March 28, 2024

అవధాన పుట

 

కంది శంకరయ్య:

అంతర్జాల అష్టావధానం
కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం.
ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశాలున్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం.
అవధానం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత అని స్థూలార్థం. చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత, అప్రమత్తత ఉండే చిత్తస్థితియే అవధానం.
13వ శతాబ్దం నాటికే ఎన్నోరకాల అవధానాలున్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంగా కొన్ని మరుగునపడ్డాయి.
‘విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వమ్ము’. ఆ కవిత్వాన్ని ప్రదర్శనాత్మక కళగా తీర్చిదిద్దింది అవధానప్రక్రియ. కొఱవి గోపరాజు అష్టావధానాన్ని 64 కళల జాబితాలో చేర్చాడు.
ఈకాలంలో అంతర్జాలం సర్వవిషయాలకూ నిలయమై పోయింది. ఎందరో ఆంధ్రభాషాభిమానులు తమ వెబ్‌సైట్‌ల ద్వారా, బ్లాగుల ద్వారా తెలుగు సాహిత్యానికి చెందిన అన్ని ప్రక్రియలను, అన్ని కోణాలలో అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రశంసార్హులు. వారికి మా వందనాలు.
బ్లాగు గురువులై తమ వివిధ బ్లాగుల ద్వారా వైవిధ్యమైన అంశాలపై క్రమం తప్పకుండా పోస్టులను ప్రకటిస్తూ తెలుగు అంతర్జాల రంగంలో తమ కంటూ ఒక సుస్థిర స్థానాన్ని పొంది ఉన్న జ్యోతి గారి ఆలోచనకు రూపకల్పనే ఈ ‘అంతర్జాల అష్టావధానం’. అవధానం గ్రూపును తయారు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు.
తిరుపతి వాస్తవ్యులు మాడుగుల అనిల్ కుమార్ గారు ఈ మొట్టమొదటి అంతర్జాల అవధానం చేయడానికి అంగీకరించినందుకు సంతోషం.
అష్టావధానానికి ఎంచుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. కాని చాలావరకు అష్టావధానాలలో క్రింది అంశాలు ఉండడం సాధారణమైపోయింది. నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, వ్యస్తాక్షరి, వర్ణన, పురాణపఠనం, ఘంటా(పుష్ప)గణనం, అప్రస్తుతప్రశంస.
పై అంశాల్లో వ్యస్తాక్షరి, పురాణ పఠనం, ఘంటా(పుష్ప)గణనం ప్రత్యక్ష అవధానంలో ముఖాముఖిగానే సాధ్యమౌతాయి, శోభిస్తాయి. అందువల్ల నేటి అవధానంలో వాటి స్థానంలో సమస్యల, దత్తపదుల సంఖ్య పెరిగింది. ఈ విధమైన అంతర్జాల అవధానంలో ఇది మొదటి ప్రయత్నం కనుక ఈ సర్దుబాటు చేయవలసి వచ్చింది. మునుముందు ప్రత్యక్ష అంతర్జాల అవధానాలలో అన్ని హంగులూ, అంశాలూ ఉండే ప్రయత్నం చేద్దాం.

అవధానికి పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి శుభాశీస్సులు….

కవి శ్రీ మాడుగులాన్వయానిల కుమార్ కావించు నుత్సాహియై
యవధానమ్ము రసజ్ఞ రంజకముగా నంతర్మహాజాల వై
భవ సంరంభము వెల్గ నీకటుల సేవల్ చేయు విద్వన్మణిన్
భవదీయామృత దృష్టి ప్రోచుత సదా వాణీ! మనోహారిణీ!

పోచిరాజు సుబ్బారావు గారి శుభాకాంక్షలు….

స్తవనీయప్రతిభ మెఱయ
వివరించుచు  మాకు  నీవు  వేడుకతోడన్
నవ రస భరితముగా నీ
యవధానము  సేయు మయ్య ! యనిల కుమారా !

ఇక అవధాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?

ముందుగా నా పరిచయం…
ఈ అవధాన కార్యక్రమానికి నేను ‘మేనేజర్’నట! (అలా అని జ్యోతి గారు చెప్పారు)
38 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నాను. చెప్పుకోదగ్గ రచనలేవీ చేయలేదు. ‘శంకరాభరణం’ పేర బ్లాగు నిర్వహిస్తున్నాను.

Lanka Giridhar: 
సభకు నమస్కారం.నా పేరు గిరిధర్, ఇంటిపేరు లంక.సింగపూరు వాస్తవ్యుఁడను. భావజాలావిష్కృతి అను పేరిట ఒక బ్లాగు ఉన్నది కానీ, జన్మానికో శివరాత్రి అన్నట్టు వ్రాస్తూ ఉంటాను అక్కడ.పొద్దులో ఒక పద్యకథ వ్రాసాను. పుష్కరిణీ లో ప్రచురితమవుతున్న సనాతన శతకము వ్రాస్తున్నాను.ఇంతకు ముందు జాలకవిసభలలో పాల్గొన్న అనుభవం మెండుగా ఉన్నది.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

 

నన్ను రాంభట్ల పార్వతీశ్వర శర్మ అంటారు. నా వయసు  23 సం.లు ఇప్పటి వరకూ 26 అష్టావధానాలు గావించాను. ప్రస్తుతం ఆంధ్ర విశ్వకళాపరిషత్ లోతెలుగు శాఖలో పరిశోధన చేస్తున్నాను.

అప్రస్తుత ప్రసంగం:- చింతా రామ కృష్ణా రావు.

శ్రీ గురుదేవు రాఘవుల శ్రీచరణంబులు భక్తి మ్రొక్కి, స
ద్భోగిశయాను సంస్మరణ పూర్వక చిత్తుఁడనై, వధాన స
ద్యోగిఁ బ్రశంసఁ జేసి, శుభ యోగ ఫలంబుగ నిచ్చటుండి, నే
సాగెద, రామకృష్ణుఁడను జక్క నప్రస్తుత పృచ్ఛకుండనై.
సంపత్ కుమార్ శాస్త్రి
అవధానిగారికి, గురువుగారు శ్రీకందిశంకరయ్యగారికి, శ్రీచింతారామకృష్ణరావుగారికి మరియు ఇతరకవిమిత్రులకు,
భక్తిపూర్వక వినమ్రప్రణామములు.
నన్ను సంపత్ కుమార్ శాస్త్రి అంటారు.  వృత్తి రీత్యా హైదరాబాద్ వాస్తవ్యుణ్ణి. తెలుగుభాషాభిమానము మెండుగాకలవాణ్ణి.
మొట్టమొదటిసారిగా అవధానములో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను ఒకింత గర్వంగానూ కూదా ఉన్నది.
ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించిన గురువులు శ్రీకందిశంకరయ్యగారికి నమస్కారములు.

 

గోలి హనుమచ్చాస్త్రి:

అయ్యా! నా పేరు గోలి హనుమచ్చాస్త్రి. నేను గుంటూరు నివాసము ఉంటున్నాను. గృహనిర్మాణ సంస్థ లో సహాయక ఇంజనీరుగా పనిచేయు చున్నాను. చిన్నతనము నుండి పద్యములంటే ప్రీతి.అడపా దడపా గతములో అకాశవాణి సరసవినోదిని కి సమస్యాపూరణలు పంపేవాడిని.శ్రీ శాంకరార్యుల “బ్లాగు ”  పరిచయంతో వారి ప్రోత్సాహంతో ఇప్పటికి యేడెనిమిది వందల పూరణలు “శంకరాభరణం” లో చేయగలిగాను.ఈ కార్యక్రమములో దత్తపదిని ఇచ్చి పాల్గొనే భాగ్యం కలిగించిన మీ అందరకూ ధన్యవాదములు.నేను శ్రీ శంకరార్యుల స్ఫూర్తి తో “సమస్యలతో”రణం” (“పూ”రణం) మరియు కవి”అల” అలలు  అను బ్లాగులను నిర్వహించుచున్నాను.

 Dr. Madugula Anil Kumar: 

ఇక నిషిద్ధాక్షరి మొదలు పెట్టవచ్చు.

 

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: 

అవధాని గారూ…
నిషిద్ధాక్షరి అంశం:
“దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇవాళ మూల పూజ. కనుక ’దేవి’ని సరస్వతీ అవతారంలో స్తుతించండి.
కందంలో..
ప్రత్యక్షర నిషేధం చేయదలచానండి.
ప్రథమాక్షరం అందుకోండి.

’ ణ ’ కారం   నిషేధం 

Dr. Madugula Anil Kumar:

“వా”

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: 

’ వ ’ కారం   నిషేధం

Bhairavabhatla Kameswara Rao:

వాణిని తీసుకురాకుండా “ణా” నిషేధం చేసారు. బాగుంది!

 dr.madugulaanilkumar:  దే

Giri: వాణి నిషేధము కాబట్టి, వాగ్దేవి వస్తుందనుకున్నాను..కానీ అవధానిగారు మఱొక దారిలో వెళ్ళారు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

’ మ ’ కారం   నిషేధం

 Dr. Madugula Anil Kumar:  స్థా

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:
సంస్కృతం పట్టుకున్నారు. బావుంది.
’ ద ’ కారం   నిషేధం

Dr. Madugula Anil Kumar:  రా

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

” జ్ఞ ” కారం నిషేధం

Dr. Madugula Anil Kumar: మా

Bhairavabhatla Kameswara Rao: అద్భుతం! మొదటి పాదం పూర్తయ్యింది.

Goli Hanumath Shastri: అవధాని గారు చక్కగా పాదం మోపారు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: అభినందనలు. ప్రథమ పాదం పూర్తయింది. బావుంది. ధన్యవాదములు

Vaman Kumar: ప్రధమ పాదం అమోఘంగా పూర్తి అయ్యింది.

మొదటిపాదం: వా దే శ స్థా  రామా 

Dr. Anilkumar: దత్తపది

 

అప్రస్తుతం వారు ప్రస్తుతంలో ఉన్నారా ?
Chinta Ramakrishnarao: 

ఆర్యా!
అవధాన వేళలో మిము
వివశునిగా చేయు వనిత ప్రేమకు పాత్రం
బవనుందురొ? కాకుందురొ?
వివరింపుడు మాకు మీరు విజ్ఞత తోపన్.
అవధానుగారూ! అవధాన సమయంలో మిమ్ములను వివశులుగా చేసే వనిత యొక్క ప్రేమకు పాత్రమగుదునంటారా? అలా అవనంటారా? వివరించండి!
ప్రథమ దత్తపది గోలివారిది……

చేప – మేక – కోడి – పంది.

ఫై వాటితో మాంసాహారము కాకుండా శాకాహారము వండాలి. )

 పై పదాలను ఉపయోగిస్తూ ఆ యా అర్థములలో కాకుండా  శాకాహారము పై పద్యం.స్వేచ్చా చందము లో…

Kameswara Rao:  మొత్తానికి అవధానిగారి చేత వంటకూడా చేయిస్తున్నారన్న మాట! 🙂

Dr. Anil Kumar: చేపడితి నూనె గిన్నెను

Jyothi Valaboju:  ఏపాటు తప్పినా సాపాటు తప్పదుగా…:)

Dr. Anil Kumar: అందులోనూ నాకు ప్రావీణ్యం  ఉందండి

Goli Hanumath Sastry: పండుగ  కదండీ! మనకు (కను) విందు కోసం.

Chinta Ramakrishna Rao: మీ పని అది  కాదు కాదు మేలుగ గనినన్.

 Rambhatla: వంట బాగానే ప్రారంభించారు.

Vaman Kumar: వంట నేర్చువాడు నింట గెల్వగలడు

Dr. Anil Kumar: ఆ పని చేయింప నన్ను అదియే మేలౌ

Hanumath Sastry: అవధాని గారు వంటను చక్కగా “చేప” ట్టారు..

Kameswara Rao: చేపను చేతిలో పట్టేసారు! బాగుంది. గోలివారిచ్చిన దినుసులతో కంద వండుతున్నారన్నమాట! 🙂

 

Rambhatla: చేపడితి నూనె గిన్నెను

 

Kandi Sankaraiah: రెండవ దత్తపది సంపత్ కుమార్ శాస్త్రి గారు…

Chinta Ramakrishna Rao: 

అవధానిగారూ!
తల్లిని మించిన దైవము
ముల్లోకములందు లేదు, పూజింపు డటం
చెల్లరు పలుకుచు, సభలను
తల్లిని తలపక గురువును తలచుట తగునా?

 

 Hanumath Sastry: అయ్యా! చేప నూనె గిన్నెతో ఉన్నది. జారి పోకుండా చూడండి.

Sampath Kumar Sastry: సభకు నమస్కారం.

దత్తపది కి నేను ఇస్తున్న పదాలు…….
జయము, రయము, లయము, మయము,
రాయబారఘట్టములో శ్రీకృష్ణుని పలుకులు ( వీలైతే చంపకములో )

Chinta Ramakrishna Rao:

అవధానిగారూ!
పతికి వామభాగమునందు సతి వసించు.
పటములందున పరికింప నటులె యుండు.
ప్రభువు వేంకట నాయకు పటమునందు
నేల కుడివైపునుండెనల్మేలు మంగ?
Dr. Anil Kumar: అయ్యా ప్రింట్ మిస్టేక్
Dr. Anil Kumar (For Dattapadi):  చం. జయమగునే బలమ్మున ప్రశంశల నొందెడు పాండవేయులున్

 Kandi Sankaraiah: ఇప్పుడు లంకా గిరిధర్ గారు మొదటి సమస్యను ఇవ్వాలి. గిరిధర్ గారూ, ఉన్నారా?

 Chinta Ramakrishnarao: అడిగిన చెప్పక యుండుట

అడిగించుచు మురియుటకనొ ఆలస్యమనో?

Dr. Anil Kumar: జయమగునే బలమ్మున ప్రశంశల నొందెడు పాండవేయులున్

లంకా గిరిధర్ గారి సమస్య…..

‘సేదముఁ ద్రావినన్ దొలఁగు వేదన సాంత్వన నొందు చిత్తమున్.’

Rambhatla: అయ్యా.. సేదము అన్నది సమస్య ప్రారంభమా? టైపింగ్ పొరపాటా?

*వీక్షకులు క్షమించాలి… విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇబ్బందులవల్ల, ఇతరత్రా సంకేతిక కారణాలవల్ల కాస్త ఆలస్యమౌతోంది*

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!
అడిగిన చెప్పక యుండుట అడిగించుచు మురియుటకనొ ఆలస్యమనో?
Dr. Anil Kumar: అయ్యా మీరు మీసాలు దువ్వుకుంటూ ఎన్నైన అడుగుతారు. మీకు తప్ప అందరికీ టైపింగ్ సమస్య
ఏమండి “సేదము” నా “స్వేదము” నా త్వరగా చెప్పాలి!
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
మీసాలు దువ్వజూచిరి
ధ్యాసను నా పైన నిలిపి,యడిగిన దానిన్
మీసము లెవ్వరు చెప్పగ
ఆశించుతును మీసువాక్కులందుటకిపుడున్.

Kandi Sankaraiah: అది ‘స్వేదమే’ … టైపాటు మన్నించాలి.

Dr. Anil Kumar: ఆ దొర సాని చిక్కె హృదయమ్మును దోచుచు సందె వేళలో

Rambhatla Parvateeswara Sarma: 

మీ సము లెవ్వరు? చెప్పగ..చింతా వారు.. బావుంది

Chinta Ramakrishna Rao:

అవధానిగారూ!
నావైపిటు చూడండీ!
భావింపకనన్ను చెడుగ పరమ దయాళూ!
భక్త బంధువైన పరమేశుఁడా గొప్ప?

భక్త సులభయైన భవుని సతియ?
భక్తి కలుగు నాడు భగవంతుఁడే తోడు.
భక్తి దూరులకు విముక్తి యెట్లు?

 Dr. Anil Kumar: ఇవన్నీ ఆలోచిస్తే తెల్లారుతుందండి.

Kandi Sankaraiah:  రెండవ సమస్య పోచిరాజు సుబ్బారావు గారిది…
“కారు తిరిగె విచ్చలవిడి గగనమునందున్”

Dr. Anil Kumar: ఔరా ! సమస్య యే యిది

Kameswara Rao: చింతావారూ, అప్రస్తుతం మాట ఎలా ఉన్నా మీ ఆశువులు అత్యద్భుతంగా ఉన్నాయండీ!

Kandi Sankaraiah: ఆరంభ మ్మదిరెను పో

 

* Please refresh this page every 3-4 minutes to get the latest updates* 

Kandi Sankaraiah: భైరవభట్ల వారూ… ఇక మీ సమస్య.

మూడవ సమస్య భైరవభట్ల కామేశ్వర రావు గారిది…

వలలోఁ జిక్కెఁ గరీంద్రయూధము యశోభాతిన్ హరీంద్రమ్ముతో

 Dr. Anil Kumar: తలలో అంతర జాలమందు కవితాధారామృతం బల్లుచున్

Sampath Kumar Sastry: గోరంతలవింతలెల్ల గొప్పగచేయన్

Kameswara Rao Bhairavabhatla: అప్పుడే చిక్కు విప్పేసారే!

Sampath Kumar Sastry: అవధాని గారిని వలలో వేద్దామనే ఆలోచనా??

Goli Hanumath Sastry: అవధాని గారు “వల” కవ “తల” వెళ్ళారు….

Kandi Sankaraiah: ఇప్పుడు వర్ణనాంశం.. సనత్ శ్రీపతి గారు… ఉన్నారా?

వర్ణన అంశం సనత్ శ్రీపతి గారిది.. వారు తాము సమయానికి ఉంటానో లేదో అని ముందుగానే నాకు పంపారు. అది ఇది…..
“వనములే కరవౌతున్నవేళ వన్యప్రాణుల వెతలు తీర్చలేని వనరాజు (సింహం) వేదనను మహాస్రగ్ధరలో గానీ చక్కని ఎత్తుగీతి గల సీసంలో గాని వర్ణించండి”

 Chinta Ramakrishnarao: 

సంచిత సత్కవితాశ్రయ

మెంచుడు సద్గుణ వరేణ్య!ఇందరిలోన

న్నుంచిరినేనెట పోదును
దంచితమగు దీనివీడియసదృశప్రతిభా!
Dr. Anil Kumar: 
ఆఫ్రికా అడవులే అవని భారతికన్న

ఎంతైన మేలుగా వింత గాదె
సింహాసనమ్మందు శ్రీ దుర్గ అలరారె

చింతావారినుద్దేశించి: అబ్బే మీకున్న ప్రతిభ నాకెక్కడిది లెండి ( ప్రతిభ అనే అమ్మాయి మీకున్నదని)

ఇప్పుడు నిషిద్ధాక్షరి 2 వ పాదం  

Kameswara Rao: వాగ్దేవీపుత్రులందరకూ ప్రతిభా పుత్రికలుంటారు. అందుకు మీరూ మినహాయింపు కాదు అవధానిగారూ!

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!
మీ ప్రతిభ మీకు తెలియదు.
సప్రతిభులు మీరు కనగ సరస కవితలన్
అష్టావధాని” రాంభట్ల పార్వతీశ్వర శర్మ: ’వ’ కారం నిషేధం
Dr. Anil Kumar: మోద
Chinta Ramakrishnarao: 
ద్రోణ, భీష్మ, జయద్రధ, దాన కర్ణ,

ముఖ్య వీరులు కొందరు ముందుగానె
చంపఁబడినారు నాచేత. చంపుమింక
యనిన కృష్ణుని మాటల కర్థ మేమి?
Dr. Anil Kumar: అంతా  నేనే చేస్తాను. నాకు ఏమౌతుందో తెలుసు అని. అంతే  కాని కృష్ణుడంటే మీరు కాదు.

 Goli Hanumath Sastry:  అవధాని గారూ! శ్రీ రాంభట్ల వారు ప్రతిసారీ ___”కారం” నిషేధం అంటున్నారు.  నా వంటలో మాత్రం కారం ఉండేట్లు చూడండి..

Dr. Anil Kumar: మీ కిమ్కేమి కావాలి ఆకలా ఉప్పు కారమా

“అష్టావధాని” రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  “ప” కారం నిషేధం

Chinta Ramakrishnarao: మీ ధర్మమా అని ఉపకారాన్ని మాత్రం నిషేధించ లేదు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  అవధాని గారు మోద  తర్వాత ఏమైన చెప్పారా?

Dr. Anil Kumar: ద  చెప్పానుగా, తరువాత “క”

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: సరే… మీ ఇచ్ఛకు తరువాతి అక్షరం విడిచిపెడుతున్నాను

Dr. Anil Kumar: మ్రా

Chinta Ramakrishnarao:  

అవధాని యెదను నిలిచిన సువిధేయులు ధన్యులిలనుశోభిలుదురిటన్.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: మరల మీ ఇచ్ఛకు తరువాతి అక్షరం విడిచిపెడుతున్నాను

Dr. Anil Kumar: స్య

Kameswara Rao: ఎక్కడో తప్పినట్టుంది. “మోద కమ్రాస్య”? “క” గురువవుతుంది కదా?

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: ” న ” కారం నిషేధం

Sri Raghava Kiran Mukku: 

 కవనములో మునిగిన నిక నవధానికి మిగిలినయవి యప్రస్తుతమౌన్ 🙂
Dr. Anil Kumar: మోదదకమ్రాస్య
Chinta Ramakrishnarao: 
అవధాని యెదను నిలిచిన
సువిధేయులు ధన్యులిలనుశోభిలుదురిటన్.
భవదీయ సుదశ కలిగిన
యవధానియు నన్ను చూచిహాయి గొలపరే.
Dr. Anil Kumar: బ్రో
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: చ కారం నిషేధం
Dr. Anil Kumar: పూ
కంది శంకరయ్య:  ఆసక్తికరంగా సాగుతున్నది నిషిద్ధాక్షరి… పృచ్ఛకులు, అవధానులు ఎదురెదురుగా కత్తులు దూసి నిలుచున్నారు.
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: యతి తర్వాత  ” జ ” కారం నిషేధం
Dr. Anil Kumar: తా
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: మమ్మల్ని మీరే నిబెట్టారండీ..!
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
పండుకొనిబెట్టయత్నించు నిండు హృదయ!
పండితాళికి మధ్య నే పండుకొనిన
దండనముసేయకుందురో? దయన కనుచు
నిండు మదితోడ చెప్పడు నేర్పు మీర.
రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  చాలా “పవిత్రంగా” పూత పూశారు.  “మ” కారం నిషేధం
goli hanumath sastry: అయ్యా ! ఇద్దరూ కలసి కవితా సేద్యాన్ని పండిస్తున్నారు.
సంపత్ కుమార్ శాస్త్రి: ఇంతవరకు వచ్చిన పాదము ఇదేనాండీ…… “మోదదకమ్రాశ్యబ్రోవపూతా”
Dr. Anil Kumar: వాక్
Sri Raghava Kiran Mukku: సంపత్ గారూ, ఔనండీ. మీరు అవధానిగారిచేత ఇప్పుడే ధారణ చేయించేసేలా ఉన్నారు. 🙂
రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  సంపత్ కుమార్  శాస్త్రి   గారూ…. మీరు అలా అందించ కూడదు. ఇక ధారణ అంశానికి ప్రయోజనమ్ ఉండదు.
సంపత్ కుమార్ శాస్త్రి: పదాలు అనే కత్తులు తరిగిపోతున్నా యుద్ధము మాత్రము ఆగడములేదు…. చాలా ఆసక్తికరంగా ఉంది.
goli hanumath sastry: అయ్యా ! నా వంట మాడు తున్నదేమో చూశారా!…
రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  “ద” కారం నిషేధం
Dr. Anil Kumar: మా
సంపత్ కుమార్ శాస్త్రి: హనుమచ్చాస్త్రిగారు,  మీ వంటకు కావలసిన వేడిని నిషిద్ధాక్షరినుంచి తెస్తున్నారుగా…..
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: వాజ్మా … అని అనునాసికం చేస్తారా అవధాని గారూ?
Dr. Anil Kumar: నిషిద్ధాక్షరి 2 వ పాదం అయిపొయింది
Dr. Anil Kumar: దత్తపది 2 వ పాదం   వేపుడున మమేకమౌచు వేయించితి గా
Kameswara Rao:  భలే! వంటలో బాగా మమేకమవుతున్నారు. 🙂
Chinta Ramakrishnarao: 

అవధానిగారూ!
ఒక్కని చేసి మిమ్ములనకుంఠితరీతిని ప్రశ్న చేయుచున్
జిక్కని పద్య భావముల శీఘ్ర గతిన్ వచియింప కోరు బల్
చక్కని యూహపుట్టినది సద్గుణ సన్నుత జ్యోతి మాతకు?
నిక్కము చెప్పుడయ్య మహనీయ! మనంబున కందుచుండిరో?
Dr. Anil Kumar: 2వ దత్తపది

రయమున యుద్ధ రంగమున ప్రాణము దీతురు మీరలెల్లరున్ 
1 వ సమస్య 2 వ పాదం 

మొదమోసంగునట్లుగ విభూతి నొసంగి వధాన సత్క్రియన్   
Kameswara Rao: చాలా బాగుంది! రాంభట్లవారన్న త్రోవ తొక్కలేదీ సమస్యకి!
Dr. Anil Kumar: 

2వ సమస్య 2 వ పాదం
ఆ రాముని ధర్మపత్నిఅపహరణముకై
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
అప్రస్తుతమిది యనుచు
నా ప్రశ్నలు వినరొ మీరు.నాపై కినుకో?
నాప్రార్థన మన్నింపుడు
నాప్రశ్నలు కూడ కనుడు నలుగురు మెచ్చన్.
Dr. Anil Kumar: 
3 వ సమస్య 2 వ పాదం
కలలో నూహల జేయునట్టి గతులన్ కాంక్షింపగా  పృచ్ఛకుల్
కంది శంకరయ్య: ఇక వర్ణన…
Dr. Anil Kumar: 
కాని కాననమున కనగ రాదు
చెట్లన్ని గూల్చుచున్ కట్టిరి మేడలన్
మేమెట్లు  జీవించి మెలగవలయు
నిషిద్ధాక్షరి 3 వ పాదం?
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
శంకరార్య మనసు శంకతో  కూడె. నా
వంకచూడకుండ వరల నెంచె.
ఇంక నన్ను గాంచ నెవరు కల్గిరి సభ.
శంక బాపుడయ్య. సరస హృదయ.
కంది శంకరయ్య: రాంభట్ల వారూ, ప్రత్యక్షర నిషేధమన్నారు. ఇంకా కొనసాగిస్తారా? మిగితా పాదాలు కొనసాగిస్తారా?
Dr. Anil Kumar: నిషి ద్దం చేస్తారా
Rambhatla: మీ అభిమతానుసారమే నా అడుగు. ఇంకా అడుగుదాం అనుకొంటున్నా. సరే మిగిలిన రెండు పాదాలలో     ఏవైనా చెరొక అక్షరం చెబుతాను. అవి రాకుండా ఆ రెండు పాదాలు చెప్పేస్తే బావుంటుంది. ఏమంటారు?
Dr. Anil Kumar: ఈ రూల్ ఎక్కడ లేదండి.
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
ప్రస్తుతమగు నప్రస్తుత
నిస్తేజము చూడమనసు నీరగు చుండెన్.
పుస్తిని కట్టిన భార్యకు
నప్రస్తుత పృచ్చకునకునన్యాయంబా?
Kandi Sankaraiah: 
సుంతైన పలుక రేమని
చింతావారికి కలిగెను చింతయె సభలో
వంతను దీర్చగ వేడెద
సంతసము నిడగ సభికుల సద్వాక్యములన్.
Dr. Anil Kumar: విడాకులే ? మీకా
Kameswara Rao: చింతావారూ, మీరు అప్రస్తుతానికి బదులు ఛందోభాషణం చేస్తూంటే అవధానివారు అలగరూ మరి! 🙂
VAMAN KUMAR:  సాహిత్యంలో పడి గడియారమే చూసుకోలేదుసుమ్మీ
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: ఆర్యా… నిషేధాక్షారి లో ఇలాంటివి నేను ఎన్నో ఎదుర్కొన్న అనుభవంతో అడగబూనాను. సరే. నిర్వాహకులు ఎలా అంటే అలాగే.
Dr. Anil Kumar: శంకరయ్యగారినుద్దేశించి: అయ్యా ఇది మయ సభ కాదు, ఆయన దుర్య్పోధనుడు  కాదు.
Vaman Kumar:
చింతా వారి ప్రయత్నము
ఎంతో ప్రశంసనీయమీదినము కదా.
ఎంతైనా(సుంతైనా) కవిమిత్రులు
చింతించుట యవసరంబు చిత్తముతోడన్.
రాంభట్ల పార్వతీశ్వర శర్మ: సరే.. మీ స్వేచ్ఛ… కానివ్వండి. 3, 4, పూర్తి చేయాల్సిందిగా మనవి.
సంపత్ కుమార్ శాస్త్రి: మీయొక్క నిర్ణయము??
Chinta Ramakrishnarao: 
శంకరార్యా!
అవధాని పలుక వలెనుగ?
సవిధంబుగ నుత్తరువుల జాలము నందున్
జవనాశ్వము పరుగుపగిది
నవనవ సత్కవితలల్లి నను గన వలెగా.
Dr. Anil Kumar: 
తా దయ జూపన్ వలె నీ

పాదాబ్జంబుల పూజ జేతు భారతి భక్తిన్
Kameswara rao: చివరిపాదం మరోసారి చూడండి.
Chinta Ramakrisharao: పాదాబ్జము పూజ సేతు
Sri Raghava Kiran Mukku:  రామకృష్ణ పెదనాన్నగారూ, ఐనా… అవధానమున నిషేధము కవనంబునకే పరిమితకార్యంబు కదా. 🙂 పాదంబుల అన్నా సరిపోతుంది.
Chinta Ramakrishnarao: నిజమే రాఘవా! ఐతే నాకు సందేహం రావడంలో గల ఔచిత్యాన్ని గమనించలేకపోతావా నువ్వు.
Dr. Anil Kumar: 
1 వ దత్తపది 3 వ పాదం , 4 పాదం
రూపొందె పకోడియొకటి
ఆపందినుసులు వదలుచు అన్యములెపుడున్ ll
Vaman Kumar:  అవునండీ. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి.
Chinta Ramakrishnarao: 
ఆర్యా! రాంభట్లవారూ! కొంపతీసి మీరుకానీ అప్రస్తుత ప్రసంగం నిషేధం అన్నారా  ఏమిటి?
నన్ను అవధానిగారు పూర్తిగ నిషేధించేసారు?
Dr. Anil Kumar: 2 వ దత్తపది 3,4 పాదము 
లయమగునట్లు గాకయె తలంపగ సఖ్యత చూపగా దగున్
నియమితుడైతి చిన్మయ మునిన్ అనె కృష్ణుడు రాయబారమున్
రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  ఆయన నన్నే నిషేధించి నట్టునారు చింతావారూ….  ప్రస్తుతానికే లేదు… అప్రస్తుతం కూడానా మాస్టారూ…
VAMAN KUMAR:  2వ దత్తపది, నాల్గవ పాదంలో మయము అనే పదం వాడవలసి ఉన్నది. నియమ అనే పదం వాడబడింది.
సంపత్ కుమార్ శాస్త్రి:  మయము ను చిన్మయముగా పూరించిన విధము శ్లాఘనీయము.
VAMAN KUMAR:  సంపత్ కుమార్ గారికి ధన్యవాదములు. నాదే పొరపాటు
Chinta Ramakrishnarao: 
అవధానిగారూ!
మహిత రక్తవర్ణ, మాంసనిష్ట, గుడాన్న
ప్రీతి మానసయని ప్రేమ కొలిచి
దుర్గ పూజ సేయుదురుకదా! మహితాత్మ!
మాంస నిష్ట యగునె మాత దుర్గ?
ఆర్యా! దుర్గాంబను రక్త వర్ణ యని, మాంస నిష్ట యని, గుడాన్న ప్రీతి మానస యని పిలుచుచు పూజింతురు.
జగదంబయైన దుర్గ మాంస నిష్టయా? వివరించ గలరు.
Dr. Anil Kumar: 
సమస్య 3, 4 పాదాలు
ఆ దొరసాని చిక్కె హృదయంబుల దోచుచు సందె వేళలో
  మోద మొసంగునట్లుగ విభూతినొసంగి వధాన సత్క్రియన్
ఔ దలపోయగా అమృత మౌ కవితా ఝరియుక్త సీమలో
స్వేదము ద్రావినన్ దొలగు వేదన సాంత్వన నొందు చిత్తమున్ 
2 వ సమస్య:

చేరిన రావణు  దురహం
కారు తిరిగె విచ్చలవిడి గగనము నందున్
Sri Raghava Kiran Mukku:  అవధానిగారూ, మన్నించాలి, మీరెక్కడ పుష్పకాన్ని కారంటారో అనుకున్నాను… రావణదురహంకారుణ్ణి చూపించారు, భళా. 🙂
Dr Anil Kumar: 

3 వ సమస్య 3 వ పాదం
కలలో నూహల జేయనట్టి గతులన్ కాంక్షింపగా పృచ్ఛకుల్
3 వ సమస్య 4 వ పాదం

గలరే వచ్చిరి కీర్తి చంద్రికల సాకారంబునం గూర్చ నా
Kameswara Rao:  బాగుందండి. మొత్తానికి నా ఊహని కలగా మిగ్లేసారన్న మాట 🙂
Chinta Ramakrishnarao: 
కంది వదాన్యుల గురుతర
సుందర సద్వచనమధువు శోభిల జేయన్
బంధుర కవితా ప్రతిభుల
మందిరమిదియగుట నిచట మాన్యుడనయితిన్.
Dr. Anil Kumar: 
వర్ణన

అనుచు దలచుచుండె నా జంతు రాజులున్ 
భారతోర్వి ప్రజలు మారరేమొ
ఆ.వె. వనవిహార మౌనె వసుధా క్రమణ మున్
         చాల దాయె  జనులు శక్తి మీర
         జంతు రక్షణమ్ము కొంతైన చేయరా
         అవని విభులు నౌర  అచ్చె రువగు
Kameswara Rao:  బాగుందండి. ఒకసారి అన్నీ ధారణ చేస్తారా. అవధానం సంపూర్ణమవుతుంది.
సంపత్ కుమార్ శాస్త్రి:  అలవోకగా పద్యరచన చేయడములో శ్రీ చింతా వారిది అందెవేసిన చేయి. సుందరపదబంధములతో పాదములబంధములను సృష్టించడములో వారికి వారేసాటి.
VAMAN KUMAR: అసలు చింతా వారిది అప్రస్తుతం కానే కాదు. వారు మరొక అవధాని.
అనిల కుమారుండిచ్చట

ఘనముగ యవధానమందు కవుల సమస్యల్
మనసుకు నచ్చెడు రీతిన
వినిపించెన్ పూర్తి జేసి వినయము తోడన్.
Dr Anil Kumar:  ఆర్యా ధారణ చేయాలంటే నా  కంప్యుటర్ టైప్ చేయడా నికి చాలడం లేదు.
Chinta Ramakrishnarao: 
ఆర్యులారా!

జన్మ ధన్యమయ్యె. చరితార్ధునైతిని
సద్వధానప్రతిభు సరసనుండి.
జ్యోతి గారి కృషికి జోహారు. మా కంది
శంకరయ్యగార్కి సద్వినుతులు.
పృచ్ఛకాళికెల్ల, విద్వాంసులకునెల్ల,
పాఠకాళికెల్ల వందనములు.
మాడుగులసునీలు మహితావధానికి
ధన్యవాదములిడి, తలతు శుభము.
కంది శంకరయ్య:  సరేలెండి.. ఇప్పుడు అన్ని పద్యాలు టైప్ చేయడం కష్టమే… ఎలాగూ రేపోమాపో మాలిక పత్రికలో ప్రకటిస్తారు కదా!
కవిమిత్రులారా, భాషాభిమానులారా,
ఈనాటి ఈ అంతర్జాల అష్టావధానం ఇంతటితో పూర్తయింది. ఇది మొదటి ప్రయత్నం కనుక కొన్ని లోపాలు కనిపించాయి. ఏది ఏమైనా అవధానం నిరాటకంగా సహృదయ మనోరంజకంగా కొనసాగింది.
ఈ అవధానం ఈ విధంగా విజయవంతం అయిందంటే ముఖ్యకారకురాలు జ్యోతి గారు. వారికి ధన్యవాదాలు.
తమ సర్వతోముఖ ప్రతిభతో సమర్థవంతంగా అవధానాన్ని పూర్తిచేసి, అందరినీ అలరించిన అవధాని మాడుగుల అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు.
పృచ్ఛకులుగా పాల్గొన్న అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, చింతా రామకృష్ణారావు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, లంకా గిరిధర్ గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సనత్ శ్రీపతి గారికి ధన్యవాదాలు.
అతిథులుగా మధ్య మధ్య తమ వ్యాఖ్యలందించిన వామన్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, భరద్వాజ గారికి ధన్యవాదాలు.
ప్రత్యక్ష అవధానంలో పాల్గొనకపోయినా ఆశీస్సులను, శుభాకాంక్షలను తెలిపిన పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సుబ్బారావు గారికి, నేదునూరి రాజేశ్వరి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారి సందేశము…అంతర్జాలమునుండి మాడ్గులకవీ! యష్టావధానంబు మీ
రెంతో చక్కగ జేయుచుండిరి భళీ! యీ కార్య మాంధ్రావనిన్
సంతోషంబిక నందజేయగలదో సన్మానపాత్రా! యశ:
కాంతాసంగతి మీకు గల్గు ననిలాఖ్యా! సర్వసౌఖ్యంబులున్.శుభమస్తు!

మాలిక బృందం నుండి:ఈ అవధానాన్ని నిర్వహించినవారికి, పాల్గొన్నవారికి, అవధానిగారికి, వీక్షకులకు, ఇతరత్రా ప్రోత్సాహం అందించినవారికి మన:పూర్వక కృతజ్ఞతలు.
ఈ అవధానాన్ని గురించి ఇందులోని రసవత్తర ఘట్టాల గురించి నాలుగయిదురోజుల్లో ఒక సంపూర్ణమైన టపా ప్రచురిస్తాం.

41 thoughts on “అవధాన పుట

  1. ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
    భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
    ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
    గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!
    pai padyam yokka bhavam vivarimchagalarani prardhana

  2. చేరిన రావణు దురహం
    కారు తిరిగె విచ్చలవిడి గగనము నందున్
    ——————–
    కారు ని దురహంకారు చెయ్యటం బాగుంది.

  3. కవితా ఝరి యుక్త సీమలో స్వేదము త్రావుట …ఆహా ఏమి ఊహ
    అనిల్ గారు అభినందనలు

  4. అయ్యో, నిషిద్ధాక్షరి మూడో పాదం కూడా నడిపించండి, కావాలంటే సమస్యలు ముందస్తుగా పూర్తిచేయవచ్చు.

  5. నాకు చిరకాలంగా ఉదయంపూట అవధానం పెడితే బాగుండుననిపించేది. ఈ రోజు మీ రాత్రి – మా పగలు తో ఆ కోరిక తీరుతోంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.

  6. జ్యోతిగారి ఎత్తిపొడుపు (కొడుకులు వంశోద్ధారకులు…) మా ఇంట్లో రోజూ వింటున్న మాటే!

    1. చంద్రశేఖర్ గారు ఎత్తపొడుపు కాదండి. చాలామంది ఇళ్లల్లో వింటున్న మాట. నేను మాత్రం అమ్మాయి, అబ్బాయి ఇధ్దరూ సమానమే అంటాను.చదువైనా, పెళ్లైనా తర్వాత వారి ఖర్మ..మన ప్రాప్తం..

  7. మాస్టారూ, మరి ఇద్దరు అవధానులు పోటా పోటీ పడుతున్నారు. ఆ మాత్రం రంజుగా లేకపోతే యెలా! నేను మాత్రం ఆ బిగి పోటీని ఆనందిస్తున్నాను ప్రేక్షకుడిగా 🙂

  8. ముక్కు వారుకూడా చేరారంటే అంతా సంస్కృతమే! నిషిద్ధాక్షరి కందం మరి అందులోనేగా నడుస్తోంది.

  9. చింతా గారు <>
    భలే అడిగారు సుమండి …ఆ కారం పొతే హాహాకారాలే ..ఇంక

  10. చంద్రశేఖర్‌గారు, నేను నిరూపించడమెందుకండీ. అది జగమెరిగిన సత్యం! 🙂

      1. పుత్రులు అయితే గియితే ఒక వంశాన్నే ఉద్ధరిస్తారు. పుత్రికలైతే రెండు వంశాలను ఉద్ధరిస్తారు!
        ఇక పున్నామ నరకం అనేది, భూలోకంలో నరకం తెలియని రోజుల్లో చెప్పిన విషయం. ఇప్పుడది వర్తించదు 🙂

  11. అయ్యా! కప్పగంతువారింటికి పిల్లనిచ్చాక ఆ మాత్రం ఎద్దేవా చేయకపోతే మమ్మల్నిబ్రతక నిస్తారా!

  12. మన దేశంలో రాణూలే రాజులు కదా 1969 నుంచి కూడా

  13. పనిలో పని భైరవభట్ల వారు పుత్రికలున్న వారే గొప్ప అని నిరూపించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. పుత్రులేఉన్నవారు రాజులని పుట్టిస్తారు, పుత్రికలున్నవారు రాణులను పుట్టిస్తారు అనుకొందాం 🙂

  14. జ్యోతిగారూ, ధన్యవాదాలు.

    పొద్దున్న ఈ విన్నూత్నమైన అవధాన ప్రక్రియ గురించి చదువుతున్నప్పుడు శ్రోతలు, ప్రేక్షకుల నుంచి కూడా ప్రశ్నలు తీసుకుంటారాని చూసిన గుర్తు.

    1. మీ ప్రశ్న చింతా రామకృష్ణగారికి పంపించాను. ఆయన అప్రస్తుతంలో చేరుస్తారో లేదో చూద్దాం ఎందుకంటే ఆయన హైదరాబాదులో లేరు.

  15. @ఛంద్రశెఖర్
    ఒక అసందర్భ ప్రలాపానికి మరొకరి తోడుయా. ఏమీ విచిత్రమీనాడు. అప్రస్తుత ప్రసంగ కర్తనే ఎద్దేవా చేయుటా ఏమిది చంద్రశేఖరా.

  16. తెలుగింటి వదానమ్మును
    వెలిగించిరి జాల గగన వేదిక నిండన్
    తెలివైన యువతరానికి
    విలువౌ వేల లేని కాన్క విను కేఎస్వీ

  17. కప్పగంతువారు మొత్తానికి కప్పగంతులేస్తున్నారు:-) మీ చంద్రశేఖర్ -USA

  18. అప్రస్తుత ప్రసంగానికి తప్ప నేను పాల్గొనేంత వాణ్ణి కాదు. ఆ శాఖలో దయచేసి నా ప్రశ్న అవధానిగారికి ఇవ్వ గలరు.

    ఇక్ అమాష్టారికి పిల్లలు పెట్టిన నిక్ నేం “సోడాబుడ్డి” క్లాసులో పిల్లలను మాట్లాడవద్దని ఇస్ ఇస్ అంటూ ఉంటాడని. ఇది తామరతంపరగా పాకిపోయి పిల్లలు ఆ సంవత్సరం బాచే కాక ఆతరువాత బాచ్ కూడా ఆయన కనిపిస్తే చాలు సోడాబుడ్డి రూపవిశేషాలు, శబ్దాలు రకరకాలుగా చెయ్యటం చేశారు. ఇలా దశాబ్దం జరిగింది. ఒకరోజు ఇంట్లో భార్యతో గొడవపడుతూ, భార్యను “ఇస్” అన్నాడు. ఆవిడకి నషాళానికి అంటి “సోడాబుడ్డీ”అనేసింది.

    ఈ సంఘటన పూర్వా పరాలు, భార్య కూడా తనను సోడాబుడ్డీ అనేప్పటికి ఆ మాష్టారికి కలిగిన కోపం, బాధ, తదితర భావోద్రేకం మొత్తం కలిపి, ఈ కింది పద్య రీతిలో చెబుతారని నా ఆశ.

    ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
    భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
    ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
    గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!

    కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
    ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
    కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
    ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

    1. శివరామప్రసాదుగారు. ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబిచ్చే రూల్ లేదన్నారు అవధానిగారు. ఒకసారి ఆయన్ని లైవ్ లో తీసుకుని అవధానం కాకుండా సమస్యాపూరణం చేద్దాం.. ఆయనకు మీ కోరిక మెయిల్ చేస్తాను..

  19. భక్తి దూరులకు విముక్తి యెట్లు?
    దీన్నే కొద్దిగా మార్పుతో

    భక్తి దూరులకు ముక్తేల అదన్నయే వైముఖ్యమే అకటా

    సరదాగా వ్రాస్తున్నాను అన్యధా భావించరు కదూ

  20. “మీ సము లెవ్వరు”

    మీ సములెవ్వరు అనే కదా మీసములు దువ్వుట ఔరా! మీ సములెవ్వరు పద విభజన చేసి కొత్త అర్ధం. బాగున్నది మాష్టారూ.

  21. ఇప్పుడే వచ్చాను. అవధానం బాగా జరుగుతున్నది

  22. శ్రీచింతా వారు మీసాల కృష్ణుడండీ! జాగ్రత్త సుమా!:-)

  23. చింతా వారి అప్రస్తుతం బహు పసందుగా విజ్ఞానప్రదాయకంగా ఉంది. పద్యరూపంలో అప్రస్తుతం మెదటిసారి చూడటం. వారి నేర్పు ప్రశంసనీయం. అవధానిగారు పద్యరూపంలో సమాధానం ఇస్తారేమో చూడాలి.

  24. fantastic…first of all ee prakriya yokka goppatanam … (very unique and not seen/heard anywhere else in the world in any other language) … then to post it live .. too two good …

  25. Feedback: శ కారం తప్పిపోయిందండీ. ధన్యవాదాలు. పేజీ రిఫ్రెష్ చేయకుండా కొత్త కంటెంట్ కనిపించటంలేదు, ఆటోరేఫ్రేష్ ఆన్ చేయాలేమో!

  26. The event itself is happening online. Participants are distributed across various countries 🙂

  27. పాదం పూర్తి అవగానే మొత్తం పాదం ఒకసారి టైప్ చేయమని మనవి. ప్రేక్షకునిగా
    నాకు ఒక అక్షరం కనిపించటం లేదు.

    మొదటిపాదం: వా దే శ స్థా రామా

Leave a Reply to venkat hemadri Cancel reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238

Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238