April 19, 2024

ఆలోచనలకే అక్షరరూపమిస్తే…

అబ్బబ్బబ్బా! ఈ ఆడాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే  ఉంటారు. ఒక్క ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండలేరు కదా. నలుగు ఆడవాళ్లు కలిసారంటే చాలు ఇక వాళ్ల ముచ్చట్లకు అంతే ఉండదు. బ్రహ్బాండం బద్ధలైనా, సముద్రాలు పొంగి  పొర్లినా వాళ్లకు అక్కరలేదు. ఐనా  ఈ ఆడాళ్లు ఎంత తొందరగా మాట కలిపేస్తారు, స్నేహం చేసేస్తారు. అసలు వీళ్లకు మాట్లాడడానికి ఒక అంశం అంటూ  ఇచ్చే పనే లేదు… పరిచయమైన రెండు నిమిషాలలోనే ఏదో ఒక అంశం మీద […]

జ్యోతిష్యం – బొమ్మలకధ

రచన: డి.సునీల మామిడి పిందెలు ఇంకా ముదరలేదు , వేప మాత్రం విరగ బూసింది ,వేసవి తన  ప్రతాపాన్ని చూపడానికి తయారవుతుంది. కోయిల తన సంగీతాన్ని కసరత్తు చేస్తున్న వేళ ఉగాది రానే వచ్చింది. పొద్దున్నే పనులన్నీ ముగించుకొని , రావాల్సిన బాకీలు లెక్కచూసుకున్నాడు అప్పారావు . వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు . అహా నా పెళ్లంట లో కోటా శ్రీనివాస్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివిన అప్పారావు […]