June 25, 2024

మాలిక పదచంద్రిక – 12 . Rs. 500 బహుమతి

కూర్పరి: డా. సత్యసాయి కొవ్వలిsatyasai

మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: సెప్టెంబర్ 25

సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org

జ్యోతిగారు పదచంద్రిక కాస్త విభిన్నంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆవిడ సలహానుసారం గతంలో ఒక పదచంద్రిక సాహిత్యప్రధానంగా కూర్చాము. ఈసారి పదచంద్రిక సంగీతప్రధానంగా కూర్చాము.  ఏదైనా ఒక విషయం ప్రధానంగా తీసుకుని గడి కూర్చడంలో పదచంద్రిక కాస్తా  క్విజ్ మూసలో పడే ప్రమాదం ఉంది.  అలాగే మామూలుగా గడి కూర్చడం లో ఉన్న సౌలభ్యం ఇక్కడ ఉండదు. అందుకునే ఈసారి గడిలో ఆధారాలు తక్కువగా ఉన్నాయి.  ఉన్నంతలో శాస్త్రీయ, సినిమా సంగీతాలకు సమప్రాధాన్యత ఉండేలా చూసాము. పూరకులు సంగీతదారాలని పట్టుకుని నింపితే సులభంగా పూరించవచ్చు.

ముందస్తు అభినందనలతో..  సత్యసాయి కొవ్వలి

 padachandrika 11

ఆధారాలు:

అడ్డం
1    అందరికీ అమ్మ తమ్ముడే.. ఆయన కూర్చిన ప్రతిపాటా ముద్దబంతి పూవే
3    చెన్నై చంద్రమా కి అమ్మైన పాట
6    చాలా సినిమాల్లో ఈ పాట ఉండాల్సిందే .. అమ్మాయి తడవాల్సిందే..నిర్మాతకి రాలాల్సిందే… ప్రభాస్ సినిమాలా ఉందే
8    రాఘవేంద్రరావు, కీరవాణి కలిసి చేసిన భాగవతాలలో ఇదొకటి
9    శంకరశాస్త్రి అరిచాడంటే అరవడా మరి.. ఇందులో తిరగేసినా సరే రిషభం ఎక్కడొస్తోంది?
11    ఈ సైరంధ్రి పాటకి ఎస్వీరంగారావేంటి మనమైనా సరే వివరించేస్తాము
12    చెయ్యి పట్టనా.. ఓహో ..ఇదో తాళమా
14    మదిలోన కదలాడి కడతేర మంటే మాత్రం నిజంగానే చివరికి కుంచించుకుపోవాలా
15    తెలుగు దూరదర్శన్ లో వచ్చిన కర్ణాటక సంగీతం పోటీలు, వెనకనుండి చూసినా సరే..యుధ్ధం జరగలేదు
17    హాస్యం + సంగీతం కలిసిన రాజా లాంటి పత్రిక.
18    అవును మన రాజా నే. సినీసంగీత  రాజే
20    తిరుమలరాయుని తనపదాలతో పూజించిన భాగవతుడు.. పాకలో ఉండడు
22    ఓ మంచి మళయాళ చిత్రం.. పాడడం. సుసర్ల సంగీతం .. .యారమితా వనమాలినా
23    ఎల్లారీశ్వరి ఛమ్‌ఛమ్ గుఱ్ఱం ఎక్కినదీ సినిమాలోనే
25    పాటకి ముందు పాడుదామంటే మధుశాలలో ఏం చేస్తోందో
27    కుమార్ సాను దీంతో పాడతాడా? నోటితో కాదా?
28    ఓప్పా గాంగ్నాం స్టైల్
29    ఓ..సజీవశిల్పసుందరీ అని పలకరించాక మళ్ళీ హూ ఆర్యూ అంటాడేమిటో

నిలువు
2    కర్ణాటక గాత్రసంగీతానికి మహారాజు ఈ విశ్వనాధుని సంతానం..అయితే ప్రమాదంలో పోకూడదా
3    ఆత్రేయ గారి కవిత్వవస్తువు .. దేవుడి దగ్గర లేనిది, ఆయన మనిషికిచ్చినది
4    మనం పాడితే పాటొస్తే, శివుడు పాడితే..వచ్చేది?
5    శ్రీవారికి ప్రేమలేఖ లో కదనకుతూహలం ఇదేకదా మరి
6    క్యాహువా తేరా…
7    తలకి నీళ్ళోసుకుని …..మంజుల కురులారబోసుకంటే, మరి మల్లిగాడు?
10    సరిగమ పదనిసారిగారిసా
13    కీరవాణి ఇంట్లో సంగీత లేఖ
16    ….తగువారము కామా.. ఘంటసాలలా జయభేరి మోగించగలిగితే తగువారే
19    లీటర్లకొద్దీ తేనె తాగడంవల్ల ఈవిడ కంఠం మధురంగా ఉందని 18 అడ్డం ఉవాచ
21    విఫణికీ, ఇండియన్ సినిమాకి .. రెంటిలోనూ ఉండేది
22    కంఠమే.
24    అల్లదివో అని మనకి పాటలోనే వైకుంఠం చూపించాడు అన్నమయ్య
25    అస్మదీయ మగటిమి చూపించిన శ్రీకృష్ణదేవరాయలి తాత. 20 అడ్డం ఆయనని జయిలులో పెట్టినాయన
26    లోతుబావి లోంచి నీళ్ళు బయటికి తీయాలా? ఈరాగం పాడితే సరి

5 thoughts on “మాలిక పదచంద్రిక – 12 . Rs. 500 బహుమతి

 1. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాము

 2. మాలిక పద చంద్రిక-12 ఎలా పూరించాలోఅంటే దానిలోఅక్షరాలు
  పూరించగలమో తెలపండి.ప్రహేళికలో అక్షరాలు ముద్రించడం
  కష్టంగా ఉంది.విధానము వివరించగలరు.
  భవదీయుడు,
  గొట్టుముక్కుల బ్రహ్మానందము

 3. మాలిక పద చంద్రిక -12 ఎలా పూరించాలో అంటే దానిలో అక్షరాలు
  పూరించగలమో తెలపండి.ప్రహేళిక లో అక్షరాలూ ముద్రించడం
  కష్టం గా ఉంది.విధానము వివరించగలరు.
  భవదీయుడు
  గొట్టుముక్కుల బ్రహ్మానందము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238