April 20, 2024

సంపాదకీయం : స్నేహం ఒక వరం

 

అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ఎడిటోరియల్

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.  స్నేహం అనేది  ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఈ స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా  ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి   నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.  కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను  కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు  కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుకొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.    ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా  అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే, తప్పొప్పుల ఎంపిక చేసి మార్గదేశం చేసే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు. ఈ స్నేహం అనేది ఇద్దరు  పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు….  ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివలన సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి.  స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఈ స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరినీ స్నెహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది.  ప్రతీదానికి మంచి చెడు ఉన్నట్టే స్నేహం విషయంలోనూ ముందు జాగ్రత్త, నమ్మకం చాలా ముఖ్యం. అన్నిటికంటే “మంచి స్నేహితుల చెలిమితో స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే నీవు ఉత్తమ మిత్రునిగా రూపొందించుకోవాలి”.  అనే సూక్తి మరవకూడదు..

 

 

2 thoughts on “సంపాదకీయం : స్నేహం ఒక వరం

  1. ఒక్క స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలు పుట్టుకతోనే వచ్చి సరసన చేరతాయి . స్నేహితులను మాత్రం మనమే ఎంచుకోవాలి అన్నది అక్షరాలా నిజం . మంచి విషయాలను తెలియజెసిన జ్Yఒటి గారికి అభినందనలు

  2. PERFECT ANALYSIS OF WHAT FRIENDSHIP MEANS, WHAT IT IS, WHAT IT SHOULD BE
    AND HOW IMPORTANT IT IS TO HAVE CHOSEN FRIENDS…
    BEAUTIFUL ARTICLE , JYOTHI…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *