మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక. ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ సంచికనుండి ప్రఖ్యాత టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ అయిన నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చానెల్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఈ శీర్షిక క్రింద ఆయన అందించే ఉపయోగకరమైన వీడియోలు మీరు వీక్షించవచ్చు.
మరో ముఖ్య విషయం. ప్రముఖ రచయిత్రి శ్రీమతి సువర్చల చింతలచెరువుగారు మాలిక టీమ్ లో చేరుతున్నారు. ఆవిడకు సాదర ఆహ్వానం పలుకుతూ ఈ సంచికలోని రచనలు:
1. కవి మానాపురం రాజా చంద్రశేఖర్ తో ముఖాముఖీ – బులుసు సరోజినిదేవి
2. సంస్కృత సాహిత్యంలో ప్రముఖ కవయిత్రులు – విశ్వనాధశర్మ కొరిడె
3. నిత్యజీవితంలో హస్యం – డా.అనిల్ మాడుగుల
4. పారశీక ఛందస్సు – 1 – జె.కె.మోహన రావు
7. బుల్లి ‘ తెర ‘ పెన్నుతో బ్నిం – బ్నిం మూర్తి
8. ఏమి హాయిలే హలా! – నండూరి సుందరి నాగమణి
9. పద్మప్ప – మంధా భానుమతి
10. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం – మధురవాణి
11. మాలిక పదచంద్రిక – 9 – సత్యసాయి కొవ్వలి
12. ‘ కవిసంగమం ‘ సమీక్ష – శైలజ మిత్రా
13. ‘రాముడుండాడు. రాజ్జిముండాది’ సమీక్ష – చక్రధర్ రావు
14. నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?
మాలిక బాగుంది . మంచి సీరియల్స్ ఇస్తున్నారు .
కాని సగం తరువాత బ్లూ టెంప్లెట్ మీద నాకు చదవటానికి ఇబ్బంది గా వుంది .
సుజలగారు మీ కధను editor@maalika.org కి పంపండి..
మీ పత్రిక కు కథ ప౦పాల౦టే ఎలా ప౦పాలి? నేను ప్రముఖ్ సాఫ్ట్ వేర్ వాడతాను దా౦ట్లో టైప్ చేసి మీకు వర్డ్ లో అటాచమె౦ట్ ప౦పితే సరిపోతు౦దా! నా పేరు సుజలగ౦టి. అనూరాధ అన్న కల౦ పేరుతో రాస్తాను.
సుజల