April 20, 2024

మాలిక పదచంద్రిక – 9, Rs.1000 బహుమతి

మాలిక పదచంద్రిక కూర్పరి : సత్యసాయి కొవ్వలి

మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ:   జూన్ 10

సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org

ఆధారాలు

అడ్డం

 

1 పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు
2 దీనితోకని పట్టుకుని ఓ పద్యం లాగించచ్చు
4 ఘృష్ణేశ్వరనివాసం – కవితావాసం
6 మన రాజులగురించీ, రాజ్యాల గురించి కథలు తిరగేసి రాసినా సరే ఏముంది గర్వ కారణం
8 తడిపొడి …. తాళం
11 పేద్ద శివుడి వూరు.. వెళ్తే ఓ వీణ పట్టుకుని రా
14
  1. అడ్డంలోఉన్న ద్విపాదులవారు కనిపెట్టారట
15 ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో
18 సాహిత్యానికి రాణి .. ఈవిడకున్న ఇంకోపేరుతో ఒక పత్రిక కూడా ఉండేది
19 కుమారభారతైన ఈకవి .. ఈ కవిగా బాగా ప్రసిద్ధి
22 రెండక్షరాల కాబట్టి…వెనకవైపునుండి
24 ఎర్రంగాఉంటాడు .. పేరుకి శెట్టిగారే కానీ కేవలం హాస్య వ్యాపారి
25 పులకరింప చేస్తే కవితలు .. జలదరింపచేస్తే … ఏవైనా నావే
26 రామదీక్షితులు బి.ఏ.
27 సుమతి .. ఈకాయలు కోయద్దన్నాడు కానీ .. వెనకనుండి కోస్తే పోలా
28 భావకవులకి ఇది స్ఫూర్తినిస్తుంది .. మనీ ఉందనా
30 నాకేం తెలియదు .. అందరూ ఇదే మొదాటి తెలుగుపదం రా అంటే గబుక్కున నమ్మా
33 నా ఇంటిపేరు తొవ్వలై తే నువ్వు రాసింది కథని ఒప్పుకుంటా
35 అవును నీ కాదు
36 34 అడ్డం +36 అడ్డం +34 నిలువు వెరసి ఎంకిప్రియుడు .. గడి చావుకొచ్చాడే
37 పిసినారితనం అనగానే చటుక్కున గుర్తొచ్చే పెళ్ళికొడుకు
38 అవును వాడుక భాషా కోవిదుడే

 

 

నిలువు

 

1 చిన్న పూవైనా పెద్దకావ్యంలో రాయమన్నారు మన తిమ్మన్నగారు
2 మిస్, కరుణించు అని ఇంత జాలిగా పాటరాస్తే, లీలగా పాడితే, అమ్మ కరుణించకుండా ఉంటుందా
3 పరుషాలే ట..ఒక్కటి తప్ప
4 పేరులోనే ఎరుపు, పూర్తి చేసిన పురాణంలో లేదు
5 ఈయనే సాహిత్యపోషకుడు. పాలకుడు
6 ముగ్గురు, కవులైనా, వాగ్గేయకారులైనా సరే
7 చివర్లో రిషభం పడాల్సిందే. లేకపోతే మన భరధ్వాజ గారి ఆనవాలు కనిపించదు
9 దీనికి తాతట మనఅన్నమయ్య
10 విషవృక్షాన్ని ఖండించిన మోహనవంశి
12 ఇదీ తెలుగే.
13 ఎవరి సాహిత్యధోరణినైనా ఓసూత్రంలో బంధించగల శాస్త్రి… అనాధుడైపోయాడు
14 నిన్, నున్, లన్, గూర్చి, గురించి
16 5 నిలువు పక్కన చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే
17 విష్ణువాహనం .. త్యాగయ్యగారి పాటల్లో
20 మన గుంటూరి కవిగారి సైన్యమా   థాకరే గారిది లా వినిపిస్తేనూ
21 3 నిలువులో లేనిదిక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడా
23 ఈ కథ స్వంతంగా రాసింది కాదట
25 పిలగాయలకి లెక్కలెలా నేరిపించాలో నేర్పిన మునికన్నడు.
29 ఈ భావులు ఎందరో .. లెక్కలేనందరు ..
31 ఈయన ఉమ్మేస్తే మటుక్కు నరసింహంగారు అంత ప్రహసనం చేసేయాలా
32 చిచ్చరపిడుగు .. తెలుగు వారి మనో రమణుడు
34 మరదలికి పన్నీరే కానీ అక్కకే కన్నీరు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *