June 19, 2024

చైతన్య స్రవంతి నవలలు – నవీన్ “అంపశయ్య”

రచన : పి.వి.లక్ష్మణరావు, తెలుగు ఉపన్యాసకులు, చైతన్యస్రవంతి శిల్పం గురించి మాట్లాడుకొనేటప్పుడు మనో వైజ్ఞానిక నవలల ప్రస్తావన కూడా వస్తుంది. ఇంతకీ మనోవైజ్ఞానిక రచనలు అంటే ఎలా ఉంటాయి? చైతన్యస్రవంతి శిల్పం అని దేన్ని అంటారు?, చైతన్య స్రవంతి శిల్పానికి ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు, వారు చెప్పిన లక్షణాలను తెలుసుకొని, అటు పిమ్మట ఈ చైతన్య స్రవంతి శిల్పంతో వచ్చిన ప్రముఖమైన నవలల్లో అంపశయ్య ఎలాంటి స్థానాన్ని పొందిందో విశ్లేషించడమే ప్రస్తుతాంశం. నవల ఏదైనా అందులో కొన్ని […]

విజయ చిత్రములు

రచన : జెజ్జాల కృష్ణ మోహన రావు   పరిచయం : ఈమారు చాంద్రమాన ఉగాది ఏప్రిల్ 11, 2013 తారీకు వస్తుంది.  ఉగాది అనే పేరు యుగపు ఆది నుండి పుట్టినది అంటారు.  ఇంటిలో కన్నడము మాట్లాడే మేము ఈ పండుగను యుగాది అనే పిలుస్తాము. ఈ ఉగాది పండుగ తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వాళ్లు, ఉత్తరదేశములో కొన్ని చోటులలో జరుపుకొంటారు. ఈ ఉగాది నాడు విజయ అనే కొత్త సంవత్సరము ఆరంభమవుతుంది.  మన హిందువుల […]

“వలస పోతేనేం.. విద్వత్తు ఉంటే!”

రచన : మంథా భానుమతి “కుమారయ్యా! కుమారయ్యా!” గుండీ నదీ తీరాన, మోకాలి లోతు నీళ్లల్లో కాళ్లు ముంచి కూర్చుని, ఆలోచనలో నిమగ్నుడైన కుమారయ్య తండ్రిగారి పిలుపు విని, పాదాలను నదీ ప్రవాహంలో నుంచి బైటికి తీసి నెమ్మదిగా లేచి నిలుచున్నాడు. చింతతో మ్లానమయిన వదనాన్ని, దాచే ప్రయత్నంలో.. తల వంచి, నడుంకి కట్టిన అంగ వస్త్రంతో నుదుటి మీది స్వేద బిందువులని తుడవ సాగాడు. సూక్ష్మగ్రాహి అయిన అభిమాన చంద్రుడు చెమ్మగిల్లిన తన కుమారుని కన్నులను, […]

నిఘంటువులు

రచన : రసజ్ఞ అన్నమయ్య కీర్తనలలోనూ, పంచ మహా కావ్యాలలోనూ, పురాణాది గ్రంధాలలోనూ అర్థ నిర్ణయం కాని దేశ్యపదాలు అసంఖ్యాకంగా వున్నాయి. ఆయా పదాలకు అర్థ నిర్ణయం చేయగల పండితుల సంఖ్య క్రమంగా మృగ్యమయిపోతోంది. ఒకప్పుడున్నన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు, కొన్ని పదాలు కాలగమనంలో రూపాంతరం చెందాయి. ఈ తరం పిల్లలకి కొన్ని అక్షరాలు కూడా తెలియవు (ఉదా: ఋ, ౠ, ఌ, ౡ, ఱ, మొ.,) అనటం అతిశయోక్తి కాదు. ఇదే విధంగా కొనసాగుతూ […]

ఆధునిక కవిత్వం – సామాజిక నేపథ్యం – భాషావికాసం

రచన : మాడుగుల గురునాధ శర్మ కవిత్వం… మౌనం నుంచి జనించి, మాటలలోని మాధుర్యాన్ని తెలిపి, ప్రతి హృదయాన్నీ తట్టి లేపి చివఱకు మౌనం వైపు ప్రయాణించేలా చేయగల అద్భుతమైన శక్తి. ఉదయం లేచినప్పటి నుండీ, విశ్రమించేవఱకూ మనమెన్ని మాటలు మాట్లాడినా కలగని అనుభూతి కవిత అనేసరికి కలుగుతుంది. కవిత అన్నా మాటలే కదా, ఏముంది తేడా? అనే సందేహం చాలామందికి కలుగవచ్చు. కవిత అంటే ముమ్మాటికీ మాటల మూటే. ఇంకా లోతుకు వెళితే మాటలకే అందని […]

ఈశాన్యంలో బరువు ఉండ కూడదు

రచన : టీవీయస్.శాస్త్రి ఈ మధ్య అన్ని మతాలవారు ఎక్కువగా మాట్లాడుతున్నది’వాస్తు’ను గురించి.జ్యోతిష్యం, వాస్తు పిచ్చి ఇప్పుడున్నంతగా — పూర్వం లేదు. మొన్న ఈ మధ్య ఒక వాస్తు సిద్ధాంతి గారి వద్దకు వేరే పని మీద వెళ్లాను. చాలామంది వరుసగా కుర్చీలలో, బల్లల మీద కూర్చొని ఉన్నారు.ఒక కుర్రవాడు వచ్చి నా పేరు, ఊరు వ్రాసుకొని, ఒక కాగితం ముక్క మీద నెంబర్ వేసి అది నాకిచ్చి కూర్చొనమని చెప్పాడు.’నాకు ఈ నెంబర్ ఎందుకు? సిద్ధాంతి […]

శ్రీమన్మహా భారతము – ఉద్యోగపర్వము -రాయబారములు

రచన: అవధాని రత్న డా.మాడుగుల అనిల్ కుమార్           మహావీరులైన పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్య వాసాన్ని  , ఒక  సంవత్సరమజ్ఞాత వాసాన్ని చేసి , ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవమును జరిపించి , వివాహమునకు వచ్చిన ద్రుపదుడు మున్నగు బంధువర్గంతో కూడ ఉపప్లావ్యంలో  నివసిస్తున్నారు. ఇప్పుడు రాజ్యాన్ని యుద్ధము వలననా ? లేక సంధితోనా ? ఎలా సంపాదించుకోవాలన్నదే పాండవుల సమస్య. పాండవులు యుద్ధ విముఖులు కారనునది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు నిదర్శనమేమంటే – 1. […]

” భార్యా భర్తల బంధం “

రచన : శర్మ జి ఎస్ పెళ్ళైన కొత్తలో తను  ఇంటికి కావలసినవి చెప్తుంటే ,  నాకన్నీ తెలుసును,  మా ఇంట్లో ఏది కావలసిన నేనే చూసే వాడినని అన్న వసంతరావు, నేడు నీ ఎం ఏ ఆలోచనల ముందు , నా బి ఏ ఆలోచనలే మూలకు, కనుక అన్ని విషయాలలో నీదే ఫైనల్ నిర్ణయం  అంటుంటే   ఆశ్ఛర్యపోతున్నది వసుంధర. అతనిలొని ఈ మార్పుకి కారణం  ఆలోచించసాగింది. ఈ భావన అతనిలో మొదటినుంచి లేదు.హాయిగా, చాలా […]

” ఉగాది “

రచన : రమాశర్మ సర్వ మానవ సౌభ్రాతృత్వమే సమతని చాటుతున్నారో వైపు కులమతవాదులు తమ  కులమత మతాబులను రగిలిస్తున్నారు మరో వైపు ఆకాశాన్నంటుతున్న  నిత్యావసర ధరలో వైపు అవకాశం వదలమంటున్న అవకాశవాదులు యింకో వైపు ఆవిరై ఆకాశాన్నంటుతున్న పెట్రొల్ ధర హై కమాండ్ కి లేనే లేదు ఏ కంట్రోల్ అడుగడుగునా పెంపుదల డీజల్ లో అడుగడుగున పై వాళ్ళ ప్రపోజల్లే అవి కరెంట్ కోత ఓ వైపు ఆ బిల్లుల మోత మరో వైపు గ్యాస్ […]

ఆంధ్ర సాహిత్యంలో శతకవాఙ్మయం – ఒక పరిశీలన

రచన : దేవరకొండ సుబ్రహ్మణ్యం శతకాల గురించి తెలియని తెలుగువాడు ఈ తెలుగుగడ్డ మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన చిన్నప్పటినుంచి అన్నిటితో పాటు తెలుగువాచకంలో మనకి నేర్పిన వాటిలో ఇవి ఇప్పటికి మన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. వేమన శతకం (ఉప్పుకప్పూరంబు నొక్కపోలికనుండు), సుమతీ శతకం (శ్రీరాముని దయచేతను), కృష్ణ శతకము (నీవే తల్లియు తండ్రియు), దాశరధీ శతకము, కాళహస్తీశ్వర శతకము, లోని పద్యాలు మన చిన్నప్పుడు అర్ధం తెలిసినా తెలియకపోయినా బట్టియం […]