాసన. ఆమె మహా శక్తి- మహా మాయా.–మహా విద్య. శక్తి భగవంతుడి తేజో స్వరూపం. మూలాధార చక్రంలో సర్పాకారంలో ఉండేది ఆ పరాశాక్తే. ప్రపంచమంతా ఆ శక్తే నిండి ఉంది. సూర్యునిలోని ప్రకాశం, పూవులలోని సుగంధం, ప్రకృతి లోని సౌందర్యం, ఇంద్రధనస్సు లోని వర్ణాలు, మనస్సులోని వివేకం, భక్తులలోని భక్తి, యోగుల లోని యోగం, ఇంద్రియ నిగ్రహం ఆమె.   ఈ సృష్టి […]

అడవి దేవతలు సమ్మక్క సారలక్క

రచన : పి.యస్.యమ్.లక్ష్మి వరంగల్ జిల్లాలో పేరుపొందిన జాతర ఈ సమ్మక్క సారలక్క జాతర. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ జాతర రెండు సంవత్సరాలకొకసారి మాఘ శుధ్ధ పూర్ణిమనాడు మొదలయి నాలుగు రోజులు సాగుతుంది. ఆంధ్ర ప్రదేశేకాకుండా మధ్య ప్రదేశ్, చత్తిస్ గర్, ఒరిస్సా, మహారాష్ట్రా, కర్ణాటకా, జార్ ఖండ్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలనుంచి కూడా భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమంది పాల్గొనే గిరిజన జాతరగా ప్రసిధ్ధిగాంచింది. కుంభమేలా తర్వాత […]

కరగని కాటుక

రచన: సుభద్ర వేదుల పొద్దున్నే వచ్చిన ప్రాణమిత్రుడు విశ్వాన్ని అతని భార్య లతనీ చూసి “హేమా, విశ్వం, లతా వచ్చారు. అందరికీ కాఫీ తెచ్చేయ్!” అన్నాడు రాఘవ. “ఏరా.. పొద్దున్నే ఎదైనా ప్రోగ్రాం పెట్టావా? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావ్” అన్నాడు నవ్వుతూ.. విశ్వం నవ్వలేదు. మౌనంగా కుర్చీలో కూలబడ్డాడు ఏదో ఆలోచన ముడిపడ్డ అతని భృకుటిలోనూ, అతని మెదడులోనూ సుడి తిరుగుతోందని గ్రహించాడు. ఒకటా, రెండా, దాదాపు నలబై ఏళ్ళ పై చిలుకు స్నేహం వాళ్ళది. […]

పైడికంట్లు

రచన : డా.కౌటిల్య       ధనుర్మాసం…. నెలపెట్టి నాలుగురోజులు కావస్తోంది.  తొలికోడి కుయ్యకముందే నిద్రలేచి పొలంబాట పడుతున్న పెదకాపులు చలికాగలేక, తలగుడ్డ చెవులకిందికి దిగలాగి, రొంటిన దోపిన చుట్టముక్క తీసి వెలిగించి, గుప్పుగుప్పున పొగ వదుల్తూ, ఆ వెచ్చదనం ఇచ్చిన హుషారుకి వడివడిగా గట్లమీద అంగలేస్తూ వెళుతున్నారు. గడగడా వణికే అంతటి చలిలోనూ పైన ఉత్తరీయం తప్ప వేరే ఆచ్చాదన లేకుండా, భుజాన ఉన్న తంబురా సరిగ్గా శ్రుతి చేసుకుని ఓ చేత్తో మీటుతూ, […]

సీత… సీమచింత చెట్టు

రచన : సుప్రజ   ‘ఓయ్..రామ చిలుకలూ..ఇదిగో చూడండీ..చెప్పానా అమ్మనడిగీసారి పచ్చ గౌనూ ఎర్ర రిబ్బన్లూ కొనించుకుంటానని .. ఇప్పుడు మనందరం ఒకటే. మీరూ ఈ చెట్టూ నా గౌనూ పచ్చా.. మీ ముక్కూ, ఆ కాయలూ నా రిబ్బన్లూ ఎరుపూ… కదూ’  సీమ చింత చెట్టు  కిందికొస్తూనే  చూపించా నా గౌను చిలుకలకి. కొరికేసిన కాయలు రాల్చి గోల గోలగా లేచెగిరిపోయాయి  చెట్టు మీద రామ చిలకలన్నీ. నా  చిలుకాకు పచ్చ గౌను కుచ్చులు విప్పుకున్నట్టుంది  […]

బ్రతుకు జీవుడా

రచన : శర్మ జీ. ఎస్. నరలోకానికి, నరకలోకానికి, తేడా పైకి కనిపించే ” క ” అక్షరం మాత్రమే కాదు ,ఎంతో తేడా ఉన్నది. ఆ నరకలోకం మన కళ్ళకు కనపడనంతదూరంలో , ఊహకి కూడా అందనంత దూరంలో ఉన్నదని ధృఢంగా  చెప్పవచ్చు.ఈ రెంటికీ చాలా  చాలా దగ్గర సంబంధమున్నది. ఆ నరకలోకం యమధర్మరాజు ఆధీనంలో, ఆతని ఏకైక హోల్ & సోల్ అకౌంటెంట్ చిత్రగుప్తుని పర్యవేక్షణలో అచటి దైనందిన కార్యక్రమాలు నడుస్తుంటాయ సర్వలోకాల సృష్టికర్త […]

చీరల సందడి

రచన   – శశి తన్నీరు   హ్మ్..చీ..చీ…గుమ్మం లో చెప్పులు విసిరేస్తూ అంది ఉమ విసుగ్గా.”ఏమైందే”అమాయకంగా అడిగాడు విభుడు. (ఆయన పేరు అవసరం లేదు ప్రస్తుతానికి ఇది చాలు) ”ఏమి కావాలి మిమ్మల్ని కట్టుకున్న పాపానికి అన్నీ అవమానాలే  శ్రీశైలం డ్యాం నిండితే విరుచుకు పడ్డట్లు ..కోపాన్నంతా కుమ్మరించింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని తెలిసినవాడు కాబట్టి మెల్లిగా జారుకున్నాడు…   కాసేపు వంటింట్లో గిన్నెలు మిక్సీ లో పప్పులు వేసి మూత మరిచిపోయి ఆన్ […]