April 18, 2024

పదచంద్రిక – 8, రూ. 1000 ల బహుమతి

కూర్పరి : సత్యసాయి కొవ్వలి..

 

సత్యసాయి కొవ్వలి గారు కూర్చిన ఈ  పదచంద్రిక  సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా:  editor@maalika.org  ..

సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి 20

 

 

ఆధారాలు

అడ్డం

1. ఈయనకి జాలి ఎక్కువే. అందుకే పూవుల బదులు కూడా ఈయనే ఏడ్చేస్తాడు
4. కుక్క అరుపుతో మొదలయ్యే తిక్క తిక వాదం
9. పోయిన వాళ్ళకి అంజళి
11. ఎలుకలు చేసే చంద్రముఖి లకలకలు
12. తెలుగువారి వేసవి పానీయం
13. వంకకి ముందు పారేది
14. లక్ష్మే ఆమేరకి సందేహం లేదు
15. మా, మా, మా, మా,మా,……..మా
16. ఊచ/చువ్వ. మామూలుగా బహువచనంలోనే వాడుతాం.
18. అవును. తమిళమే
19. రవీంద్రుడి నవలానాయకుడు తెలుగింటి నాస్తికుడా
20. 38 అడ్డం ముందుపెడితే నీమొగుడే- త్రికసంధా, తిక్కసంధా
21. హరి, హరి. దాసుగారు పిలుస్తున్నారు… సంక్రాంతి రోజులు కదా
25. ముగ్గు కాదు. కానీ ఇలా చేయడమంటే దేన్నైనా ముగ్గులా పిండి చేయడమే
26. రౌడీయె కానీ బెంగాలీ అన్నయ్యే
28. గజం బట్టివ్వరా అంటే సగమే ఇచ్చాడు
30. చెల్లాయిది కాదులే
31. వసంత కూరా నారా కొనడానికిక్కడికే వెళ్ళింది మరి, వచ్చేస్తుంది
32. 26 అడ్డానికి స్త్రీ లింగమేంటి దీదీ.
33. అమ్మాయిలపై అత్యాచారాలింకానా ఇకపై చెల్లవని నినదించిన రాజధాని నడిబొడ్డిదే
35.కార్లూ, సైకిళ్ళూ నడిచేవి దీనిపైనే కానీ కొద్దిగా సాగింది
36. గోదావరి రాజులు చేసిన కాగితాలు ..  వీటిలో పడుచువి కూడా ఉంటాయని ఓకవిగారు సెలవిచ్చారు.. జాగ్రత్త. మడతనలక్కుండా తినండి
38. అవును. మ్మొగుడు. తికమకపెట్టి తిప్పలుపెడతాడు
39. పన్నీరు  — మసాలా … కారంగా ఉంటుందేమో
40. కొంప తర్వాత ఇదే. నా బాధ ఎవడైనా వింటాడా

నిలువు

2. ఇవేం సామెతలు కావు, బాధలు
3. డిసెంబరులో ఈయన జయంతి. లెక్కల పండుగన్న మాట
4. కుక్క అరుపున్నా కూడా భళీ అనిపించే రాగమే
5. ఎలుక కన్నం లభించు గాక
6. ఏరులేకపోయినా .—- సాగారో రన్నో చిన్నన్నా అని పాడుకోడం లో తప్పేముంది
7. ఏంటి పెళ్ళాం, నీ చెల్లెలు నన్ను చూడగానే కిందనించి పైదాకా మెలికలు తిరుగుతోంది, ఏంటి కథ
8. ముందునుండి పేసేరా నీ ఎంకమ్మా, వెనకనుండే, మేకలా మబ్బులా ఉంట
10, వేనిలా తాగినట్లు గాకాదు, 12 అడ్డం సాక్షిగా వాక్కులా తాగినట్లుగా
13. గడ్డి ఉంటే పశువులకి ఆహారం. లేకపోతే మనకి పోపుసామగ్రి
15. ఇలా పిలిస్తే శకునే వస్తాడు
17. చూడుమా ..పండగ మూడోరోజు సుమా
18.  కమలానికి సగం విందా
19. ఇలాంటివెన్ని ఉదంతాలైనా మోడీ మోళీ ముందు బలాదూరే
22. తెలుగువారికిదే పెద్ద విప్లవకర పండుగ
23. చలికి దగ్గు రాకుండా బొగ్గైనా సరే, ఇదైనా సరే
24. ఈవిడకి గోదావరితో పాశాలు లేవు. పాశురాల తోటే
27. ఏకాదశి వ్రతమహాత్యాన్ని రంభాపారవశ్యుడైన ఈరాజుకన్నా ఎవరు బాగా చెప్పగలరు
29. ఈకాలం వచ్చేకాలంకన్నా మేలట
30. మీరిలాంటి లుక్కేస్తే అదిరిపోక, మరేటి
32. ఇచ్చేవాడు
34. మురికివాడ కరోడ్‌పతి ఇచ్చిని నారా
35. చవి సారం లేకపోతే ఇలాగే ఏడుస్తుంది
36. పార్వతీపురం రాజావారు ఈపాటి చేయరా
37. నన్నేనా ఇలా పిలిచావు, నావిశ్వాసాన్ని గుర్తించావన్న మాట

 

8 thoughts on “పదచంద్రిక – 8, రూ. 1000 ల బహుమతి

    1. ప్రసాద్ గారు, మా పత్రికకు మీ రచన పంపవచ్చండి. ఎన్ని పేజీలు అనేదానికి ఒక లిమిట్ లేదు. మీ ఇష్టం.. ఇప్పటివరకైతే ఈ పదచంద్రిక తప్ప ఇతర రచనలకు పారితోషికం లేదండి..

  1. పదచంద్రిక విజీతల పేర్లు మాకు ఎలాగ తెలుస్తాయి??? దయచేసి e-mail లో పంపండి

  2. నమస్కారం. ఈ పదచంద్రిక ఎంతో బావుంది. కానీ మా సమాధానాలు ఈ గడులలో నింపటం ఎలాగో తెలియట్లేదు. లేఖినిలో రాసి ఇక్కడ పేస్ట్ చేద్దామంటే కూడా కుదరట్లేదు. మీరిచ్చిన ఆధారాల దగ్గరే మా సమాధానాలు రాసి పంపితే మీరు అంగీకరించే అవకాశం ఉంటే తెలియజెయ్యగలరు.

    విధేయుడు
    శాండిల్య

    1. శాండిల్యగారు మీరు సమాధానాలు నంబర్ల ప్రకారం రాసి మెయిల్ లో పంపండి.. ఈ గళ్లల్లో నింపడం కుదరదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238