April 19, 2024

నల్లమోతు శ్రీధర్ వీడియోలు – యోగా

ప్రముఖ కంప్యూటర్ మాసపత్రిక కంఫ్యూటర్ ఎరా సంపాదకులు సాంకేతిక సంబంధిత విషయాలమీద మాత్రమే వీడియోలు చేస్తారని అందరికీ తెలుసు కాని ఆరోగ్యానికి సంబంధించిన యోగా గురించి తయారు చేసిన వీడియోల గురించి తెలుసుకుందాం. ఆచరిద్దాంః ప్రాణాయామం: మన శారీరక, మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంత మంచిదో మీరే తెలుసుకోండి….  “మనం రోజూ గాలి పీల్చుకుంటూనే ఉంటాం… ప్రాణాయామంలోనూ అదే చెప్తారటగా.. ఇంకా కొత్తగా నేర్చుకునేదేముంది” అని లైట్‌గా మాట్లాడే జనాల్ని నేను ఎందర్నో చూశాను. మనం ప్రతీ […]

గుర్తింపు

రచన – లక్ష్మి రాఘవ           “రాత్రి పూట మీ అమ్మ దగ్గు భరించలేను “ కోడలు సణుగుడు “ డాక్టర్ దగ్గరికి తీసుకెడతా “ కొడుకు మాట . “ డాక్టర్ దగ్గరకెందుకు దండగ , మిరియాల కషాయం ఇస్తేసరి “ ———————— “ పచ్చడి కావాలిట . రోజూ రుచులకేమీ తక్కువలేదు “ కోడలు రుసరుస “నాయన కోసం అన్నీ వండిన అలవాటు కదా “ “ అలవాట్లు […]

మాలిక పదచంద్రిక 10 – Rs.500 బహుమతి

ఈ నెల మాలిక పదచంద్రిక కూర్పరి : డా. సత్యసాయి కొవ్వలి మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: జులై 25 సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org           అడ్డం ఆధారాలు 1.దూరధ్వని సంస్థ ..పేరుకి కామ్, పనిలో స్కాం 4. రాతిశాసనము లాగానే ఉంది, కానీ  శిరాతో రాసినట్లుంది 9.రాముడు చంపిన స్త్రీ. కానీ ముందనించే చంపాడే మరి 10.చాణక్యుడు పాఠాలు చెప్పిన విశ్వవిద్యాలయం 11.ఆకుకి పోక తోడు. 12.ఠావు చిరిగి […]

రఘువంశము -1

రచన: Rvss శ్రీనివాస్..              మన దేశంలో అత్యధికంగా వ్రాయబడిన(సుమారు 11000 సార్లకు పైగా వ్రాయబడినది)  చదవబడిన శ్రీమద్రామాయణంలోని నాయకుడైన శ్రీ రామచంద్రుని మూలపురుషుల చరిత్రను చెప్పే కావ్యం ‘రఘువంశము’. మధుమాసంలో ఒక మధురమైన కావ్యాన్నిగురించి చర్చించాలని నిశ్చయించుకొని   ఈ కావ్యాన్ని ఎంచుకోవడం జరిగింది. సంస్కృతంలోని పంచకావ్యాలలో ఒకటైన ఈ రఘువంశం…మహాకవి కాళిదాసుకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.   ‘ఉపమా కాళిదాసస్య”  అంటారు ‘రఘువంశము’ కావ్యంలో అజ మహారాజు, […]

” దింపుడు కళ్ళ ఆశ ” (హాస్య నాటిక )

రచన : శర్మ జి ఎస్   పాత్రలు – పాత్రల స్వభావాలు యమధర్మరాజు : యమసీమ ( భూలోకవాసుల పాప , పుణ్యాలను బేరీజు వేసే ఏకైక కార్యాలయం  )కి ఏకైక అధిపతి. చిత్రగుప్తుడు : యమసీమకి ( దివిసీమకా? యమసీమకా ? పాపపుణ్యాల కనుగుణంగా తేల్చి చెప్పగల) ఏకైక అకౌంటెంట్. కింకరులు           :   కిం అనగానే కం అనుకుని హాజరయ్యే యమ భటులు. నారాయణ          :   నరలోకంలో నివసించే సామాన్య నరుడు.   ( […]

“అన్నదమ్ములు-అనుబంధం” – చారిత్రక సాహిత్య కథామాలిక – 3

రచన: మంథా భానుమతి పదవ శతాబ్దం.. సబ్బినాడులో (నేటి నిజామాబాద్ ప్రాంతం).. వేములవాడ పట్టణం. రాష్ట్రకూట చక్రవర్తులు దక్షిణా పధాన్ని ఏలుతున్నారు. వారి సామంతులైన చాళుక్యులు వేములవాడని ప్రాంత రాజధానిగా అభివృధ్ధి చేస్తూ, వేములవాడ చాళుక్యులుగా పేరు గాంచుతున్నారు. కృష్ణా తీరం నుంచి వలస వచ్చిన భీమనప్పయ్య గోదావరి తీరంలో ఉన్న బోధన్ పట్టణం నుంచి, తన పాఠశాలని వేములవాడకి తరలించి, సంస్కృతాంధ్ర, కన్నడ భాషల్లో విద్యా బోధన చేస్తున్నాడు. భీమనప్పయ్య మొదటి భార్య పరమపదించి సంవత్సరం […]

నమో భూతనాథా – పారసీక ఛందస్సు – 2

రచన: జెజ్జాల కృష్ణమోహన రావు                   సత్యహరిశ్చంద్ర చిత్రములోని (తెలుగులో రామారావు   కన్నడములో రాజకుమార్ ఈ పాటను అందఱు వినే ఉంటారు. ఇది ఘంటసాల గంభీరముగా పాడిన ఒక చక్కని పాట. ఇందులో మొదట శివుని చంద్రచూడ అని సంబోధించిన తరువాత, నమో భూతనాథ అనే పాట మనకు వినిపిస్తుంది. అది – నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాలా నమో దివ్యతేజా […]

సంభవం – 2

రచన: సూర్యదేవర రామ్మోహన్ రావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/   మరో ఇరవై నిమిషాల తర్వాత హైదరాబాద్‌లోని రషీద్ దగ్గర్నించి తలకోన అడవుల్లోని సవ్యసాచికి ఫోన్ వెళ్లింది. “మనకు అవసరమైన పిల్లి దొరికింది. రేపు మార్నింగ్ ఫ్లయిట్లో తిరుపతి వస్తున్నాను” రషీద్ ఫోన్లో చెప్పాడు. ************************** న్యూడిల్లీ: రేస్ కోర్స్ రోడ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అధికార నివాసం. తెల్లవారుజామున నాలుగు గంటలైంది. అయినా అప్పటికే అక్కడ సందడి ప్రోది చేసుకుని. విశాలమైన ఆ భవనంలోని ఒక […]

అతడే ఆమె సైన్యం – 2

రచన: యండమూరి వీరేంద్రనాధ్.. ఇస్మాయిల్ ఖాన్ జేబులు తడిమి చూసుకున్నాడు. అర్ధరూపాయి దొరికింది. ఆఖరి అర్ధరూపాయి. ఇస్మాయిల్ ఖాన్ భారత దేశ సైన్యంలో పనిచేశాడు. పది సంవత్సరాల క్రితం అతడు కాశ్మీర్‌లో శత్రుసైన్యానికి పట్టుబడ్డాడు. అతడిని మిలటరీ క్యాంప్‌లో బంధించారు. పది సుదీర్ఘమైన సంవత్సరాలు. అతడిని వాళ్లు ఒకటే కోరేవారు. “నిన్ను వదిలిపెడతాం.. భారతదేశానికి వెళ్లు. తిరిగి సైన్యంలో చేరు. ఈసారి మా గూఢచారిగా పనిచెయ్యి. సంవత్సరానికి లక్షరూపాయిలిస్తాం..” ఇస్మాయిల్ ఒప్పుకోలేదు. అతడు నిజాయితీ వున్న భారత […]