April 19, 2024

అతడే ఆమె సైన్యం – 3

రచన: యండమూరి వీరేంద్రనాథ్     “కాశ్మీర్ లోయవైపు నా ప్రయాణం ఒక అందమైన అనుభవం” ప్రనూష ప్రారంభించింది. అతడు ‘టీ’ తాగుతూ వింటున్నాడు. ఆ విశాలమైన హాలు, ఎత్తైన గోడలు, తైలవర్ణ చిత్రాలు, ఖరీదైన సామాగ్రి, అన్నీ ఆమె చెప్పబోయే కథకోసం ఎదురుచూస్తున్నాయి. “డిల్లీనుంచి జమ్మూవరకూ నేను ప్రయాణించే రైల్లో నాకోసమొక ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్ రిజర్వ్ చేయబడింది. కేవలం నేనూ, నా ఆయా. మరో కంపార్ట్‌మెంట్‌లో మరో ఇద్దరు నౌకర్లు..” ఆమె ఆగి అన్నది. “ఇదంతా […]

రక్షాబంధనం

రచన: స్వర్ణలతానాయుడు   శ్రావణమాసంలో శుక్లపక్షమి పౌర్ణమి రోజునాడు వచ్ఛేదే రాఖీ పండుగ. భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లని చెప్పడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.అన్నాచెల్లెళ్ళ అనురాగబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుక ఇది.   ఈ రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి దైవపూజ కావించుకుని సోదరుల నుదుట తిలకం దిద్ది, మంగళహారతిచ్ఛి  నోరు తీపి చేసి సప్తవర్ణాలను తలపించే రంగురంగులదారాలతో అన్నాతమ్ముళ్ళకు రాఖీ కట్టి  వారి ఆశీర్వాదం తీసుకుంటారు.అదే తమ్ముడైతే అక్క ఆశీర్వదిస్తుంది కలకాలం సోదరుల జీవితాలు ఆనంద […]

జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు

రచన: టీవీయస్.శాస్త్రి     తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో,ప్రతిభా పాటవాలతో ఎదిగిన గొప్ప రచయిత శ్రీ రావూరి భరద్వాజ. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. ‘పాకుడురాళ్ళు’. కాదంబరి’ నవలలు–“అధోజగత్సహోదరుల కథా సరిత్సాగరం…”అని మహాకవి శ్రీశ్రీ నుండి అభినందనలు అందుకున్నట్టి రచయిత శ్రీ రావూరి వారి’జీవన సమరం’వంటి  ఒక యదార్ధ గాధా సంపుటం–“ఒక్క భారతీయ భాషల్లోనే కాదు, నాకు తెలిసిన ,ఏ విదేశీ […]

“బనవాసి” – చారిత్రక సాహిత్య కధామాలిక – 4

రచన: మంధా భానుమతి  పదవ శతాబ్దం.. పూర్వార్ధం.. “బనవాసి”.. ఉత్తర కేరళ నుండి, ఉత్తర కర్ణాటక వరకు ఏక ఖండంగా రాజ్యమేలిన కాదంబ రాజుల ముఖ్య పట్టణం. కాల క్రమాన కాదంబ వంశ పాలన క్షీణించి, ఆ ప్రదేశమంతా చాళుక్యుల, ఆ తరువాత రాష్ట్రకూటుల సామంత రాజ్యంగా మారిపోయింది. కాదంబరాజు శివకోటి, యుద్ధాలలో రక్తపుటేరులు పారడం సహించలేక,  జైన మతం స్వీకరిస్తే, అప్పటినుండీ ఆ రాజ్యం జిన సంస్కృతికి మారుపేరుగా నిలిచింది. భీమనప్పయ్య జైనమతం నుండి మారి, […]