March 19, 2024

పాడమని నన్నడగవలెనా – పారసీక ఛందస్సు – 5

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు                                                                                         రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ అమరిక పారసీక, ఉర్దూ భాషలలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఛందస్సు.  దీనిని ఈ విధముగా వ్రాస్తారు: =-== / =-== / =-== / =-= .  దీనికి సరిపోయే గురు లఘువుల అమరిక UI UU UI UU […]

సరిగమలు – గలగలలు – 1

రచన : మాధవపెద్ది సురేష్ చంద్ర      అంకురార్పణ….   ‘సంగీతం’ మనకున్న మానసిక రుగ్మతలని పోగొట్టే గొప్ప సాధనం, 1967 నుండి 1973 వరకూ ఎన్నో ప్రోగ్రామ్స్ విజయవాడలో, భావనా కళా సమితిలో హార్మోనియం ఎకార్డియన్ వాయించే వాణ్ని. 1974 నుండి 1990 ఎకార్డియన్ ప్లేయర్‌గా, తరువాత కీబోర్డ్ ప్లేయర్‌గా ఎన్నో సినిమాలకీ, కచేరీలకీ వాయించటం జరిగింది. అలాగే 1988 నుండి సంగీత దర్శకుడిగా సుమారు 58 సినిమాలు పూర్తి చేసాను. నంది అవార్డ్స్ […]

జీవితపథ సోపాన పుటలు ( పలక – పెన్సిల్ )

సమీక్షకులు: అరిపిరాల సత్యప్రసాద్                                                                                     కొన్ని పుస్తకాలుంటాయి. వాటిల్లో ఆత్మకథలుంటాయి. తమ జీవితంలో ఎత్తులు – పల్లాలు, నవ్వులు […]

లేఖాంతరంగం – 1

  రచన: రేణుక అయోల   సరళ దగ్గరనుంచి ఉత్తరం రాగానే చాలా సంతోషం అనిపించింది. తీరిగ్గా కూర్చుని ఉత్తరం చదవడం మొదలు పెట్టాను.. ఆ గుండ్రటి అక్షరాల వెంట నా చూపులు పరుగులు తీసాయి..   సరోజా (అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నట్లే మొదలుపెట్టింది ఉత్తరం.) మొన్న మా మేనత్త కొడుకు  పెళ్లికి వెళ్లవలసి వచ్చింది. నీకు తెలుసుగా సుందరం అని మా ఇంటికి వచ్చేవాడు గుర్తుందా? ఎర్రగా పొడుగ్గా వుండేవాడు. మన ఇద్దరం వాడికి ఆంధ్రా […]

పంట పండింది

రచన: సైఫ్ అలీ గోరే   * ఏమిటి కోలాహలం ఏదో పర్షాకాలపు పంటని కురులని సవరించుకుంటూ ఎవరో ఉత్సాహం తో కోస్తున్నట్లు   రాణివాసాలకు ఈ వార్త వెళ్తే వ్యామోహాల శాసనాలు భూత ప్రేతాలై వెంబడించేస్తాయి కదా!   * కర్బూజా పళ్ళ కోసం గూఢచారులెవరో రహాస్య యుద్ధాలు చేసుకునే ముహూర్తం తిరిగి పుడుతుంది కదా!   ప్రతాపశీలులెవరో ఉసికొల్పడానికేనా ఈ పూలు ఈ ఫకీర్ల గ్రహం మీద వికసిస్తున్నాయన్నట్టుంది .   * ఐనా అదృష్టవంతులని […]

అనగనగా బ్నిం కధలు – 3

రచన : బ్నిం మూర్తి నవ్విపోదురుగాక …  (ఝాన్సీ గళం)   ఇదో సరదా కథ! చిన్నప్పుడు పడ్డ సరదా పెద్దయ్యాక కూడా కొనసాగించడంతో ఏ విధమైన హానీ జరగని హాయైన కథ!! వయసు పెరిగినకొద్దీ మనకి ఇష్టాలు మారిపోతుంటాయి. కొన్ని మొహమాటపడి మార్చుకుంటాం! కొన్ని మోజుతీరి మార్చుకుంటూ వుంటాం! ఇంకొన్ని వాటికన్నా మించినదేదో ‘లభ్యం’ కావటంతో.. కేలండర్ల దొంతర్లో అడుగంటి పోతాయి….!   చిన్నప్పుడు అమ్మ ఇష్టం- ఆ తర్వాత మరో అమ్మాయికి ఆ ఇష్టాన్ని […]

సంభవం – 5

రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/             క్షణాల్లో… నిమిషాల్లో ఆ వార్త దేశమంతటా పాకిపోయింది. హత్యా రాజకీయాలు నశించాలి… కిరాయి హంతకుల్ని మట్టుబెట్టాలి… టెర్రరిజాన్ని అణగద్రోక్కాలి… విశ్వంభరరావు అమర్ రహే… మీ వెనుక మేం వున్నాం పి.ఎమ్… లాంగ్ లివ్ విశ్వంభరరావు అనే నినాదాలతో దేశ ప్రజలు పోటేత్తి పోయారు. పి.ఎమ్. పేరిట దేవాలయాల్లో పూజలు – యాగాలు, మసీదుల్లో, చర్చిలలో ప్రార్ధనలతో దేశం యావత్తు పూనకం వచ్చినదానిలా […]

పోరు గీతమై విప్లవిస్తా

రచన: వేంకటేశ్వర చారి రాయల సీమంటే.. ఫ్యాక్షనిజం, బాంబుల మోతలు, వేట కొడవళ్ల వీరవిహారం తెగిపడే కుత్తుకలు, నెత్తుటి ధారలు.. ఇంతే  మీకు  తెలిసింది.. ఇదే మీరనుకుంటున్నది..అంతేకదూ.. కానీ, ఆ బాంబుల మోతల వెనకాల ఎన్నో గుండె కోతలున్నాయి అయిన వారికోసం బరువెక్కిన హృదయాలున్నాయి పై కెత్తిన కరుకు కొడవళ్ల వెనుక బాధలతో బరువెక్కిన మానవీయ గాథలున్నాయి ఆ నెత్తుటి చారికల మాటున దాగి…. అణగారిన  బతుకుల రోదనలు,వేదనలన్నాయి రత్నాల సీమ రాళ్లసీమగా మారుతుంటే. మావత్వంతో ధాతృత్వం […]

రఘువంశం – 3

రచన: Rvss శ్రీనివాస్        ముందుగా చదువరులకు రాబోయే దేవీ నవరాత్రుల  శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెండవ భాగంలో సీతారామ కళ్యాణం వరకు చెప్పుకున్న రఘువంశాన్ని ఈ భాగంలో ముగించాలని అనుకుంటున్నాను. మరి చదవండి ఈ మూడో భాగాన్ని.   దశరథ మహారాజు తన నలుగురు పుత్రులతో, కోడళ్ళతో , బంధుమిత్రులతో అయోధ్యకు పయనమయ్యాడు. సుదూర ప్రయాణంలో కొంత దూరం వెంటవచ్చి సాదరంగా వీడ్కోలు పలికారు జనకుని పరివారం. ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగాయి. నదులు వాగులు […]

“కవితా గుణార్ణవుడు”- చారిత్రక సాహిత్య కధామాలిక – 6

రచన: మంధా భానుమతి   ప్రకృతి అందాలకు ఆలవాలమైన బనవాసి పట్టణంలో.. సభ నిండుగా కొలువు తీరింది. రాజు, కలత చెందిన మదితో సభలోనికి అడుగిడి ఆసనమలంకరించాడు. రాజావారికొక్కరికే ఆ విచారం పరిమితి కాలేదు. సభలోనివారందరూ అవనత వదనులై చింతా క్రాంతులై ఉన్నారు. ఒక్కసారిగా కలకలం.. ఆచార్యులవారు ఏతెంచుచున్నారు.. గుసగుసలు. రాజుగారితో సహా అందరూ లేచి నిలుచున్నారు. రాజుగారు, పంపనార్యునికి ఎదురేగి, పూలమాలాలంకృతుని చేసి, తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. “రాజా! ఏమిది..” పంపన్న బిడియంగా సభని […]