April 16, 2024

మాలిక పత్రిక భాద్రపద మాస సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor, Content Head. వినూత్నమైన వ్యాసాలతో, సీరియల్స్ తో మాలిక పత్రిక  భాద్రపద మాస సంచిక విడుదలైంది. గతనెలలో ప్రకటించిన ఉత్తమ బ్లాగు, వికి టపాలకు రూ. 116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ బహుమతులకు మీరు కూడా మీకు నచ్చిన టపాలను నామినేట్ చేయవచ్చు. మీరు రాసినదైనా సరే … ఉత్తమ బ్లాగు టపా:  ‘ ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను‘  ( పనిలేక) ఈ టపాలో డాక్టర్ […]

సంపాదకీయం : మనమేం చేయగలం??

  ఈనాడు ప్రపంచవ్యాప్తంగా  చాలా అభివృద్ధి చెందాం. అన్ని రంగాలలో స్త్రీ పురుషులు సమానంగా పని చేస్తున్నారు. వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు అంతరిక్షంలోకి కూడా దూసుకువెళ్తున్నారు. శభాష్!!!…. ఇది వినడానికి చాలా బావుంటుంది. సంతోషంగా, గర్వంగా కూడా ఉంటుంది. ఆడపిల్లకు చదువెందుకు? అనే రోజులు పోయి చదువు ఎందుకు వద్దు. చదవాలి . తనకంటూ ఒక గుర్తింపు, ఆర్ధిక స్వావలంబన ఉండాలి అంటున్నారు. అమ్మాయిలు కూడా చదువుకుని ధైర్యంగా పోటీప్రపంచంలో దూకుతున్నారు.  ఉన్నత విద్యావంతులై అన్ని […]

అతడే ఆమె సైన్యం – 4

రచన : యండమూరి వీరేంద్రనాధ్  “అదీ భాబీ జరిగింది” పూర్తిచేశాడు ఇస్మాయిల్. రంగనాయకి నిశ్శబ్ద రోదన ఆ గదిలో శబ్దాన్ని భయపెడుతూంది. చైతన్య మోకాళ్ళ మీద చేతులాన్చి మొహాన్ని అరచేతుల మధ్య దాచుకుని చాలాసేపు వుండిపోయాడు. నిమిషం తరువాత ఆవేశంగా లేచాడు. “మొత్తం ప్రభుత్వాన్ని కదుపుతాను. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగిస్తాను. డబ్బు వెదజల్లుతాను. నా తండ్రిని అక్కడనుంచి వెనక్కి రప్పిస్తాను.” ఇస్మాయిల్ అడ్డంగా తలూపుతూ, “ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసింది. ఎందరో సీక్రెట్ ఏజెంట్స్‌ని […]

సంభవం – 4

రచన: సూర్యదేవర రామ్మోహనరావు                                suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/   తలకోనలోని మృతసంజీవని ప్రయోగశాల… ఆస్ట్రేలియన్ పిల్లి డాలీకి అమర్చిన హార్ట్‌ లంగ్ మెషిన్‌ని తీసేసింది డా.విజేత దాని బ్రెయిన్ వేవ్ స్టడీగా వుండటంతో ఎంతో సంతృప్తిగా వుందామెకు. ఆ పిల్లి తన సీట్లో నెమ్మదిగా కదులుతోంది. దానిని అక్కడ నుంచి బయటకు రప్పించడానికి సవ్యసాచి ప్రయత్నిస్తున్నాడు. “హాయ్ కమాన్! కమాన్! గెటప్…” […]

కినిగె టాప్ టెన్ పుస్తకాలు – ఆగస్ట్ 2013

    ఆగస్ట్ నెలలో కినిగెలో టాప్ టెన్ స్ధానాలలో ఉన్న పుస్తకాలు ఇవి.. బియాండ్ కాఫీ by మహమ్మద్ ఖదీర్ బాబు దొంగ… దొంగ… దొంగ… By మధుబాబు రామ్@శృతి.కామ్ By అనంతరామ్ అద్దంకి వోడ్కా విత్ వర్మ By సిరాశ్రీ నా ఆత్మ కథ By స్వామి వివేకానంద ప్రియురాలు పిలిచె By యండమూరి వీరేంద్రనాథ్ నేస్తమా బీ పాజిటివ్ By ఎ.జి.కృష్ణమూర్తి అమ్మ-నాన్నా, పిల్లలు (గమనిస్తున్నామా?) By రామకృష్ణ ప్రసాద్ మిథునం By […]

అక్షర పరిమళాల మమైకం – ఈ కవిత్వ “మరువం “

పుస్తక సమీక్ష: శైలజా మిత్ర      “కొండ పాదాన పాకుడు రాళ్ళ సోపానం నది పయనం శిఖరాగ్రానికి చేరేనా ? సైకత మేతల్లో స్రవించే త్రుళ్లింత రేయిలోను మెరిసేటి పాషాణపు చెమరింత “ ఇది కవయిత్రి ఉష గమకాల గమనం. ప్రపంచపు నైరాశ్యపు నిశీధిలో కొలిచే కొలమానాలు రెండే రెండు.  ఒకటి అక్షరం మరొకటి ఆశయం . ఈ రెంటికీ ఒకదానిని అనుసరించి మరొకదానికి అనుసంధానం అనేది జరుగుతుంటుంది. మాట్లాడటానికి అక్షరం కావాలి . కవితా […]

బియాండ్ కాఫీ – బోల్డ్ అన్డ్ స్ట్రాంగ్

పుస్తక సమీక్ష : కత్తి మహేష్ కుమార్      అస్తిత్వ వాదాల హోరులో తెలుగుసాహిత్యం పోటెత్తుతున్న సమయంలో సైలెంటుగా సమాజాన్ని సమూలంగా మార్చేస్తున్న  గ్లోబలైజేషన్, అర్బనైజేషన్ గురించి వచ్చిన కథలు తక్కువనే చెప్పుకోవాలి. అస్తిత్వస్పృహల్ని కూడా తికమకకి గురిచేసే విచిత్రమైన మార్పులు గ్లోబలైజేషన్ తీసుకొచ్చేసింది. “వన్ ఈజ్ మెనీ” అనే మిథికల్ విశాలత్వం “గ్లోబల్ విలేజ్” అనే మరీచిక మాటున మనల్నీ భ్రమలకి గురిచేస్తూవచ్చింది. ఈ ధోరణుల్ని ,పోకడల్ని మానవ సంబంధాల్లో మరీ ముఖ్యంగా స్త్రీ-పురుష […]

అనగనగా బ్నిం కధలు – 2

రచన: బ్నిం  నమస్తే.. లాస్ట్ ఇష్యూలో ..ఝాన్సీ  గొంతులో.. మీరు విన్న నా కథ “చిలకాకు పచ్చ రంగు చీర” బావుందన్నందుకు థాంక్స్.-ఇప్పుడింకో కథ – ఇది ‘సుమ’ చదివింది. ” ఈ పలుకే బంగారమైన” పిచ్చి తల్లులంతా ఎంతో ఇష్టంగా చదివారు-   ఇంకో పిచ్చితల్లి ఇదిగో ఈ మాలికలో తావిచ్చింది. అన్నట్టు, ఆ పిచ్చితల్లి కథలు రాయమని ప్రేరేపించారు కదా – ఆంధ్రభూమి వీక్లీలో. అందుకోసం అందరికీ మళ్లీ థాంక్సోహం అంటున్నా- ఇప్పుడు మీ ముందున్న […]

వినిపించని రాగాలే – పారసీక ఛందస్సు – 4

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు                       సామాన్యముగా పాటలలోగాని, పద్యాలలో గాని అనాదినుండి చతుర్మాత్రల ఉపయోగము ఎక్కువ. తెలుగు కన్నడ భాషలలో ఖ్యాతి కెక్కిన కందపద్యము చతుర్మాత్రాయుక్తమైనదే. అలాగే రామదాసు, త్యాగరాజువంటివారి  కృతులలో కూడ  మనకు చతుర్మాత్రలు పదేపదే కనబడుతాయి.   పారసీక ఛందస్సులో హజజ్ ముసమ్మన్ అఖ్రబ్ అనే ఒక ఛందస్సు గలదు. దానిని ఇలా వివరిస్తారు: ==- / -=== […]