March 29, 2024

బంధ కవితలు

 రచన : V.A.N.మూర్తి

శంఖబంధ – ఆటవెలది

ఆ.వె:-         కాల కూట మౌర! చాలక నేలనో

కంటి మాట లలర, కలత గనక

అరయ నూరగహార! హర! హర! తాల్చెరు  ‌‍

గంగ కీర్తి పెంప! ఘనత నింప

భావము :-   ఓ పరమశివా! కాలకూట విషపు బాధ చాలదనియా, కంటి మంటలకు కలవరపాటు మాని, కంఠహారముగా విషనాగమును ధరించి వెందోలకో అని యూహింపగా, జడల యందు నర్తించు గంగమ్మ కీర్తిని పెంచుటకా, ఆమె ఘనతను జగద్విదితముగా  వించుటకని తెలియచున్నది

శంఖ బంధ – కందము

శంక బంధము

కం:-   వరదాభయ – శుభదాయీ

సురతారక కీర్తి ధాత్రి సుందరి మాయీ

నరసాధక శ్రీలోయీ

సిరి పూర్ణత గూర్పరమ్ము ! జీవన  దాయీ!

భావము:- శ్రేష్టమైన అభయమునొసగు శుభదాయి, దేవతలలో తారకమైనది

భూతలపుకీర్తిని నిల్వు సౌందర్యవతీ ! మాయి (లక్ష్మి) నరుని పురుషార్ధములలో

సంపాదింపదగినవి సంపదలు. అట్టి సంపదలను సమకూర్చుటకు జీవన దాయీ లక్ష్మీరమ్ము.

త్రిపుండ్ర బంధ – గీతము

త్రిపుండ్ర బంధము

తే.గీ :         వరలు చుండు ఓంకారాన పరముడమల

చమక వర్తి నమక విశ్వ, శమనిహారి

పుర రిపు నమః సుమాంజలి పుణ్యమలరు

శివయనంగను జీవనసిరువెలయవే !

భావము:-

పరమాత్మ ఓంకారము నందు నొప్పుచుండును, చమకమందుపవాడను

ప్రపంచకీర్తి గడించిన నమకమననెసగి, శమమగు హరించి దనరు

త్రిపురాసుర సంహారియగు నతనికి పుష్పములతో అంజలించుటవలన

పుణ్యముగల్గును. శివాయని యనుట వలన జీవన సంపదవెలయవా !

అనగా సంపదలు తెలియవా! తెలయును సుమా.

షోడశ ద్వార బంధ – సీసము

షోడశ ద్వారబంధము

సీ. ఓం, జగదాబిధ మోద హర్మ్యమునషో, డశద్వార మొహమెడంగ, శుభ, గ

తిర్మయి, నిగమనతిన్, విభవ మతిన్, ప, దాశ్రి తేజశ్విని, ధాత్రిరుణ, సు

దూర భద్రామణి తుల్య నియమయమ, మధుశ్రీధరిని మదిన్ మరువకుమ

హేమంత శుభ, విశ్వహిత కరశూరవ, రదయామయ హరి హరా శివమయి

తే.గీ: మకర సంక్రాంతి రోజున మహిమలెసగు

సర్వద్వారాలు తెరచును పర్వమనగ

పాడి పంటలు సమకూడు భాగ్యమిదియె

పౌష్య లక్ష్మి కివియె నాడు వందనాలు

బంధాంతర్గత పద్మము

ఓం శ్రీం నమః ఓం ఐం నమః

ఓం హ్రీం నమః ఓం శ్రీం, హ్రీం, ఐం నమః ­

ఓం నారాయణాయ నమః

ఓం హరి హర శివమయి నమః

బీజ సమన్వితయై శ్రీమన్మహాలక్ష్మి, పద్మాసనస్ధమై స్వర్గస్సదనాన

పరివేష్టిత నారాయణాయై హరిహరులు శివమయులు

సదా నొక్కటిగా భువనాలను రక్షింతురు.

భావము :-

ముజ్జగములకు మొదమైన మొహన్వితమై 16 ద్వారములుతో నొప్పుచు మోక్షమును ప్రసాదించెడిది, వైభవముతో నెసగెడి మోక్షప్రదాయిని, తేజస్విని, భూజీవరుణమును మాపెడిదిని, చాల దూరమును, భద్రమును ప్రసాదించునది, నియమమును తుల్యత పాటించు యమ (శ్రీ మన్మాహాలక్ష్మి మధుశ్రీని మనస్సునందుంకొనుచు మరువక) హేమంత ఋతు ప్రమోదిత శుభకర, విశ్వహితకర, పరాక్రమశాలి, ధయామయా హరిహరాన్విత (విష్ణు, శివతత్వము) శివమయీ, విశ్వరక్షక, రక్షకి. ఈ దినము మకర సంక్రాంతి, మహిమతో నొప్పుచున్నది. స్వర్గము నందలి సర్వద్వారములు తెరువబడును. (అనగా యీదినమున, ప్రాణాములు పోయిన జీవతతి సర్వము స్వర్గమును ప్రవేశించును. ఈ ఋతువునందు పాడి పంటలు సమస్తమును చేతికి అందివచ్చును . జేష్యలక్ష్మి యివియే నాదగు వందనములు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *