March 28, 2024

మాలిక పదచంద్రిక – 12 . Rs. 500 బహుమతి

కూర్పరి: డా. సత్యసాయి కొవ్వలి మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: సెప్టెంబర్ 25 సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org జ్యోతిగారు పదచంద్రిక కాస్త విభిన్నంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆవిడ సలహానుసారం గతంలో ఒక పదచంద్రిక సాహిత్యప్రధానంగా కూర్చాము. ఈసారి పదచంద్రిక సంగీతప్రధానంగా కూర్చాము.  ఏదైనా ఒక విషయం ప్రధానంగా తీసుకుని గడి కూర్చడంలో పదచంద్రిక కాస్తా  క్విజ్ మూసలో పడే ప్రమాదం ఉంది.  అలాగే మామూలుగా గడి కూర్చడం లో ఉన్న సౌలభ్యం ఇక్కడ ఉండదు. […]

“పంపనార్యుడు” – చారిత్రక సాహిత్య కధామాలిక – 5

రచన: మంధా భానుమతి               బనవాసి.. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అక్కడ అడుగిడినప్పటినుండి పంపనార్యుడు పరవశించి పోని క్షణం లేదు. ప్రాసాదంలో రాజుగారికి సలహాదారుగా, పాఠశాల నిర్వాహకునిగా ప్రజలందరి మన్ననలు పొందుతున్నాడు. తను రాయదల్చుకున్న కావ్యానికి కావలసిన శోధన, జ్ఞాన సముపార్జన చేస్తూనే కర్తవ్య నిర్వహణకి బద్ధుడై ఉన్నాడు. మంచిరోజు చూసుకుని, కావ్యారంభం చెయ్యాలని అనుకుంటుండగా రాజుగారి వద్ద నుంచి వర్తమానం.. సంశయిస్తూనే అందుకున్నాడు. రాజు కబురందుకుని వెళ్లిన పంపనార్యుడు, రాజావారి ఆనతితో కూడిన విజ్ఞాపన శిరసావహించి తన […]

సాంబే పరబ్రహ్మణి

రచన: రసజ్ఞ                                                                                                          శ్రీ శంకరాచార్యుల గురించి తెలియని వారుండరు. భగవంతుని చేరుకునేందుకు ఎన్నో మార్గాలను చెప్పారు కనుకనే ఈయనని శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. “మహేశ్వరః శంకర నారాయణః” అనగా మహేశ్వరుడే శంకరుడు, శంకరుడే నారాయణుడు అంటూ అద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శంకరాచార్యులు. ఈయనని ఈశ్వరుని అవతారంగా జనులు భావిస్తారు. వైష్ణవ, శాక్తేయ, గానాపత్య, సౌర, శైవ, కాపాలిక మతాలను సమన్వయించి షణ్మత స్థాపకులయ్యారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాసిన మహానుభావులు. భగవంతుడు అవసరాన్ని బట్టీ ఒక్కో రూపంలో […]

కాళిదాస కవితా సౌందర్యము

రచన : అష్టావధాని , సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్     సంస్కృతమను భాష ఒకటుందని తెలిసిన వారెవరికైనా వాల్మీకి , వ్యాసుల తదనంతరం గుర్తుకు వచ్చేది కాళిదాసే. ఈయన పురాణాలనాధారంగా చేసుకొని కావ్యాలను జనరంజకంగా రచించాడు. 1. రఘువంశము 2. కుమార సంభవము 3. ఋతు సంహారము 4. మేఘ సందేశము అనే శ్రవ్య కావ్యాలను ; 1. మాళవికాగ్నిమిత్రము 2. విక్రమోర్వశీయము 3. అభిజ్ఞాన శాకుంతలము అనే దృశ్యకావ్యాలను మహాకవి కాళిదాసు రచించాడు. […]