నమస్తే..
లాస్ట్ ఇష్యూలో ..ఝాన్సీ గొంతులో.. మీరు విన్న నా కథ “చిలకాకు పచ్చ రంగు చీర” బావుందన్నందుకు థాంక్స్.-ఇప్పుడింకో కథ –
ఇది ‘సుమ’ చదివింది. ” ఈ పలుకే బంగారమైన” పిచ్చి తల్లులంతా ఎంతో ఇష్టంగా చదివారు-
ఇంకో పిచ్చితల్లి ఇదిగో ఈ మాలికలో తావిచ్చింది. అన్నట్టు, ఆ పిచ్చితల్లి కథలు రాయమని ప్రేరేపించారు కదా – ఆంధ్రభూమి వీక్లీలో. అందుకోసం అందరికీ మళ్లీ థాంక్సోహం అంటున్నా-
ఇప్పుడు మీ ముందున్న కథ “మాస్టారు”
ఇప్పుడు మీ ముందున్న కథ “మాస్టారు”
ఈ కథ పాయింట్ వింటే ..ఆ పాయింట్ చెప్పడానికి మాస్టారి కథని నేపధ్యంగా ఎంచుకోనక్కర్లేదు..కదా అనిపిస్తుంది..
అనగనగా ఓ లంచాలమారి – వాడి లంచం మోజువల్ల ఏర్పడిన కెలామిటీ..ఈకధ పాయంట్! బాధసర్పద్రష్టుడుగా ఓ మాస్టారిని ఎంచుకోవడం.., మరీ బాధపడింది లంచాలమారి గారి శ్రీమతే కావడం. దీంట్లో ట్రిక్కు-, సినిమా టిక్కూ కూడా… చెప్పదల్చుకున్న అంశానికి ఇలాటి మేకప్పు లేదా ఇలాటి ప్యాకింగు ఇవ్వడం ఈ కథల్లో చేసిన ప్రయత్నం!!
బ్నిం
మాలిక పత్రిక ను మొదటి సారిగా చూస్తున్నాను. ఎన్నో శీర్షిక ల తో చదువరులను కట్టి పడవేస్తున్నది. ధనవాదాలు. బ్నిమ్ కథల ఆడియో డౌన్లోడ్ కావడం లేదు. సమస్య పరిష్కారం ఉంటే చెప్పండి. ఈ అడియో కథలు దృష్టిలోపం ఉన్నవారు వినడానికి ఎంతో అనుకూలం. మేము వారికోసం విహంగం అని కరెంట అఫ్ఫైర్స్ ఆడయో మాస పత్రిక వెలువరిస్తున్నాము. దానిలో నెలకో కథ చొప్పున అందిస్తే వారికి మనోల్లాసం కలుగుతుంది. ఈ విషయం లో మాలిక పత్రిక యాజమాన్యం సహకరించాలని ప్రార్థన. మా గుంరించి తెలుసుకోవాలంటే http://www.visionthroughears.org and http://www.visionthroughears.wordpress.com దయచేసి చూడగలరు. మా నిరంతర యజ్ఞం లో మీ సహాయాన్ని ఆర్థిస్తూ ఉమా మహేశ్వర రావు యారాశి umayarasi@gamil.com
chakkani katha. Suma maree chakkaga chadivindi