April 20, 2024

కినిగె టాప్ టెన్ పుస్తకాలు..

 

ఈ నెల టాప్ టెన్ తెలుగు పుస్తకాలు!
సౌజన్యం : కినిగె

పుస్తకాల పరిచయం : సాయి.

ఈ నెల టాప్ టెన్ పుస్తకాలలో మొదటి స్థానం డైనమిక్ రైటర్ మధుబాబు వ్రాసిన జానపద నవల, కానకన్య. నిశీధుడు వెనుకా ముందు ఎవరూ లేని వాడు, అయినా విద్యల్లో మాత్రం అతనికి అతనే సాటి. అది కత్తి తిప్పడమైనా, అడవుల్లో అలవోకగా ప్రయాణించడంలోనైనా, స్నేహితులను రక్షించడంలోనైనా, కాలాశ్వాన్ని సాధించడంలోనైనా, శతృవులను ఎదుర్కోవడంలోనైనా, కాలకన్య మనసు గెలుచుకోవడంలోనైనా!

      1. రామ్@శృతి.కామ్ By అనంతరామ్
        హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీరు అయిన అనంతరామ్, వ్రాసిన తొలి నవల ఇది. తొలి నవలలోనే పాఠకుల అభిమానాన్ని చూరగొన్న రచయిత అనంతరామ్. ఈ నవల చదువుతుంటే మనచుట్టూ జరుగుతున్న కథలానే వుంటుంది. ఇంకా పంచ్ డైలాగులు, హాస్యం, సాఫ్ట్ వేర్ జీవితం ఈ నవల ప్రత్యేకం. ఈ నవల గొప్పతనానికి ఆ పుస్తకం కినిగె పుటలో వచ్చిన పాఠకుల వ్యాఖ్యలే సాక్షం.
      2. అంకితం By యండమూరి వీరేంద్రనాథ్

ఆంధ్రుల అభిమాన నవలాకారుడు యండమూరి వీరేంద్రనాథ్ కలం సృష్టించిన సెంటిమెంటు, ఆర్ద్రత, సస్పెన్స్ ల మేళవింపు ఈ నవల.

వర్మ ఒక సంచలనం. అది సినిమాల్లో అయినా, తెలుగు పుస్తకాల్లో అయినా. అటువంటి వర్మ గురించి సిరాశ్రీ వ్రాసిన విభిన్న పుస్తకం ఈ వోడ్కా విత్ వర్మ.

స్వాతి వారపత్రికలో సరసమైన కథలు హోల్ ఆంధ్రాకే ఫేమస్ కదా. కేయస్వీ అందులో వ్రాసిన 25 కథల సంకలనమే ఈ పుస్తకం.

ప్రస్తుతం తెలుగులో వ్రాస్తున్న అతి కొద్ది మంది హాస్య పుస్తకాల్లోవి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. ఉత్తమ హాస్యరసభరితం ఈ కథలు ఇవి.

స్వామి వివేకానంద స్వయంగా వ్రాసిన ఆత్మ కథ ఈ నా ఆత్మ కథ పుస్తకం.

సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అన్న గారు యన్టీఆర్ ఒక అద్భుతం. యన్టీఆర్ పూర్తి సినీజీవితాన్ని మన ముందు పరిచేది ఈ యుగానికి ఒక్కడు పుస్తకం. అరుదైన ఫోటోలతో, ఎన్నో విశేషాలతో నిండినది ఈ యుగానికి ఒక్కడు.

శ్రీరమణ వ్రాసిన మిథునం కథ ఆధారంగా తనికెళ్ళభరణి దర్శకత్వం వహించిన సినిమా ఎంత బాగుందో మనందరికీ తెలుసు.  ఈపుస్తకం ఆ మిథునం సినిమా కంటే పసందైన మిథునం కథ మరియు అంతే చక్కని ఇతర శ్రీరమణ కథల సంకలనం.

ప్రపంచ ప్రసిద్ధ కౌటిల్యుని అర్థ శాస్త్రం పుస్తకం తేట తెలుగులో వ్రాసిన పుస్తకం ఇది. రాజ్యాలేలే వారికైనా, కుటుంబాన్ని పాలించే వారికైనా అర్థ శాస్త్రం అందుబాటులో ఉంటే సాఫీగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *