April 17, 2024

కుబేరుడు

రచన: రసజ్ఞ సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని […]

మూడవ కన్ను ఒక అంతర్నేత్రం

రచన: ఉమదేవి పోచంపల్లి మనోభావాలను గమనిస్తూ జీవన్మార్గాన్ని బోధిస్తూ శాంతితో విశ్రమిస్తూ సమాధి లాంటి ఏకాగ్రతలో సుషుప్తిలో ఉందో? తట్టి లేపకు లేచిందో నిద్రాణమైన త్రినేత్రం లోంచి ప్రజ్వరిల్లే భానురేఖలు భాసిల్లుతూ ప్రచండ తీవ్రత తో మండే గుండెల చప్పుడు ఇంధనాలతో శతసహస్ర సూర్యుల కాంతిరేఖలు ప్రసరిస్తూ, శక్తినంత క్రోడీకరించి అసభ్యతను, అన్యాయాన్ని నిస్సహాయులపై దౌర్జన్యాన్ని, దళారీతనాన్ని, కటిక దౌర్భాగ్యాన్ని తుత్తునియలు చేసి, భస్మీపటలమ్ చేసి బ్రతుకు భారాన్ని తగ్గించే బంగారు క్షణాలు అతి దగ్గరలోనే అనంతమైన […]

పదచంద్రిక – 8, రూ. 1000 ల బహుమతి

కూర్పరి : సత్యసాయి కొవ్వలి..   సత్యసాయి కొవ్వలి గారు కూర్చిన ఈ  పదచంద్రిక  సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా:  editor@maalika.org  .. సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి 20     ఆధారాలు […]

మానస సరోవరము మరియి కైలాస పర్వత యాత్ర

 రచన: ఇమడాబత్తుని వెంకటేశ్వర రావు                                                                                                                        2006 జున్ నెలలో ఉద్యోగమునుంచి రిటైరు అయ్యాను. ఉద్యోగము చేసే రోజుల్లో విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దొరికే సెలవులు తక్కువ గనుక, నచ్చిన యాత్రలకు 2006 నుండి ప్రతి సంవత్సరము ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్నాము. నా శ్రీమతి అంజలి కూడా రిటైరు అవడము మూలంగా ఇద్దరికి యాత్రలకు వెళ్ళడానికి బాగా కుదిరింది. ఆస్త్రేలియా, స్కాట్లండు, మరియి ఈజిప్టు దేశాలు ముందుగా దర్శించిన తరువాత పుణ్య తీర్ధాలు, దేవాలయాలు, […]

” చాకలి తిప్పడు ” ( ఏకపాత్రాభినయం )

రచన : శర్మ జి ఎస్ లచ్చా , లచ్చా, ఓ లచ్చా, నా అబ్బడాల సుబ్బలచ్చా , నానొచ్చా, తొరగా రాయే ……. . ఏటే ఎంతకీ రాయేటే , ఓ ! అదా యిసయం , నానొచ్చే  ఏలకి మోటుగుంటే బాగుండదని , నీటుగ అద్దంలోనికి  సూత్తూ, సాటుగ బొట్టూ  కాటుకెట్టుకుంటున్నావంటే. మనం మనం ఒకటే గదంటే, నాకాడ నీకు సోకేటే ? అయినా , నీ సోకు నాకు తెల్వదేటే ? లచ్చ్క్హా […]

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ— సంబోధనా ప్రథమా విభక్తి…..

రచన: పద్మ పోడూరి రఘు నుంచి మెయిల్ వచ్చింది, దయచేసి నన్ను మీరు అని పిలవకండి అని. రఘు మా స్నేహితుని మేనల్లుడు. ఈ మధ్యనే పరిచయమయ్యాడు. నా మనసులో ఒక కొంటె ఆలోచన వచ్చింది. మళ్ళీ సారి కనిపించి నప్పుడు మా అమ్మలా, ఒరేయ్ అనిపిలిస్తే ఎలా వుంటుంది అతనికి అని ఆలోచించా.  చిన్నగా నవ్వుకున్నా. ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని అవడం వలన అంతా నువ్వు అనే అంటారు నన్ను. స్కూల్ లో అంతా నువ్వు […]

మంచి నడవడితో జీవించడం మనకు సాధ్యమేనా ?

రచన: G.V. సాయి భరద్వాజ్   పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…!   పదిమంది తన కొడుకును పొగుడుతుంటే  అప్పుడు తండ్రికి  పుత్రోత్సాహం కలుగుతుంది అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు.   అటువంటి కొడుకు మంచివాడే అవుతాడు. ఉదాహరణకు రాముడు లాగా అన్నమాట. అసలు మంచిగా ఉండడం అంటే ఏంటి అన్నవిషయానికి వస్తే , ఒకరి ప్రవర్తన పది మందికి ఆదర్శంగా ఉంది అంటే […]

‘భరతముని భూలోక పర్యటన’….

రచన: ఉమాభారతి త్రేతా యుగములో, నాలుగు వేదముల నుండి నాలుగు నాట్యాంగములను గ్రహించి,  బ్రహ్మదేవుడు ‘నాట్యవేదము’ నిర్మించెనని ‘నాట్యశాస్త్రము’ చెబుతుంది.  ఐదవ వేదంగా సృష్టించబడిన నాట్యశాస్త్రాన్ని  దేవతలతో పోరాడి శివుని అనుగ్రహంతో మానవకోటికి అందించిన వాడు భరతముని. ‘దుఃఖార్తానాం శ్రామార్తానాం శోకార్తానాం తపస్వినాం లోకోపదేశజననం కాలే నాట్య మేత ద్భవిష్యతి’ ‘నాట్యము’ ఉపదేశాత్మకమే  కాక,  హితమును, ధైర్యమును, క్రీడను, సుఖమును కూడా కలిగించుననీ, దుఃఖార్తులకు, శ్రమార్తులకు, శోకార్తులకు, దీనులకు, విశ్రాంతి కలిగించునని ‘నాట్యశాస్త్రము’ నందు సూచింపబడినది. ఇంకనూ, భావ రాగా తాళ సమ్మేళనమై, త్రైలోక్య అనుకరణమై, మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగింప జేసే నవరస భరితమయిన కళ, ‘నాట్యమే’ నని బ్రహ్మదేవునిచే వివరించబడినది. (నాట్యశాస్త్రము-నాట్యోత్పత్తి) *** పలు యుగాల అనంతరం, భూలోకాన మానవులు నాట్యవేదాన్ని ఎంత మాత్రం సద్వినియోగ […]