May 31, 2023

అవధాన పుట

  కంది శంకరయ్య: అంతర్జాల అష్టావధానం కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం. ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశాలున్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం. అవధానం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత అని స్థూలార్థం. చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత, అప్రమత్తత ఉండే చిత్తస్థితియే అవధానం. 13వ శతాబ్దం నాటికే ఎన్నోరకాల అవధానాలున్నట్లు […]