February 5, 2023

మాలిక పదచంద్రిక – 11 , Rs. 500 బహుమతి

 

ఈ నెల మాలిక పదచంద్రిక కూర్పరి : జె.కె.మోహనరావు

మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: ఆగస్ట్ 25

సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org

padachandrika-101

అడ్డము –

1. సినిమా పంపిణీదారులకు ఇది సీడెడ్ సీమయే (3)

4. జయభేరిలోని ఆ మాటే మన ఆటౌతుంది ఇతని దేశములో (6)

9. కన్నది ఒకటి చాలదు, ఇంకొకటి కూడ (3)

10. మన్మథుడి ఊరేమో? (4)

11. ఇది అల్లరియా, కొట్టివేతయా? (2)

12. పాతకాలమునాటి బ్యాంకులు ( 4)

13. రాహువు కూడ ఒక రజ్జువువంటి వాడే (2)

15. ఆత్మహత్యకు ఇది అవసరమా? (5)

19. వంగినదానిలో చివరి అక్షరము తొలగిస్తే ఈ పెద్ద నటి కనిపిస్తుంది (4)

22. ఘటికుని మధ్యలో ఉంటుంది (2)

23. పేజీలు తిప్పేవారికి ఈ పదము తెలుసో తెలియదో? (2)

24. కలలో వచ్చేవాటిని గురించి వ్రాయడానికి యీ పరికరాలు కూడ కావాలి (4)

25. ఇది ఒక చెక్క (2)

26. బ్రహ్మ దీనిని కుడినుండి వ్రాస్తాడా, ఎడమనుండి వ్రాస్తాడా? (2)

27. పిడికిటితో ఇలా దుర్మార్గుడు పొడుస్తాడా? (3)

29. ఇది ముందు గతి మనకు (4)

31. మంత్రికి తినడానికే కాదు, పొగడడానికి కూడ ఇది కావాలి (2)

33. రోసమున్న మగధీరుడు చేసే పని (6)

35. ఇది కూడ ఒకప్పుడు D.A. (2)

36. ఇది ఒక చిన్న చిక్కా? (2)

37. అటుపక్కన కృష్ణుడులాటి వాళ్లు ఉండే ఊరులు (3)

41. త్రిమూర్తులకు మాత్రమే కాదు, మనలాటి వాళ్లకు కూడ ఇది ఉంది. (4)

42. రాముడి పేరులో ఉందట. (2)

43. ఒక రాక్షసుని చంపినప్పుడు వచ్చిన పేరు. (5)

44. అ, ఆలు నేర్చేటప్పుడు తప్పకుండ వచ్చే పదము (2)

 

నిలువు –

1.మధురానగరిలో చల్లలమ్మబోయిన బోటి చెప్పిన మార్గము (2)

2. యక్షుని మిరియాల పాలుకు సంకేతాక్షరాలు ( 3)

3. ఇది శాస్త్రీయ గీతము కాదు. (6)

4. ఈ పాత్ర లేక సామాన్యముగా కూచిపూడి నాట్యము ఉండదు. (2)

5. ఇడ్లీకి, ఉప్మాకు మాత్రమే కాదు, దీనిని ఉంగరములో కూడ పెట్టుకోవచ్చును. (2)

6. ఇప్పటి వాళ్లకేం తెలుసు ఆకాలం గురించి? (3)

7. 10 అడ్డములో పూచే పూలు దీనికి ఉపయోగపడుతాయి. (3)

8. దీనిని వద్దనడానికి మనసుండదు పడుచువాళ్లకు. (2)

10. పోలీసుల ఈ చర్యలో చనిపోవచ్చు. (3)

13. మడిమడిగా నీళ్లు తాగుతాయి చెట్లు దీని సహాయముతో (2)

14. 5 నిలువుకు ఇది కూడ ఒక అర్థమే. (3)

16. డాక్టరుల మందులు ఈ రూపములో ఉంటుంది. (3)

17. మొండి ఘటం. (2)

18. సామాన్యముగా సీసాల కింద కనబడుతుంది. (4)

20. ప్రకాశించేటప్పుడు ఇది 9 అడ్డములా వస్తుంది. (2)

21. అయ్యో పాపం, ఈ చేప మూలుగుతుందా? ((5)

23. పాతకాలపు నాటిది తలకిందులుగా ఉండకుంటుందా? ((3)

25. ఆ ఈశాన్య మూలలో ఉండే గదికి వెళ్లకు అంటుంది రాజకుమారుడితో పేదరాసి పెద్దమ్మ. (3)

28. ఇతడిని కొందరు నిర్లక్ష్యముగా పీనుగు అని అంటారు. (5)

29. ప్రేమికుడికి దీనిని చూసినప్పుడల్లా ప్రియురాలే జ్ఞాపకానికి వస్తుంది. (2)

30. అబ్బ ఏమి కాంతులు! (3)

31. ఇటువంటి పువ్వులను ఎన్నో దండగా చేసి పద్యాలనే వ్రాస్తారు. (4)

32. తేలుతోకలాటిది యిది. (2)

34. ఇది మంచి రోజు కాదు. (4)

38. ఇది కనిపించేది యక్షగానాలలో మాత్రమే కాదు, ఇది ఒక చిత్రము కూడ. (3)

39. ఇది 34 నిలువు కాదు. (2)

40. ఇది నల్లగా ఉంటే ఇందులో పడిందంతా స్వాహా! (2)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *