April 19, 2024

మాలిక పత్రిక చైత్రమాస సంచికకు స్వాగతం

మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక.  ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి  , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

ఈ సంచికనుండి ప్రఖ్యాత టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ అయిన నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చానెల్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఈ శీర్షిక క్రింద ఆయన అందించే ఉపయోగకరమైన వీడియోలు మీరు వీక్షించవచ్చు.

మరో ముఖ్య విషయం.  ప్రముఖ రచయిత్రి శ్రీమతి సువర్చల చింతలచెరువుగారు మాలిక టీమ్ లో చేరుతున్నారు. ఆవిడకు సాదర ఆహ్వానం పలుకుతూ ఈ సంచికలోని రచనలు:

 

1.  కవి మానాపురం రాజా చంద్రశేఖర్ తో ముఖాముఖీ – బులుసు సరోజినిదేవి

2.  సంస్కృత సాహిత్యంలో ప్రముఖ కవయిత్రులు – విశ్వనాధశర్మ కొరిడె

3. నిత్యజీవితంలో హస్యం – డా.అనిల్ మాడుగుల

4. పారశీక ఛందస్సు – 1 – జె.కె.మోహన రావు

5. అతడే ఆమె సైన్యం – యండమూరి

6. సంభవం – సూర్యదేవర

7. బుల్లి ‘ తెర  ‘ పెన్నుతో బ్నిం – బ్నిం  మూర్తి

8. ఏమి హాయిలే హలా! – నండూరి సుందరి నాగమణి

9. పద్మప్ప – మంధా భానుమతి

10. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం – మధురవాణి

11.  మాలిక పదచంద్రిక – 9  – సత్యసాయి కొవ్వలి

12. ‘ కవిసంగమం ‘ సమీక్ష – శైలజ మిత్రా

13. ‘రాముడుండాడు. రాజ్జిముండాది’ సమీక్ష – చక్రధర్ రావు

14. నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?

 

 

3 thoughts on “మాలిక పత్రిక చైత్రమాస సంచికకు స్వాగతం

  1. మాలిక బాగుంది . మంచి సీరియల్స్ ఇస్తున్నారు .
    కాని సగం తరువాత బ్లూ టెంప్లెట్ మీద నాకు చదవటానికి ఇబ్బంది గా వుంది .

  2. మీ పత్రిక కు కథ ప౦పాల౦టే ఎలా ప౦పాలి? నేను ప్రముఖ్ సాఫ్ట్ వేర్ వాడతాను దా౦ట్లో టైప్ చేసి మీకు వర్డ్ లో అటాచమె౦ట్ ప౦పితే సరిపోతు౦దా! నా పేరు సుజలగ౦టి. అనూరాధ అన్న కల౦ పేరుతో రాస్తాను.
    సుజల

Leave a Reply to జ్యోతి వలబోజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238