April 24, 2024

||అవధానంలో సమస్యాపూరణం||

రచన: Rvss Srinivas           తెలుగు భాషకి పుట్టుక సుమారు 2400 యేళ్ళని చరిత్ర కారులు చెప్పినా, వేంగీ దేశాధిపతి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ చేతిలోనే ఒక రూపు దాల్చిందని చెప్పాలి. రాజమహేంద్రవరపు గోదావరి తరంగాల సోయగాన్ని రంగరించో లేక యా పావన నదీ తీరాన నిత్యం వినబడే వేదమంత్రాల సుస్వరాలు వినో తెలుగు భాషకి ఓ రూపం తీసుకువచ్చి వ్యాకరణ రచనతో పద్యానికుండే సౌందర్యాన్ని చెప్పిన నన్నయకి తెలుగు భాష ఋణపడి ఉంటుంది […]

ఎవరిది గొప్ప జాతి?

రచన: శశి తన్నీరు ‘టప్’ సీరియస్ గా వ్రాసుకుంటూ తపోబంగం అయినట్లు  ఉలిక్కిపడి చూసాడు కిటికీ వైపు విసుగ్గా మూర్తి. లేచి నిలబడి కిటికీ నుండి బయటకు తొంగి చూసాడు. ఎదురుగా దరిద్ర దేవత కొలువు చేస్తున్నట్లు చెత్త కుప్పలు. జీవనదిలాగా రోజు రోజుకు పెరుగుతున్నచెత్త .వాటిపై పొర్లుతూ పందులు, వాలుతున్న దోమలు,ఈగలు..ఏదో మానస సరోవరం లో మునకలు వేస్తున్నట్లు అర్ధ నిమీలత నేత్రాలతో పరుండి ఉన్నాయి కొన్ని కుక్కలు. ”ఛీ ఛీ”ఇల్లు ఇలాంటి దగ్గర ఉన్నందుకు […]

గుర్రం జాషువా అపురూప సృష్టి “పాపాయి పద్యాలు”

రచన :  పి.వి.ఎల్.రావు, ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడి యైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. సాటి సంప్ర దాయ కవులంతా ప్రేమ, ప్రణయ, శృంగార కవిత్వాలతో కాలయాపన చేస్తుండగా, జాషువా సామాజిక దౌష్ట్యా న్ని తన కవిత్వం ద్వారా చీల్చి చెండాడాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే […]

వీర ప్రేమ

రచన : శ్రీధర్ అయల ఇరవై సంవత్సరాల నిండు విగ్రహం ! పొడవుకి తగిన శరీర పుష్టి, పుష్టికి తగిన అవయవాల బిగి, బిగికి తగ్గ లాఘవం , లాఘవానికి తగిన కౌశలం ! కలిగి ఉన్నాడు ‘వీరం దొర’. క్రూర మృగాలకి వీరందొర సింహస్వప్నం. భీకరమైన వాని శరీరాలయంలో మెత్తని ప్రేమ పూరిత హృదయం దాగుంది. వాని విశాల రక్తాంత నయన కోణాలలో కరుణ నిండి ఉంది. అప్పుడు మిట్ట మధాహ్నం ! నభోమణి మధ్యంలో […]

ఏ నావదే తీరమో…

రచన: సురేశ్ పెద్దరాజు.   మ్రోగే మొబైల్ ఫోనుపైనున్న లాండ్ లైన్ నెంబర్ చూసి ఎవరు చేశారా అనుకుంటూ తీసి హల్లో అన్నాడు రఘురామ్. ఎవరూ మాట్లాడక పోయేసరికి ఇంకోసారి హల్లో అన్నాడు. మరికొన్ని సెకన్ల తరువాత “నేను హారికను” అని చిన్నగా వినిపించింది అటువైపునుంచి. “హేయ్ హారిక ఎక్కడికి పోయావు వారంరోజుల నుంచి? ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది. మీ ఆఫీసుకు వెళ్తే రావట్లేదని చెప్పారు. ఏమయ్యావు? ఇక నేనే మీ ఇంటికి వద్దామని డిసైడ్ […]

నేటికీ మేటైన సుమతీ శతకంలోని నీతులు.

రచన: శ్రీమతి ఆదూరి హైమవతి తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ శతకాలకు ఒక ప్రముఖ  స్థానం  ఉంది. ఎంతో మంది తెలుగు వారు   ఇష్టపడే శతకాలలో సుమతీ శతకం కూడా ఒకటి. శతకం అనగా నూరు ఆపైన 8 పద్యాలు ఉండే చిన్న గ్రంధం .శతకాలలో పద్యాలన్నింటి చివరా ఒకే ‘ముకుటము ‘ అంటే , ఒక పదం లేక వాక్యం, అంటే చివరి చరణం ఒకటే ఉంటుంది. ఇది ఒక  ఆనవాయితీ. దీన్నే’ముకుటము’అంటారు . ఇది ఆ […]