March 28, 2023

బాలల కథా సాహిత్యంలో మానవతా విలువలు

రచన:   డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ ప్రతి మనిషి పుట్టింది మొదలు చనిపోయే వఱకు  సుఖంగానే ఉండాలనుకొంటాడు. సుఖంగా జీవించడానికి తక్కిన జీవులకన్న మనిషికే  ఎక్కువ అవకాశాలున్నాయి.  కానీ అజ్ఞానం వల్ల, అనుభవం లేమి వల్ల మనిషి చేజేతులా సుఖాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో మనిషిని బాల్యం నుండినే క్రమశిక్షణలో పెంచాల్సిన అవసరం చాల వుంది. మన సనాతన ధర్మాలను తెలుసుకొని మహాత్ముల జీవితాలను, సందేశాలను చదవడం చేత, సంస్కృతి పట్ల సదవగాహన కలిగియుండడం వల్ల […]

దార్శనికుడు – కవి

రచన : రవి ENV God is a God dammned word అంటాడు ఓషో. ’దేవుడు’ అన్న శబ్దం అంత తీవ్రంగా కలుషితమైపోయిందని ఆయన ఉవాచ. అవును మరి, ఎవరికి వారు ఆవిష్కరించుకోవలసిన సత్యాన్ని గురించి లక్ష మంది లక్ష రకాలుగా తమకు తోచినట్టు వివరిస్తూ పోతూ ఉంటే కలుషితం కాక మరేమవుతుంది? అలాంటిదే మరొక మాట ’ప్రేమ’. తెలుగు భాషలోనే కాదు ప్రపంచ భాషలన్నిటిలో ఇంత చెత్తపదం మరొకటి ఉండదు గాక ఉండదు. మన […]

ఇల్లెక్కడ?

రచన: గీత పసుపులేటి.. ఇప్పుడే తెలిసింది.. నా కడుపు కంటిలో ‘పాప’ కదిలినప్పుడే.. ఉదర్కపు ఉషోదయం నా ముందు నిలిచింది అమ్మా, నేను నెల తప్పాను.   నీ అరచేతి పొత్తిళ్ళలో కళ్ళు తెరిచిన నాకు నిన్నిప్పుడే చూడాలనిపిస్తోందమ్మా నన్ను పురుడు పోసుకున్న పుట్టింటనే నీకు అత్తిల్లయిన నా పుట్టింటనే నేను అమ్మను కావాలనుంది అమ్మా, నీ ఓడిలో వాలాలనుంది నాకైదు నెలలు నిండాయి   పుడమి నన్ను మోస్తున్నట్లు లేదు నేనే పుడమిని మోస్తున్నట్టుంది కడుపులో […]

|| శ్రీ లక్ష్మీ హృదయం ||

రచన: పద్మిని భావరాజు   శ్రీవిష్ణుహృత్కమలవాసిని, ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీలక్ష్మీదేవి, వైకుంఠంలో మహాలక్ష్మిగా, భూలోకంలో సస్య లక్ష్మిగా, స్వర్గలోకంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాల్లో రాజ్యలక్ష్మిగా, భక్తుల ఇళ్ళలో గృహలక్ష్మిగా, వివిధ రూపాలను ధరించి, ఈ సృష్ఠిలోని సకలప్రాణుల జీవితాలలో వెలుగులను వెదజల్లుతూ ఉంటుంది. ప్రకాశవంతంగా ఉండే అన్ని వస్తువులలో, శోభాయమానమయిన రూపంలొ విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే, పుణ్యం చేసిన వారికి కీర్తిరూపంలో, రాజుల్లో తేజస్సు రూపంలో, వైశ్యులలో వాణిజ్యరూపంలో, పాపాత్ముల ఇళ్ళలో కలహాలు, ద్వేషాల రూపంలొ, పరోపకార పరాయణుల్లో […]

మహాభాగ్యం

రచన: ఆదూరి హైమవతి ” బాబయ్యగారూ! మీ కారు క్షణంలో మెరిసిపోయేలా తుడుస్తాను, మీ బూట్లకు కొత్తవాటిలా పాలిష్ చేస్తాను ,ఒక్కపదిరూపాయలు ఇప్పించండి,నిన్నటినుండీ జబ్బుగాఉన్నఅమ్మ,చూపులేని తమ్ముడు , నడవలేని అక్కఆకలితో నీరసించి పోతున్నారు. కనికరించండి బాబయ్యా! ” అంటూ మండిపోయే ఎండలో కాళ్ళకు చెప్పులు కూడాలేకుండా, కారు దగ్గరకొచ్చి బ్రతిమాలాడు డాక్టర్ రామనాధాన్ని  పన్నెండేళ్ళ పిల్లవాడు. డాక్టర్ రామనాధం వింతగా  ఆ బాలుడికేసి చూసి ” ఏరా! కాళ్ళు కాలడం లేదా? అలా ఎండలో నిల్చున్నావ్ ?” […]

“బాకీ”

రచన : మంధా భానుమతి పాత ఆల్బంలు తిరగేస్తూ ఒక పేజీ దగ్గర ఆగిపోయాను. స్వరాజ్యందీ నాదీ ఫొటో చూసి. ఏనాటి మాట! యాభై ఏళ్లయినా నిన్న మొన్న జరిగినట్లుంది. నా పధ్నాలుగో పుట్టిన్రోజుకి అమ్మ ఇచ్చిన డబ్బుతో స్టూడియోకి వెళ్లి తీయించుకున్నది.. కోపంతో, ఏమీ చెయ్యలేని అసహాయతతో గుండె బరువెక్కిపోయి, అంత బరువు గుండే దడదడా కొట్టుకోవడం నాకు చాలా చిన్నప్పుడే.. అంటే పన్నెండేళ్ల వయసప్పుడే అనుభవంలోకి వచ్చింది. అదేవిధంగా ఉద్వేగంతో గుండె తేలికయిపోయి అసలు […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2012
M T W T F S S
« Oct   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31